Malayalam OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన మలయాళం సెటైరికల్ కామెడీ మూవీ - ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్
Malayalam OTT: మలయాళం పొలిటికల్ సెటైరికల్ కామెడీ మూవీ పొరట్టు నడకం మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఆదివారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కామెడీ మూవీ ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
Malayalam OTT: మలయాళం సెటైరికల్ కామెడీ మూవీ పొరట్టు నడకం ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సెలైంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఈ కామెడీ మూవీలో సైజు కురుప్, రమేష్, అర్జున్ విజయ్, ధర్మజన్ కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్ సెటైరికల్ కామెడీ మూవీగా దర్శకుడు నౌషద్ సాఫ్రాన్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ మలయాళ సినిమాకు సీనియర్ డైరెక్టర్ సిద్ధిఖీ ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో...
ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైన పొరట్టు నడకం డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కాన్సెప్ట్‌తో పాటు కామెడీ మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్నది. కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు.ఎన్నికల ప్రభావం పల్లెటూళ్లపై ఎలా ఉంటుంది? తమ రాజకీయ స్వార్థం కోసం కొందరు నాయకులు కలిసికట్టుగా ఉన్న ఊళ్లను ఎలా విడదీస్తున్నారనే సందేశాన్ని కామెడీ జోడించి పొరట్టు నడకం మూవీలో మేకర్స్ చూపించారు.
21 రోజుల్లో ఏం జరిగింది?
గోపాలపురకు చెందిన అబూ (సైజు కురుప్) కమ్యూనిస్ట్ కార్యకర్తగా చాలా ఏళ్లుగా పనిచేస్తాడు. పార్టీలో అతడి తర్వాత చేరిన వాళ్లు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కానీ అబూ మాత్రం చిన్న కార్యకర్తగానే మిగిలిపోతాడు. ఎన్నికల టైమ్‌లో అబూను వాడుకుంటూ ఊళ్లో మత విద్వేషాల్ని రెచ్చగొట్టాలని రాజకీయ ప్రత్యర్థులు ప్లాన్ చేస్తారు. వారి పన్నాగంలో అబూ ఎలా చిక్కుకున్నాడు? ఎన్నికల టైమ్‌లో 21 రోజుల్లో ఊళ్లో ఏం జరిగింది? తన తప్పును అబూ ఎలా సరిదిద్దుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
సోషల్ మీడియాలో వైరల్...
ఎన్నికల టైమ్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయిన పలు వీడియోల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ మూవీలో కామెడీ సీన్స్‌ను రాసుకున్నాడు డైరెక్టర్. అందులో కొన్ని వర్కవుట్ అవ్వగా...మరికొన్ని నివ్వంచలేకపోయాయి. పొరట్టు నడకం సినిమాకు రాహుల్ రాజ్ మ్యూజిక్ అందిస్తూనే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించాడు.
2021లో అనౌన్స్‌మెంట్...
2021లో డైరెక్టర్ నౌషద్ పొరట్టు నడకం మూవీని అనౌన్స్‌చేశాడు. 2023లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 2024లో థియేటర్లలో రిలీజైంది.