Personal loan : ప్రీ అప్రూవ్డ్​ లోన్​ అంటే ఏంటి? వీటిని బ్యాంకులు మన మీద ఎందుకు రుద్దాలని చూస్తున్నాయి?-personal loans how is a pre approved loan different from a regular one ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Personal Loan : ప్రీ అప్రూవ్డ్​ లోన్​ అంటే ఏంటి? వీటిని బ్యాంకులు మన మీద ఎందుకు రుద్దాలని చూస్తున్నాయి?

Personal loan : ప్రీ అప్రూవ్డ్​ లోన్​ అంటే ఏంటి? వీటిని బ్యాంకులు మన మీద ఎందుకు రుద్దాలని చూస్తున్నాయి?

Sharath Chitturi HT Telugu
Nov 24, 2024 02:46 PM IST

Pre approved loan : ‘మీకు ప్రీ- అప్రూవ్డ్​ లోన్​ ఇస్తాము,’ అని బ్యాంకుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు, మెసేజ్​ల మీద మెసేజ్​లు వస్తున్నాయి? ఇంతకు అసలు ప్రీ- అప్రూవ్డ్​ లోన్​ అంటే ఏంటో మీకు తెలుసా?

ప్రీ అప్రూవ్డ్​ లోన్​ అంటే ఏంటి?
ప్రీ అప్రూవ్డ్​ లోన్​ అంటే ఏంటి?

ఒకవేళ మీ దగ్గర డబ్బు తక్కువగా ఉంటే బ్యాంక్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) నుంచి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అయితే, కొన్ని సంస్థలు తమ కస్టమర్స్​కి ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ ఇస్తుంటాయి. ప్రీ-అప్రూవ్డ్ లోన్ విషయంలో, రుణగ్రహీతలు ఆర్థిక సంస్థకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం కూడా లేదు.

బదులుగా, వారికి ప్రీ- అప్రూవ్డ్​ పర్సనల్​ లోన్​ ఇస్తుంటాయి. సాధారణంగా, బ్యాంకులు అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి లేదా పెద్దగా రుణాలు లేని తమ కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్లను ఇస్తాయి.

కొన్ని బ్యాంకులు ఇప్పటికే కరెంట్ లోన్ ఉన్న తమ ప్రస్తుత కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ లోన్లను కూడా అందిస్తాయి. ఈ ప్రీ- అప్రూవ్డ్​ లోన్​, ప్రస్తుత రుణంపై టాప్-అప్​గా ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రీ- అప్రూవ్డ్​ లోన్​ అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాము..

ప్రీ- అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అంటే ఏమిటి?

ఇది ఒక బ్యాంకు తన ఖాతాదారుల క్రెడిట్ హిస్టరీ, ఆదాయం, బ్యాంకుతో ఉన్న సంబంధాల ఆధారంగా ఇచ్చే లోన్​ ఆఫర్.

ఖాతాదారుడు కొన్ని అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాడని బ్యాంక్ నిర్ధారించుకున్న తర్వాత 'ప్రీ-అప్రూవ్డ్' లోన్​ ఇస్తుంటాయి. తద్వారా దరఖాస్తు ప్రక్రియ సమయంలో పత్రాలను సమర్పించడం లేదా ధృవీకరించాల్సిన అవసరం ఉండదు.

కీలక ఫీచర్లు..

ఫాస్ట్ ప్రాసెసింగ్: బ్యాంకులో ఇప్పటికే కస్టమర్ ఆర్థిక వివరాలు ఉన్నందున, రుణాన్ని త్వరగా-కొన్నిసార్లు తక్షణమే పంపిణీ చేయవచ్చు.

కనీస డాక్యుమెంటేషన్: ప్రామాణిక వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లకు సాధారణంగా తక్కువ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

పూచీకత్తు లేదు: ఏదైనా సాధారణ పర్సనల్​ లోన్​ మాదిరిగా, ప్రీ-అప్రూవ్డ్ రుణాలు అన్​సెక్యూర్డ్. అంటే ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు.

ఇది తెలుసుకోండి..

1. బ్యాంక్ మీ క్రెడిట్ స్కోర్, ఫైనాన్షియల్ హిస్టరీని అంచనా వేస్తుంది.

2. మీకు అర్హత ఉంటే ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం ఆఫర్ పంపుతుంది. ఇది ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ లేదా మొబైల్ యాప్ ద్వారా మీకు చేరుతుంది.

3. ఆ తర్వాత, అంగీకరించాలా వద్దా అని నిర్ణయించడానికి ముందు రుణ మొత్తం, వడ్డీ రేటు, రుణ కాలపరిమితి వంటి నియమనిబంధనలను సమీక్షించవచ్చు.

జాగ్రత్త..

ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఎంచుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి!

A. హిడెన్​ ఛార్జీలు: ప్రాసెసింగ్ ఫీజులు లేదా ముందస్తు చెల్లింపు పెనాల్టీలను మీరు చెక్​ చేసుకోవాలి.

బి. వడ్డీ రేట్లు: రుణం ప్రీ-అప్రూవ్ చేసినప్పటికీ, అందించే వడ్డీ రేట్లు ఎల్లప్పుడూ తక్కువగా ఉండకపోవచ్చు.

సి. క్రెడిట్ స్కోర్​పై ప్రభావం: మీరు బహుళ రుణాల కోసం దరఖాస్తు చేసినా లేదా నిధులను దుర్వినియోగం చేసినా, అది మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. కాబట్టి, మీరు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Whats_app_banner

సంబంధిత కథనం