Eggs: కోడిగుడ్లను ఫ్రిజ్‍లో పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Eggs storage tips: కోడిగుడ్లు చెడిపోకుండా ఉండేందుకు చాలా మంది ఫిజ్‍లో పెడతారు. అయితే, ఫ్రిజ్‍లో గుడ్లు స్టోర్ చేసుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. దీనివల్ల మరింత ఎక్కువ కాలం గుడ్లు బాగుంటాయి. ఆ చిట్కాలు ఏవంటే..
పోషకాలు మెండుగా ఉండే కోడిగుడ్లను రెగ్యులర్‌గా తింటే చాలా మంచిది. అందుకే మాటిమాటికీ వెళ్లి కొనుక్కోకుండా ఎక్కువ గుడ్లనే చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో కోడిగుడ్లను రిఫ్రిజిరేటర్లలో (ఫ్రిజ్‍లు) ఎక్కువగా నిల్వ చేస్తున్నారు. ఫ్రిజ్‍లలో పెట్టడం వల్ల గుడ్లు చెడిపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్‍గా ఉంటాయి. అయితే, ఫ్రిజ్‍లో గుడ్లు స్టోర్ చేసే వాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ టిప్స్ వల్ల మరింత మెరుగ్గా గుడ్లు ఉంటాయి.
డోర్ వద్దు వద్దు.. లోపలే
చాలా మంది కోడిగుడ్లను రిఫ్రిజిరేటర్ డోర్‌లో పెడుతుంటారు. అయితే ఇలా చేయకూడదు. మిగిలిన భాగాలతో ఫ్రిజ్‍లో డోరే వెచ్చగా ఉండే చోటు. అందులోనూ డోర్ తెరిచినప్పుడల్లా డోర్‌లో ఉష్ణోగ్రత ఎక్కువగా మారుతుంటుంది. దీనివల్ల గుడ్డు పైభాగానికి చేటు జరుగుతుంది. అందుకే, కోడిగుడ్లను ఫ్రిజ్ బాడీ లోపల షెల్ఫ్‌లో పెట్టాలి.
ఇతర ఆహారాలకు దూరంగా..
గుడ్ల పెంకుతో పాటు లోపల కూడా సాల్మెనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత కంటే చల్లగా ఉండే ఫ్రిజ్‍లో ఈ బ్యాక్టిరీయా పెరుగదల ఎక్కువగా ఉండొచ్చు. అందుకే ఫ్రిజ్‍లో గుడ్లకు అతిదగ్గరగా ఇతర ఆహార పదార్థాలు పెట్టకపోవడమే మంచిది. వీలేతే గుడ్లకు సపరేట్ సెల్ఫ్ కేటాయించాలి. కుదరకపోతే గుడ్లకు కాస్త దూరంగా ఇతర ఆహార పదార్థాలు పెట్టాలి. మరీ దగ్గరగా ఉంచకూడదు.
కార్టన్ తరచూ క్లీన్ చేయాలి
ఫ్రిజ్‍లో గుడ్లను ప్లాస్టిక్ కార్టన్‍పై ఉంచాలి. అయితే, శుభ్రంగానే కనిపిస్తుండటంతో చాలా మంది ఆ కార్టన్‍ను క్లీన్ చేయరు. అయితే, కనీసం వారంలో రెండుసార్లైన గుడ్ల ఉండే కార్టన్‍ను నీటితో క్లీన్ చేసి.. మళ్లీ దానిపై గుడ్లు పెట్టాలి.
కోడిగుడ్డను ఒక దానికి ఒకటి తాకకుండా కూడా జాగ్రత్త పడాలి. ఏదైనా గుడ్డు పగిలిపోతే వెంటనే దాన్ని బయటికి తీసి వాడేసుకోవాలి. పగిన గుడ్డును ఫ్రిజ్‍లో అలానే పెట్టకూడదు. ఫ్రిజ్‍లో గుడ్లు మూడు నుంచి ఐదు వారాలు తాజాగా ఉంటాయి.
బయట అయితే..
ఫ్రిజ్ లేకుండా గుడ్లను బయట స్టోర్ చేస్తే గది ఉష్ణోగ్రతలో వారం నుంచి రెండు వారాల వరకు చెడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే, గుడ్ల పెంకుపై వంట నూనె రాస్తే కాస్త ఎక్కువగా తాజాగా ఉంటాయి. టిష్యూ పేపర్లో చుట్టి కూడా పెట్టవచ్చు.
టాపిక్