Ola Electric : కొన్న నెలకే రూ. 90వేల సర్వీస్ బిల్లు- విసుగెత్తిపోయిన కస్టమర్! ఎలక్ట్రిక్ స్కూటర్ని..
Ola Electric viral video : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే రూ.90,000 సర్వీసింగ్ బిల్లు రావడంతో ఓనర్‌కి కోపం వచ్చింది. సుత్తి తీసుకుని, షోరూమ్ ఎదురుగానే స్కూటర్ని ధ్వంసం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశంలో ఓలా ఎలక్ట్రిక్‌కి, ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకు కష్టాలు కొనసాగుతున్నాయి! ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. సర్వీస్ బాగోలేదన్న కారణంగా ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ని కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి తగలబెట్టిన వార్త వినే ఉంటారు. ఇక ఇప్పుడు.. మరో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఓనర్ షోరూమ్ ముందే, తన వాహనాన్ని సుత్తితో ధ్వంసం చేశాడు. ఈవీని కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే రూ.90,000 సర్వీసింగ్ బిల్లు వచ్చిందని, అందుకే ఇలా చేసినట్టు అతను చెప్పుకోచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ కష్టాలు..!
కమెడియన్ కునాల్ కమ్రా ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్‌ని బహిరంగంగా విమర్శించిన కొన్ని రోజుల తరువాత ఈ వీడియో వైరల్ అవ్వడం గమనార్హం. తాజాగా జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలో ఆయన్ని కూడా ట్యాగ్ చేశారు.
అయితే వీడియో లొకేషన్ తెలియరాలేదు.
ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన బ్లూ-ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని సుత్తితో ధ్వసం చేయడం కనిపిస్తుంది. నెల రోజుల స్కూటర్ సర్వీసింగ్ కోసం రూ.90 వేలు చెల్లించాలని చెప్పడంతో యజమాని తన వాహనాన్ని ధ్వంసం చేస్తున్నాడని వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు!
ఎక్స్‌లో షేర్ చేసిన మరో వీడియోలో.. మరొక వ్యక్తి కూడా స్కూటర్ని ధ్వంసం చేయడానికి ముందుకొచ్చాడు. క్షణాల్లో అతను కూడా స్కూటర్ని పగలగొట్టడం ప్రారంభిస్తాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఫలితంగా.. వినియోగదారులకు ఓలా ఎలక్ట్రిక్ ఆఫ్టర్-సేల్ సర్వీస్ గురించి చర్చలు మొదలయ్యాయి.
ఈ విషయంపై కంపెనీ స్పందన..
ఈ సంఘటనపై కంపెనీకి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు కూడా రాలేదు.
సోషల్ మీడియా రియాక్షన్..
ఒక సోషల్ మీడియా యూజర్ కంపెనీ సేవలను విమర్శిస్తూ, "దురదృష్టవశాత్తు ఇదే వాస్తవం! కంపెనీ.. సరైన సర్వీస్ ఇవ్వడం లేదు. పైగా మరమ్మతులకు అధిక బిల్లు ఇస్తారు! ఆ బిల్లు చెల్లించడానికి బదులుగా ఎవరైనా పెట్రోల్ స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేయవచ్చు," అని అన్నడు.
మరొక యూజర్ దీనిని ఫేక్ న్యూస్ అని పిలిచాడు. “నేను కథనాన్ని నమ్మను. ఈ రోడ్ సైడ్ డ్రామా కంటే 90 వేల రూపాయల బిల్లు ఉన్న డాక్యుమెంట్లు చూపించండి! నిరుద్యోగ పెన్షనర్ కమ్రా ద్వారా ఓలా ప్రతిష్ఠను దెబ్బతీసే మరో ప్రయత్నం ఇది,” అని ప్రముఖ 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థను వెనకేసుకొచ్చాడు.
"ఈ అవినీతి రాజకీయ నాయకుల పాలనలో భారత్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఓలా ఎలక్ట్రిక్ మంచి ఉదాహరణ!" అని మరొకరు అభిప్రాయపడ్డారు.
"ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం రెగ్యులేటరీ యంత్రాంగాన్ని తీసుకురావాలి," అని ఇంకొకరు పేర్కొన్నారు.
ఓలా ఎలక్ట్రిక్‌పై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు 90శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు సంస్థ చెబుతోంది. అయినా, ఈ ఎలక్ట్రిక్2 వీలర్‌కి సంబంధించి రోజుకే వార్త వైరల్ అవుతోంది!
సంబంధిత కథనం