Kaju Katli: ఇది విన్నారా? కాజు కట్లీ స్వీట్ శాకాహారం కాదట, ఇది మాంసాహార జాబితాలోకి వస్తుందట-kaju katli sweet is non vegetarian it comes under non vegetarian list ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kaju Katli: ఇది విన్నారా? కాజు కట్లీ స్వీట్ శాకాహారం కాదట, ఇది మాంసాహార జాబితాలోకి వస్తుందట

Kaju Katli: ఇది విన్నారా? కాజు కట్లీ స్వీట్ శాకాహారం కాదట, ఇది మాంసాహార జాబితాలోకి వస్తుందట

Haritha Chappa HT Telugu
Nov 24, 2024 09:30 AM IST

ఈమధ్య ఏది మాంసాహారం? ఏది శాఖాహారం? అనే చర్చలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు సరికొత్తగా కాజు కట్లీ స్వీట్ గురించి కలకలం రేగుతోంది. ఈ ప్రసిద్ధ భారతీయ వంటకం మాంసాహారం అని అభిప్రాయం కనిపిస్తోంది.

కాజు కట్లీ స్వీట్
కాజు కట్లీ స్వీట్

కాజు కట్లీ స్వీట్ భారతీయులందరికీ ఇష్టమే. ప్రాచీన కాలం నుంచి ఈ స్వీటు ఉందని చెప్పుకుంటారు. ఇది ప్రతీ స్వీట్ షాపులో కచ్చితంగా కనిపిస్తుంది. కాజు కట్లీ స్వీట్ పైనే ఇప్పుడు వివాదం రేగింది. భారతీయ పండుగలు, వేడుకలలో కాజు కట్లీ స్వీట్ ఉండాల్సిందే. ఇంతవరకు దీని శాఖాహారంగానే అందరూ భావించారు. ఇప్పటికీ ఇది శాఖాహారమని ఎంతో మంది నమ్మకం. అయితే ఒక డాక్టర్ మాత్రం ఇది మాంసాహార జాబితాలోకి వస్తుందని చెబుతున్నారు. అతను డాక్టర్ రవి. కె గుప్తా. ఇతను ఆంకాలజిస్ట్. అతని వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వైల్ వీడియోలో అతను కాజు కట్లీ స్వీట్ పై వేసే వెండి ఆకులాంటివి మాంసాహారంతో సంబంధాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు.

2016లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ అపదిశుభ్రమైన పరిస్థితుల్లో జంతువుల నుండి ఉత్పత్తి అయ్యే పదార్థాలతో వెండి ఆకులను తయారు చేస్తున్నారని నిషేధించింది. స్వీట్లపై కనిపించే ఈ సిల్వర్ రేకులను జంతువు ఆధారిత పదార్థాలతో కూడా తయారు చేస్తారు. అయితే ఢిల్లీ కోర్టు 2018 లో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ వెండి కాగితం తయారీదారులు అది సురక్షితమైన, పరిశుభ్రంగా ఉన్నాయని పిటీషన్ వేయడంతో ఇలా నిషేధాన్ని ఎత్తివేసింది కోర్టు.

ఎప్పుడైతే ఈ వెండి ఆకును జంతువుల నుంచి వచ్చే కొన్ని పదార్థాలతో తయారు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయో అప్పటినుంచి దాన్ని పూర్తి శాకాహార పద్ధతిలో తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అవి చాలా వరకు విజయవంతం అయ్యాయి. ఈ సిల్వర్ వర్క్‌ను శాకాహార పద్ధతిలో తయారు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికీ మాంసాహార ఆధారిత పదార్థాలతో తయారుచేస్తున్న వెండి ఆకులు కూడా ఉన్నాయి. ఈ కాజు కట్లీపై ఉన్న సిల్వర్ రేకు దేనితో తయారు చేసిందో అంచనా వేయడం కష్టమే. అది మాంసాహార జంతువు ఆధారిత పదార్థాలతో కూడా తయారు చేసి ఉండవచ్చు. లేదా శాకాహార పద్ధతిలో కూడా చేసి ఉండవచ్చు. ఒకవేళ దాన్ని జంతు ఆధారిత పదార్థాలతోనే చేస్తే మాంసాహారం లోకి కోవలోకే వెళుతుందని ఈ డాక్టర్ వాదిస్తూ వచ్చారు.

సిల్వర్ ఆకులపై వేసిన వెండి రేకులు దేనితో తయారు చేశారో స్వీట్లు అమ్మే విక్రతను అడిగి తెలుసుకోండి. కానీ వారు సరైన సమాధానం చెబుతారని నమ్మకం మాత్రం లేదు. కాబట్టి కాజు కట్లీ పై సిల్వర్ రేకు పెట్టి ఉంటే అది తినాలో వద్దు మీరే నిర్ణయించుకోవాలి. మాంసాహారులు మాత్రం దీన్ని హ్యాపీగా తినవచ్చు.

సిల్వర్ రేకులు కేవలం కాజు కట్లీ స్వీట్లపైనే కాదు అనేక స్వీట్లపై వేస్తారు. కాబట్టి అలా వేసిన స్వీట్లను తినాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి.

Whats_app_banner