IPL 2025 Auction: శ్రేయస్ అయ్యర్... అప్పుడు 12 కోట్లు...ఇప్పుడు 26 కోట్లు
IPL 2025 Auction Live Updates: ఐపీఎల్ మెగా వేలం మరికొద్ది గంటల్లో మొదలుకాబోతుంది. తొలిరోజు వేలంలోకి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌తో పాటు పలువురు టీమిండియా స్టార్ క్రికెటర్లు రాబోతున్నారు.
Sun, 24 Nov 202411:02 AM IST
శ్రేయస్ అయ్యర్ రికార్డ్
శ్రేయస్ అయ్యర్ గత ఏడాది ఐపీఎల్ వేలంలో 12.25 కోట్లకు అమ్ముడుపోగా...ఈ సారి ఏకంగా 26.75 కోట్ల ధర పలికాడు. ఐపీఎల్‌లోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టీమిండియా క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
Sun, 24 Nov 202410:59 AM IST
ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్టార్క్...
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 11.75 కోట్లకు సొంతం చేసుకున్నది.
Sun, 24 Nov 202410:56 AM IST
గుజరాత్‌కు జోస్ బట్లర్
ఇంగ్లండ్ హిట్టర్ జోస్ బట్లర్‌ను 15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొన్నది.
BOOM! 💥
— IndianPremierLeague (@IPL) November 24, 2024
Jos Buttler is acquired by @gujarat_titans for INR 15.75 Crore 👌👌 #TATAIPLAuction
Sun, 24 Nov 202410:51 AM IST
ఇప్పటివరకు అమ్ముడు పోయిన క్రికెటర్లు వీళ్లే...
ఇప్పటివరకు ఐపీఎల్ వేలంలో ముగ్గురు క్రికెటర్లు అమ్ముడుపోయారు. అర్షదీప్ సింగ్ 18 కోట్లు (పంజాబ్ కింగ్స్)...కాసిగో రబాడా (గుజరాత్ టైటాన్స్ ) -10.75 కోట్లకు అమ్ముడుపోయారు. శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టీమిండియా క్రికెటర్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
Sun, 24 Nov 202410:48 AM IST
శ్రేయస్ అయ్యర్‌కకు 26 కోట్ల 75 లక్షలు...
టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొనేందుకు కోల్‌కతా, పంజాబ్ ఆసక్తిని చూపాయి. ఆ తర్వాత పోటీలోకి పంజాబ్, ఢిల్లీ వచ్చాయి. ధరను ఇరవై కోట్లకుపైగా పెంచుతూ పోతాయి. చివరకు 26 కోట్ల 75 లక్షలకకు పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకున్నది.
Sun, 24 Nov 202410:32 AM IST
రబాడాను 10.75 కోట్లకు దక్కించుకున్న గుజరాత్
సౌతాఫ్రికా పేసర్ కాసిగో రబాడాను ఐపీఎల్ వేలంలో దక్కించుకునేందుకు అన్ని ఫ్రాంఛైజ్‌లు పోటీపడ్డాయి. 10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ రబాడాను సొంతం చేసుకున్నది. ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025లో అమ్ముడుపోయిన ఫస్ట్ విదేశీ ప్లేయర్‌గా రబాడా నిలిచాడు.
Sun, 24 Nov 202410:28 AM IST
18 కోట్లకు అమ్ముడుపోయిన అర్షదీప్ సింగ్...
ఐపీఎల్ 2025లో వేలంలోకి వచ్చిన ఫస్ట్ క్రికెటర్‌గా అర్షదీప్ సింగ్ నిలిచాడు. రెండు కోట్ల బేస్ ధరతో అతడు వేలంలోకి వచ్చాడు. ఈ పేసర్ కోసం చెన్నై, ఢిల్లీ పోటీపడ్డాయి. ఆ తర్వాత మిగిలిన ఫ్రాంఛైజ్‌లు పోటీలోకి వచ్చాయి. ధరను పెంచుతూ పోయాయి. పద్దెనిమిది కోట్లకకు పంజాబ్ కింగ్స్ అతడిని సొంతం చేసుకున్నది. రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా అతడిని సొంతం చేసుకున్నది.
Sun, 24 Nov 202410:08 AM IST
ఆక్షనర్‌గా మల్లికా సాగర్
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఆక్షనర్‌గా మల్లికా సాగర్ వ్యవహరిస్తున్నారు. ఆమె ఐపీఎల్ 2024 మినీ వేలానికీ కూడా ఆక్షనర్‌గా పనిచేశారు. అలానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి కూడా ఆక్షనర్‌గా వ్యవహరించారు.
Sun, 24 Nov 202410:00 AM IST
జేమ్స్ అండరన్స్ 42 ఏళ్లు- వైభవ్ సూర్య వన్షీ 13 ఏళ్లు...
ఐపీఎల్ వేలంలో పోటీపడుతోన్న అత్యధిక వయస్కుడైన క్రికెటర్‌గా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (42 ఏళ్లు) నిలవనున్నాడు. అతి పిన్న వయస్కుడిగా ఇండియాకు చెందిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ వైభవ్ సూర్యవన్షీ అదృష్టాన్నీ పరీక్షించుకోనున్నాడు.
Sun, 24 Nov 202409:06 AM IST
అదృష్టాన్ని పరీక్షించుకోనున్న విదేశీ స్టార్లు
విదేశీ స్టార్ ప్లేయర్లు కూడా రూ. కోట్ల కనీస ధరతో వేలంలో ఉన్నారు. వీరిలో ఆస్ట్రేలియాకి చెందిన డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్ భారీ ధర పలికే అవకాశం ఉంది. అలానే ఇంగ్లాండ్‌కి చెందిన జోస్ బట్లర్,హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడాకి ఫ్రాంఛైజీలు పెద్ద ఎత్తున ఖర్చు చేసే అవకాశం ఉంది.
Sun, 24 Nov 202409:05 AM IST
రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి భారత్ క్రికెటర్లు
రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్, ఫాస్ట్ బౌలర్లు అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ తదితరులు ఉన్నారు. వీరి కోసం ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీపడే అవకాశం ఉంది. ఇక ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ కోసం ఫ్రాంఛైజీ భారీగా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నాయి.
Sun, 24 Nov 202409:04 AM IST
ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంత డబ్బు?
పంజాబ్ కింగ్స్ వద్ద రూ.110.5 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.83 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.73 కోట్లు
గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.69 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.69 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.55 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ.51 కోట్లు
ముంబయి ఇండియన్స్ వద్ద రూ45 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.45 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.41 కోట్లు
Sun, 24 Nov 202408:31 AM IST
367 మంది భారత క్రికెటర్లు...
ఐపీఎల్ వేలంలో పది ఫ్రాంఛైజ్‌లలో కలిపి 204 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం 577 మంది క్రికెటర్లు వేలంలో పోటీపడుతోన్నారు. ఇందులో 367 మంది భారత క్రికెటర్లు ఉండగా...210 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.