అందరికి అందుబాటు ధరలో బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది- రేంజ్ కూడా ఎక్కువే.!
- ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు షిఫ్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యం ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనేందుకు ఆలోచిస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్టా గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

(1 / 5)
ఏథర్ రిజ్టా ఈ-స్కూటర్.. 450ఎక్స్‌ని రూపొందించిన ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. మెయిన్ ఫ్రేమ్ ఒకేలా ఉన్నప్పటికీ, తక్కువ సీటు హైట్‌తో మోడల్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి సబ్ ఫ్రేమ్ కొత్తగా వచ్చింది. ఈ స్కూటర్ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 80కేఎంపీహెచ్.
(Ather Rizta)(2 / 5)
ఏథర్ రిజ్టా 2.9 కిలోవాట్ల యూనిట్‌తో వివిధ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌ని పొందుతుంది. అయితే 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది!
(Ather Rizta)(3 / 5)
ఈ ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. ఎస్ (2.9 కిలోవాట్), జెడ్ (2.9 కిలోవాట్), జెడ్ (3.7 కిలోవాట్).
(Ather Rizta)(4 / 5)
2.9 కిలోవాట్ వెర్షన్లలో 0-80శాతం ఛార్జింగ్‌కి 5 గంటల 45 నిమిషాలు పడుతుంది. 3.7 కిలోవాట్ల వెర్షన్ ఫాస్ట్ ఛార్జింగ్ పొందుతుంది. 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు
(Ather Rizta)ఇతర గ్యాలరీలు