Gunde Ninda Gudi Gantalu Today Episode: శ్రుతిపై హత్యాప్రయత్నం- అత్తకు ఎదురుతిరిగిన మీనా- భార్యను వెనుకేసుకొచ్చిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial November 25 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 25 ఎపిసోడ్‌లో ఇంటి బయట టపాసులు కాలుస్తున్న శ్రుతిపైకి కారుతో గుద్ది చంపాలని ప్రయత్నిస్తాడు సంజు. కానీ, రవి వచ్చి అడ్డుకుంటాడు. దాంతో శ్రుతి కాలికి గాయం అవుతుంది. మరోవైపు మీనాకు సపోర్ట్‌గా ప్రభావతితో మాట్లాడుతాడు బాలు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి మీకు ముందే తెలుసు కదమ్మా అని మీనా అంటుంది. తెలుసమ్మా. ఎంగేజ్‌మెంట్‌లో చూశాను కదా అని సుగుణ అంటుంది. దానికంటే ముందే రోహిణి మీకు తెలుసు కదా అని అడుగుతున్నాను అని మీనా అంటుంది.
కూతురు దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు
అలాంటిదేం లేదమ్మా. మీతోనే పరిచయం అని సుగుణ అంటుంది. లేదు మీ ఇద్దరు బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడుకుంటారు. మీ ఇద్దరికి ఇంతకుముందే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అని మీనా డౌట్ పడుతుంది. లేదమ్మా. తనను చూస్తే నా కూతురులా అనిపిస్తుంది. నా కూతురు నాతో ఉండదు. వాళ్ల దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు అని సుగుణ అంటుంది. ఎందుకు వెళ్లలేరు అని మీనా అంటే.. ఆడపిల్లను ఇచ్చాకా వాళ్ల పిల్ల అవుతుంది. ఏవో సమస్యలు ఉంటాయి అని సుగుణ అంటుంది.
మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావొచ్చు అని మీనా హామీ ఇస్తుంది. తర్వాత సత్యం ఫ్యామిలీ అంతా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. రవి మాత్రం దూరంగా ఉండి ఒంటరిగా చూస్తూ ఉంటాడు. తర్వాత చింటు టపాసులు కాలుస్తుంటాడు. వీళ్లను చూస్తుంటేనే చిరాకుగా ఉంది. ఆ పూలవాళ్లు వస్తేనే చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు ఈవిడ వచ్చింది. వాడు చూడు ఇంటి మనవడిలా దర్జాగా కాలుస్తున్నాడు అని మనోజ్ అంటాడు.
అదే కదరా నాకు అర్థం కానిది. ఈ మీనా వల్లే ఇదంతా. అడ్డమైనవాళ్లందరూ వస్తున్నారు అని ప్రభావతి అంటుంది. ఆ మాటలు విన్న రోహిణి నొచ్చుకుంటుంది. మనోజ్, ప్రభావతి మాటలను సుగుణ వింటుంది. పిల్లాడితో కాలిపిస్తున్నారు. మీకు కాల్చడానికి భయమా అని బాలుతో సెటైర్లు వేస్తుంది మీనా. దాంతో టపాసులు కాలుస్తాడు బాలు. ఆ భయంతో బాలును హగ్ చేసుకుంటుంది మీనా. ఇప్పుడు బయటపడింది ఎవరికి భయమో అని బాలు అంటాడు.
ఆఖరి దీపావళి అవుతుంది
క్రాకర్స్ కాలుస్తుండగా రోహిణి మనల్ని ఫొటో తీయమని, వాళ్ల నాన్నకు పంపిద్దామని, తనను ఎంత బాగా చూసుకుంటున్నామో ఆయనకు తెలుస్తుందని మనోజ్‌తో అంటుంది ప్రభావతి. దాంతో వాళ్లు ఫొటోలు దిగుతారు. వాళ్లేనా దిగేది నువ్ కూడా దిగరా అని బాలుతో అంటుంది సుశీల. బాలు సైలెంట్‌గా ఉండటంతో మౌనికతో ఫొటోలు తీయిస్తుంది సుశీల. బాలు, మీనాను పిక్స్ తీస్తుంది మౌనిక. మా అమ్మ అనవసరంగా వచ్చింది. నిజం తెలిస్తే ఇదే నా ఆఖరు దీపావళి అవుతుంది అని రోహిణి భయపడుతుంది.
కుటుంబాన్ని చూస్తూ బాధగా వెళ్లిపోతాడు రవి. తర్వాత చింటు కళ్లలో నిప్పురవ్వ పడుతుంది. దాంతో చింటూ అంటూ తల్లి ప్రేమతో హగ్ చేసుకుంటుంది రోహిణి. నీకు ఏం కాలేదు కదా. ఏమైంది. చూడని అని హగ్ చేసుకుంటుంది రోహిణి. దాంతో అంతా షాక్ అవుతారు. తర్వాత చింటూ ఎలా ఉందని బాలు అడుగుతాడు. నువ్వేంటీ పార్లరమ్మా అలా కంగారుగా పరిగెత్తావ్ అని బాలు అంటాడు. నీకేమైనా అయితే అని మనోజ్ అంటాడు.
అందరూ నీలా తన గురించే ఆలోచించరు కదా. వదిన డేర్ చేసినట్లు నువ్ లైఫ్‌లో చేయలేవు అని మౌనిక అంటుంది. పిల్లాడిని మీతోపాటే పక్కన ఉండి చూసుకోమ్మా అని సుగుణతో కోపంగా అంటుంది రోహిణి. తర్వాత ఇంటికిళ్లి తన కుటుంబం సెలబ్రేషన్స్ గురించి, బాలు అన్న మాటల గురించి ఆలోచిస్తుంటాడు రవి. ఇంతలో శ్రుతి వచ్చి క్రాకర్స్ తెచ్చాను. మీ ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది. రవి డల్‌గా ఉండటంతో ఏమైందని అడుగుతుంది. పండుగ పూట ఇలా ఉంటే ఇబ్బందిగా ఉంటుందని, వాళ్లు రమ్మంటే వెళ్లావుగా అంటుంది.
ఓదార్చిన శ్రుతి
వాళ్లు రమ్మనలేదు. మా నానమ్మ కాల్ చేస్తే వాళ్లంతా రమ్మన్నారనుకున్నాను అనుకున్నాను. నానమ్మకు నిజం తెలియకుండా ఫోన్ చేసింది. అంతా కలిసిపోతామని ఆశతో వెళ్లాను. కానీ, మా బాలు అన్నయ్య ఇంట్లోకి కూడా రానివ్వలేదు, నానా మాటలు అని గెంటేశాడు అని రవి ఏడుస్తాడు. పోనిలే వాళ్లకు మనపై కోపం పోనట్టుందని శ్రుతి ఓదారుస్తుంది. అయినా నీకు నేను లేనా. నాకు నువ్ లేవా. మనమెందుకు బాధపడాలి. పెళ్లి తర్వత ఇది మొదటి దీపావళి. మనం సంతోషంగా ఉందాం అని రవికి చక్కిలిగింతలు పెడుతుంది శ్రుతి.
దాంతో రవి నవ్వుతాడు. మనమెంతా సంతోషంగా ఉన్నామో వాళ్లకు తెలియాలి. పదా క్రాకర్స్ కాలుద్దాం అని రవి, శ్రుతి బయటకు వస్తారు. అక్కడ కారులో సంజు ఉంటాడు. రవి, శ్రుతి టపాసులు కాలుస్తూ సంతోషంగా ఉంటే సంజు కోపంగా ఫీల్ అవుతాడు. నన్ను మోసం చేసి హ్యాపీగా ఉంటారా. ఈ పండుగ మీకు బ్యాడ్ మెమోరీ అయ్యేలా చేస్తాను. మీ మొహంలో ఆ సంతోషం లేకుండా చేస్తాను అని సంజు అనుకుంటాడు.
థౌజండ్ వాలా పైన పెట్టొచ్చాను. తీసుకొస్తావా అని రవిని పైకి పంపిస్తుంది శ్రతి. టపాసులు కాలుస్తున్న శ్రుతిని కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంటాడు సంజు. శ్రుతిపైకి కారును తీసుకెళ్తుండగా.. అప్పుడే వచ్చిన రవి శ్రుతిని పక్కకు లాగుతాడు. దాంతో శ్రుతి కాలికి గాయం అవుతుంది. ఛ అనుకుంటా సంజు వెళ్లిపోతాడు. తర్వాత కాలు నొప్పిగా ఉందని శ్రుతి అనడంతో ఎత్తుకుని పైకి తీసుకెళ్తాడు రవి. ఇప్పుడు మిస్ అయింది. నెక్ట్స్ టైమ్ వదలా అని సంజు అనుకుంటాడు.
రోహిణిని చూస్తూనే
తర్వాత శ్రుతి కాలికి రవి ఆయింట్‌మెంట్ రాస్తాడు. దాన్ని ప్రేమగా చూస్తుంది. ఇప్పుడెలా ఉంది. నీకేమైనా అయితే నేను ఏమైపోవాలి అని రవి అంటే నాకు ఏం కాదని శ్రుతి అంటుంది. ఏం కానివ్వను అని రవి ముద్దు పెడతాడు. మరోవైపు వెళ్లిపోతామని సుగుణ అంటుంది. రాత్రి అయింది, భోజనం చేసి ఉదయం వెళ్లమని సుశీల, మీనా అంటారు. ఏం కానివాళ్లం ఇలా ఉంటే మీకు ఇబ్బంది అని చింటును తీసుకొని సుగుణ వెళ్లిపోతుంది. రోహిణిని చూస్తూనే చింటూ వెళ్తాడు.
అది చూసి రోహిణి కంగారుపడితుంది. ఇంట్లో వాళ్లు కూడా చూస్తారు. అదేంటీ రోహిణి ఆ పిల్లాడు నిన్ను చూస్తూ వెళ్తున్నాడు అని ప్రభావతి అడుగుతుంది. మనం ఏది ఇస్తే అదే ఇస్తారు. ఆ పిల్లాడిని పార్లరమ్మ కాపాడింది కదా. చనిపోయిన వాళ్లమ్మా గుర్తొచ్చినట్లుంది. అందుకే బాధగా చూస్తూ వెళ్లిపోయాడని బాలు అంటాడు. చిన్నపిల్లాడికి అయిన భోజనం పెట్టాల్సింది. ఇంటి కోడలిగా ఉండమన్నావా అని సుశీల అంటుంది. వాడు ఏమైనా నా మనవడా. మనకేంటీ సంబంధం అని ప్రభావతి అంటుంది.
యాక్సిడెంట్ అయినప్పుడు
అలా అనుకుంటున్నావనే వెళ్లిపోయారు అని సత్యం అంటాడు. తర్వాత అంతా ప్రభావతిపై పడి మాటలు అంటారు. వాళ్లకు మనకేం సంబంధం అని ప్రభావతి అంటే.. నువ్ అలా అనుకున్నావ్. కానీ, మీనాకు వాళ్ల ఊరిలో యాక్సిడెంట్ అయినప్పుడు అలా అనుకోలేదు. అందుకే చేరదీశారు అని బాలు అంటాడు. నీకు పూలు అమ్ముకునేవాళ్లు, కట్టెలు అమ్ముకునేవాళ్లే నచ్చుతారు. ఇంట్లోవాళ్లు నచ్చరు. నానమ్మ అడిగింది కదా. మధ్యలో నీ భార్య పెత్తనం ఏంటీ. తన పుట్టింటి నుంచి ఏమైనా తెచ్చి పెట్టిందా అని ప్రభావతి అంటుంది.
మరి నువ్ నీ పుట్టింటి నుంచి ఏమైనా తీసుకొచ్చావా. సరుకులు తెచ్చేది నేను. వండేది మీనా. మధ్యలో మీనా పుట్టింటివాళ్ల దాకా ఎందుకు వెళ్తున్నావ్ అని మీనాకు సపోర్ట్‌గా మాట్లాడుతాడు బాలు. ఏంట్రోయి దాన్ని వెనుకేసుకొస్తున్నావ్. అప్పుడే అది చేసినవన్ని మర్చిపోయావా. నీ భార్య అంత గొప్ప గుణమున్నదే అయితే మీ నాన్నని అని ప్రభావతి అనబోతుంటే సత్యం ఆపుతాడు. ఏం మాట్లాడుతున్నావ్. తన భార్యను వెనుకేసుకొస్తే నీకేంటీ. నువ్ ఎప్పుడు మీనాను అర్థం చేసుకోలేవు అని సత్యం కోప్పడతాడు.
ఎదురుతిరిగిన మీనా
పండుగ పూట పనికిమాలిన పంచాయతీ ఎందుకు అని సుశీల అంటుంది. బాలు వెళ్తూ నోరు జారే ముందు ఎవరున్నారో చూసుకోని పెద్దరికం ఎందుకు అని ప్రభావతిని అంటాడు. తర్వాత ముళ్లకంప పూలగంపపై మాట పడనీయట్లేదే. పూలగంప థ్యాంక్స్ చెబుతుంది అని మీనా అంటుంది. నువ్ అసలు రవికి పెళ్లి చేయనివ్వకపోతే ఇదంతా జరిగేది కాదని బాలు అంటాడు. తర్వాత సరుకులు వస్తున్నాయని ఎవరు కడతారు అని ప్రభాతి అంటుంది.
నాకు డబ్బులు ఇవ్వలేదు అని మీనా అంటుంది. మీ ఇంటికి పండక్కి వచ్చినప్పుడు అంతా ఊదేశారా. ఖర్చులన్ని వాడి మీద రుద్దేశారా అని ప్రభావతి అంటుంది. అంతలా దిగజారి ఎవరు బతకట్లేదు అని మీనా అంటుంది. సిగ్గుండాలి భార్యతోపాటు ఇంట్లో పడి తినడానికి అని ప్రభావతి అంటుంది. ఆపండి అత్తయ్య. మీరు నా భర్తకు పేర్లు పెట్టకండి అని ప్రభావతిని ఎదురిస్తుంది మీనా. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.
టాపిక్