Beetroot Leaves: బరువు తగ్గాలనుకునే వారు బీట్‍రూట్ ఆకులు తినొచ్చా?-is beetroot leaves beneficial for weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Leaves: బరువు తగ్గాలనుకునే వారు బీట్‍రూట్ ఆకులు తినొచ్చా?

Beetroot Leaves: బరువు తగ్గాలనుకునే వారు బీట్‍రూట్ ఆకులు తినొచ్చా?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 19, 2024 06:30 PM IST

Beetroot Leaves: బీట్‍రూట్ ఆకుల్లోనూ పోషకాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, బరువు తగ్గాలనుకునే వారు డైట్‍లో వీటిని తినొచ్చా.. ఓకే అయితే ఎలా తీసుకోవచ్చా అని సందేహిస్తుంటారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Beetroot Leaves: బరువు తగ్గాలనుకునే వారు బీట్‍రూట్ ఆకులు తినొచ్చా?
Beetroot Leaves: బరువు తగ్గాలనుకునే వారు బీట్‍రూట్ ఆకులు తినొచ్చా?

బీట్‍రూటే కాదు దాని ఆకులు కూడా పోషకాల్లో పవర్‌ఫుల్. బీట్‍రూట్ ఆకులు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.చాలా మందికి ఈ విషయం తెలియదు. బీట్‍రూట్ ఆకుల్లో ఐరన్, విటమిన్ ఏ, సీ, బీ6 సహా కీలకమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. క్యాలరీ చాలా తక్కువగా ఉంటాయి. అయితే, బరువు తగ్గేందుకు డైట్ చేస్తున్న వారు ఈ ఆకులను తినొచ్చా అనే డౌట్ కొందరికి ఉంటుంది. ఆ విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

వెయిట్ లాస్ కోసం తినొచ్చా?

బరువు తగ్గాలనుకునే వారు బీట్‍రూట్ ఆకులను తమ డైట్‍లో కచ్చితంగా తీసుకోవచ్చు. వెయిట్ లాస్‍కు ఇది ఎంతో తోడ్పడుతుంది. బీట్‍రూట్ ఆకుల్లో ఫైబర్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి తీసుకుంటే ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఆకలి తగ్గుతుంది. తరచూ తినాలనే ఆశను ఈ ఆకులు తక్కువ చేస్తాయి. కడుపు నిండిన ఫీలింగ్‍ను ఎక్కువ సమయం వరకు ఉంచుతాయి.

బీట్‍రూట్ ఆకుల్లో సోలబుల్, ఇన్‍సోబుల్ ఫైబర్స్ రెండు ఉంటాయి. దీంతో ఇవి తింటే జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. పేగుల కదలికను ఈ ఆకులు ఇంప్రూవ్ చేస్తాయి. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడతాయి. ఇలా కూడా బరువు తగ్గేందుకు ఈ ఆకులు తోడ్పడతాయి.

బీట్‍రూట్‍ ఆకులను ఎలా తీసుకోవచ్చు?

  • బీట్‍రూట్ ఆకులను వివిధ రకాలుగా డైట్‍లో చేర్చుకోవచ్చు. మీరు తినే సలాడ్లలో ఈ ఆకులను పచ్చిగానే యాడ్ చేసుకొని తినొచ్చు. రుచిపరంగా ఇది కాస్త పాలకూరలానే ఉంటుంది.
  • బీట్‍‍రూట్ ఆకులను కాస్త వేయించుకొని కూడా తినొచ్చు. పాలకూర, కేల్ లాంటి వాటితో కలిపి వేయించుకుంటే మరింత ప్రయోజనరకంగా, రుచికరంగా ఉంటుంది.
  • బీట్‍రూట్ ఆకులను ఉడికించి, స్ట్రీమ్ చేసి కూడా తినొచ్చు. ఇలా తీసుకున్నా పోషకాలు శరీరానికి బాగా అందుతాయి.
  • బీట్‍రూట్ ఆకులను వెజిటబుల్ స్మూతీల్లోనూ కలుపుకోవచ్చు. కూరగాయలతో కలిపి బ్లెండ్ చేసుకొని తీసుకోవచ్చు.
  • బీట్‍రూట్ ఆకులతో సూప్ కూడా చేసుకోవచ్చు. అలాగే, ఇతర కర్రీల్లోనూ ఈ ఆకులను వేసుకోవచ్చు.

బీట్‍రూట్ ఆకులతో మరిన్ని లాభాలు

బీట్‍రూట్ ఆకులను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. ఇందులో ఉండే విటమిన్ సీ.. శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు, ఇన్‍ఫెక్షన్ల నుంచి శరీరం పోరాడేందుకు తోడ్పాటునందిస్తుంది. ఈ ఆకుల్లోని నైట్రిక్ యాసిడ్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీపీ నియంత్రణలో ఉండేందుకు కూడా సహకరిస్తుంది.

కాల్షియం, మెగ్నిషియం, విటమిన్ డీ, కే ఉండే బీట్‍రూట్ ఆకులు తీసుకుంటే ఎముకల దృఢత్వం మెరుగుపడుతుంది. దీంట్లో లుటైన్, యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉండటంతో కంటి చూపునకు కూడా మేలు జరుగుతుంది.

Whats_app_banner