US Stock market investment : అమెరికా స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడులతో రెట్టింపు లాభాలు!-all you need to know about us stock market investment from india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  All You Need To Know About Us Stock Market Investment From India

US Stock market investment : అమెరికా స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడులతో రెట్టింపు లాభాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 13, 2022 11:04 AM IST

US Stock market investment from India : స్టాక్​ మార్కెట్​ ప్రపంచంలో.. అమెరికా సూచీలకు ప్రత్యేక స్థానం ఉంటుంది! అక్కడ ఏం జరిగినా.. ప్రపంచంలోని మొత్తం స్టాక్​ మార్కెట్లపై ప్రభావం పడుతుంది. అలాంటి యూఎస్​ స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులు చేయాలని చాలా మంది భారతీయులు భావిస్తున్నారు. పైగా.. ఈ ఏడాది అమెరికా స్టాక్​ మార్కెట్లు భారీగానే పతనమయ్యాయి. ఇదే మంచి సమయం అని స్టాక్​ మార్కెట్​ నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అమెరికా స్టాక్​ మార్కెట్​ బేసిక్స్​తో పాటు అసలు అక్కడ ఎందుకు పెట్టుబడులు పెట్టాలి? ఎవరు ఇన్​వెస్ట్​మెంట్​ చేయాలి? అన్న విషయాలను తెలుసుకుందాము.

అమెరికా స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడులతో రెట్టింపు లాభాలు!
అమెరికా స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడులతో రెట్టింపు లాభాలు! (REUTERS)

US Stock market investment from India : ఇండియాలో దలాల్​ స్ట్రీట్​ ఉన్నట్టు.. అమెరికాలో వాల్​ స్ట్రీట్​ ఉంటుంది. ఇండియాలో సెన్సెక్స్​, నిఫ్టీలాగే.. అమెరికాలో ఎస్​ అండ్​ పీ 500, డౌ జోన్స్​ ఇండస్ట్రియల్​ యావరేజ్​, నాస్​డాక్​ కాంపోజిట్​ ఇండెక్స్​ సూచీలు కీలకంగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

ఎస్​ అండ్​ పీ 500..

స్టాండర్డ్​ అండ్​ పూర్స్​ 500 ఇండెక్స్​లో.. అమెరికాలోని టాప్​ 500 కంపెనీలు ఉంటాయి. మార్కెట్​ క్యాపిటలైజేషన్​ ఆధారంగా వీటిని ఎంపిక చేస్తారు. లిక్విడిటీ, పబ్లిక్​ ఫ్లోట్​, సెక్టర్​ క్లాసిఫికేషన్​, ఫైనాన్షియల్​ వాల్యూ, ట్రేడింగ్​ హిస్టరీని కూడా ఒకింత పరిగణలోకి తీసుకుని.. స్టాక్స్​ని ఇందులోకి యాడ్​ చేస్తారు.

S and P 500 index : అమెరికా స్టాక్​ మార్కెట్​ మొత్తం వాల్యూలో ఎస్​ అండ్​ పీ 500 ఇండెక్స్ సుమారు​ 80శాతం ఉంటుంది! ఒక్క మాటలో చెప్పాలంటే.. అమెరికా స్టాక్​ మార్కెట్ల కదలికను.. ఈ ఎస్​ అండ్​ పీ 500 ద్వారా చెప్పేయొచ్చు. ఇదొక మార్కెట్​- వెయిటెడ్​ ఇండెక్స్​.

డౌ జోన్స్​ ఇండస్ట్రియల్​ యావరేజ్​..

ప్రపంచ స్టాక్​ మార్కెట్​ చరిత్రలో అత్యంత పురాతనమైనది ఈ డౌ జోన్స్​ ఇండెక్స్​. యూఎస్​లో 30 అతిపెద్ద, ప్రభావితమైన కంపెనీల స్టాక్స్​ ఇందులో ఉంటాయి.

Dow Jones index : అమెరికాలోని మొత్తం స్టాక్​ మార్కెట్​ వాల్యూలో డౌ జోన్స్​ పావు వంతు ఉంటుంది. ఇదొక ప్రైజ్​-వెయిటెడ్​ ఇండెక్స్​.

అమెరికాలో.. రెగ్యులర్​గా డివిడెండ్లు ఇచ్చే బ్లూ చిప్​ కంపెనీలకు ఈ డౌ జోన్స్​ ఇండెక్స్​ ప్రాతినిథ్యం వహిస్తుంది. ఇందులో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటే.. ఆయా కంపెనీల ఆదాయంపై మదుపర్లలో అంచనాలు మారుతూ ఉంటాయి.

నాస్​డాక్​ కాంపోజిట్​ ఇండెక్స్​..

Nasdaq index : అమెరికాలోని టెక్​ స్టాక్స్​ ఉండి ఇండెక్సే.. ఈ నాస్​డాక్​ కాంపోజిట్​. దీని కదలికల బట్టి టెక్​ స్టాక్స్​ పరిస్థితిని మదుపర్లు అంచనా వేస్తూ ఉంటారు. అమెరికాలో లేని టెక్​ సంస్థలు కూడా ఇందులో ఉంటాయి. టెక్నాలజీతో పాటు ఫైనాన్షియల్​, ఇండస్ట్రీస్​, ట్రాన్స్​పోర్ట్​ సెక్యూరిటీస్​కి చెందిన స్టాక్స్​ కూడా ఇందులో చూడవచ్చు. ఇందులో 3,000కుపైగా స్టాక్స్​ లిస్ట్​ అయ్యి ఉన్నాయి.

అమెరికా స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​..

ఇండియాలో స్టాక్​ మార్కెట్లు.. 9:15 నుంచి 3:30 వరకు పనిచేస్తాయన్న సంగతి తెలిసిందే. కాగా.. భారత కాలమానం ప్రకారం అమెరికా స్టాక్​ మార్కెట్లు.. రాత్రి 7 గంటల నుంచి ఆర్ధరాత్రి 1:30 గంటల వరకు పనిచేస్తాయి.

అమెరికా స్టాక్​ మార్కెట్లు.. ఎందుకంత ముఖ్యం?

US Stock market investment : ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా కొనసాగుతోంది. ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ.. అగ్రరాజ్యం ముందుకెళుతోంది. ప్రపంచ స్టాక్​ మార్కెట్లను.. ప్రభావితం చేయగలిగే శక్తి యూఎస్​ సూచీలకు ఉండటం వెనుక ప్రధాన కారణాలు ఇవే! ఇక్కడ.. ద్రవ్యోల్బణం నుంచి ఫెడ్​ వడ్డీ రేట్ల నిర్ణయం వరకు.. అంతర్జాతీయ మార్కెట్లన్నీ ప్రభావితమవుతాయి.

ఇటీవల నెలకొన్న పరిణామాలను ఉదాహరణగా తీసుకుందాము. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోందంటే.. అంతర్జాతీయంగా మార్కెట్లు పడతాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు.. వడ్డీ రేట్లను ఫెడ్​ పెంచినా పడతాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుంటే.. మార్కెట్లు పెరుగుతాయి.

ఇదంతా పక్కన పెడితే.. యాపిల్​, గూగుల్​, మైక్రోసాఫ్ట్​ సంస్థలకు చెందిన ఎన్నో ప్రాడక్టులు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. లైఫ్​ స్టైల్​ను ప్రభావితం చేసేంతగా ఒక కంపెనీ వృద్ధిచెందితే.. అది దీర్ఘకాలంలో మంచి లాభాలనే ఇస్తుందని స్టాక్​ మార్కెట్​ చరిత్ర చెబుతోంది. ఇలాంటి ఎన్నో కంపెనీలు లిస్ట్​ అయి ఉన్న అమెరికా స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడులు చేసేందుకు మదపర్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఈ బడా కంపెనీలు మెరుగైన ప్రదర్శన చేస్తే.. మార్కెట్లు పెరుగుతాయి. కానీ.. కంపెనీల్లో లోపాలు ఉండి, ఫలితాలు దారుణంగా ఉంటే.. ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా అమెరికా మార్కెట్లు పడతాయి. అంత బడా కంపెనీల ఫలితాలే దారుణంగా వస్తుంటే.. ఇతర వాటి పరిస్థితేంటని? భయపడే మదుపర్లు.. ఇతర మార్కెట్లలో అమ్మకాలవైపు మొగ్గుచూపుతారు.

ఫ్రాక్షనల్​ షేర్స్​..

US stock market news : అమెరికాలో స్టాక్స్​ అన్నీ డాలర్లలో ఉంటాయి. ఉదాహరణకు ప్రస్తుతం రూపీతో పోల్చుకుంటే డాలర్​ విలువ 80 వద్ద ఉందని అనుకుందాము. ప్రస్తుతం యాపిల్​ స్టాక్​ ప్రైజ్​ 149.70 డాలర్ల వద్ద ఉంది. అంటే.. ఒక యాపిల్​ స్టాక్​ కొనాలంటే రూ.11 వేల కన్నా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అయితే.. ఇక్కడ ఓ వెసులుబాటు ఉంటుంది. అదే 'ఫ్రాక్షనల్​ షేర్స్​'. మొత్తం షేర్లు కొనుగోలు చేయకుండా.. ఆ షేర్లలో ఒక్కో వంతు భాగాన్ని కొనొచ్చు. ఫలితంగా తక్కువ డబ్బులతో స్టాక్స్​ను పోర్ట్​ఫోలియోలో యాడ్​ చేసుకోవచ్చు.

అమెరికా స్టాక్​ మార్కెట్లలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

Why to invest in US stock markets : తాజా పరిస్థితులను గమనిస్తే.. ఇండియా మార్కెట్లు.. అమెరికా మార్కెట్లతో డీకపుల్​ అయ్యాయి. అంటే.. అమెరికా మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై పెద్దగా కనిపించడం లేదు. కానీ అమెరికాలోని మూడు ప్రధాన సూచీలు.. ఈ ఏడాదిలో బేర్​ మార్కెట్​లోకి వెళ్లాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఎస్​ అండ్​ పీ 500 16.75శాతం పతనమైంది. నాస్​డాక్​ సూచీ 28.5శాతం పడిపోయింది. డౌ జోన్స్​.. ప్రస్తుతం 7.76శాతం నష్టాల్లో ఉంది.

ఈ సమయంలో అమెరికా మార్కెట్లలో ఎంట్రీ తీసుకుంటే.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డైవర్సిఫికేషన్​:- సాధారణంగా.. పెట్టుబడుల విషయంలో డైవర్సిఫికేషన్​ అన్న పదం ఎక్కువగా వినిపిస్తుంది. పోర్ట్​ఫోలియో డైవర్సిఫైడ్​గా ఉండాలని భావించే వారు అమెరికా స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు.

దీర్ఘకాలం కోసమే:- విదేశీ స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడులు అంటే.. దీర్ఘకాలం గోల్స్​తోనే ఉండాలి. స్వల్ప కాలం గోల్స్​తో పెట్టుబడులు పెడితే.. ఖర్చులు, ట్యాక్స్​పోనూ పెద్దగా లాభాలు కనిపించవు!

How to invest in US stock market : డాలర్​ కన్వర్షన్​:- ఇండియా నుంచి రూపీని డాలరుగా మార్చి.. అమెరికాలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కొనుగోలు చేసిన స్టాక్​.. రెండేళ్ల తర్వాత కూడా అదే ప్రైజ్​ వద్ద ఉన్నా మనకు లాభమే వస్తుంది. ఎందుకంటే.. రూపీతో పోల్చుకుంటే డాలర్​ విలువ నిరంతరం బలపడుతూనే ఉంటుంది కాబట్టి!

క్యాపిటల్​:- క్యాపిటల్​ ఎక్కువగా ఉంటేనే విదేశీ మార్కెట్లలో పెట్టుబడుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ట్యాక్స్​, డాలర్​ కన్వర్షన్​ వంటిని పరిగణలోకి తీసుకోవాలి. ఆర్​బీఐ రూల్స్​ ప్రకారం.. ఓ వ్యక్తి ఏడాదిలో 2,50,000 డాలర్లు మాత్రమే విదేశీ స్టాక్​ మార్కెట్లలోకి తరలించగలడు.

నెగిటివ్స్​..

US Stock markets : అమెరికా స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడుల విషయంలో.. ఇండియాలోని ట్యాక్స్​ స్ట్రక్చర్​ నెగిటివ్​గా కనిపిస్తుంది. ఇండియా స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులతో పోల్చుకుంటే.. విదేశీ మార్కెట్​లో పెట్టుబడులను అన్​లిస్టెడ్​ స్టాక్స్​గా పరిగణిస్తుంది ప్రభుత్వం. ఫలితంగా ట్యాక్స్​ స్ట్రక్చర్​ వేరుగా ఉంటుంది. ఇండియాతో పోల్చుకుంటే.. పన్నులు ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది.

ఇక డాలర్​ కన్వర్షన్​ ఛార్జీలు కూడా ఒకింత ఎక్కువగా ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం