Mid cap mutual fund : రిస్క్​కు సిద్ధమా? మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో క్రేజీ రివార్డు!-what is mid cap mutual fund in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  What Is Mid Cap Mutual Fund In Telugu

Mid cap mutual fund : రిస్క్​కు సిద్ధమా? మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో క్రేజీ రివార్డు!

Sharath Chitturi HT Telugu
Aug 10, 2022 11:43 AM IST

Mid cap mutual fund in telugu : మీరు రిస్క్​ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో అదిరిపోయే రీతిలో రిటర్నులు వస్తాయి. ఇంతకీ అసలు మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?
మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి? (MINT_PRINT)

Mid cap mutual fund in telugu : స్టాక్​ మార్కెట్​పై సమయం కేటాయించలేని వారు.. సహజంగా మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కానీ దేశంలో ఎన్నో రకాల మ్యూచువల్​ ఫండ్స్​ ఉన్నాయి. మరి వాటిల్లో ఏది ఎంచుకోవాలి? అని సందేహాలు ఉంటాయి. మీరు రిస్క్​ తీసుకునేందుకు సిద్ధమా? రిస్క్​ తీసుకుంటే మంచి రిటర్నులు వస్తాయి అని మీరు నమ్ముతారా? అయితే.. మీకు మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ బెస్ట్​..!

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?

మిడ్​ క్యాప్​ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడమే.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్. స్టాక్​ మార్కెట్​ రెగ్యులేటర్​ సెబీ ప్రకారం.. మార్కెట్​ క్యాపిటలైజేషన్​లో 101-250 మధ్యలో ఉన్న సంస్థలను మిడ్​ క్యాప్​ కంపెనీలుగా పిలుస్తుంటారు. 101వ సంస్థ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 30,000-40,000 మధ్యలో ఉంటుంది. 250వ మిడ్​ క్యాప్​ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 10,000- 9,000 మధ్యలో ఉంటుంది.

Mid cap mutual fund : మిడ్​ క్యాంప్​ సంస్థలు.. లార్జ్​ క్యాప్​- స్మాల్​ క్యాప్​ల మధ్యలో ఉంటాయి కాబట్టి.. మదుపర్లకు కొంత ప్రయోజనాలను చేకూరుస్తాయి. లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ కన్నా.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లు ఎక్కువ రిటర్నులు తెచ్చిపెడతాయి. కానీ వాటికన్నా ఇవి మరింత ఒడుదొడుకులకు లోనవుతాయి కూడా!

అదే.. స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​తో పోల్చుకుంటే.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లు నిలకడగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే..మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో మంచి రిస్క్​తో మంచి రివార్డు లభిస్తుంది.

మంచి ఫండ్​ మేనేజర్​, డైవర్సిఫైడ్​ సెక్టార్స్​​, మెరుగ్గా రాణించే స్టాక్స్​ని ఎంచుకుంటే చాలు.. మీకు అదిరిపోయే రీతిలో రిటర్నులు వస్తాయి!

ఇవి తెలుసుకోండి..

లార్జ్​ క్యాప్​ కన్నా ఎక్కువ ఒడిదొడుకులు మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో ఉంటుందన్న విషయం ఇక్కడ కీలకం. మీరు రిస్క్​ను భరించలేకపోతే.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ను ఎంచుకూకోడదు. అదే సమయంలో.. ఈ రకం మ్యూచువల్​ ఫండ్​లో కనీసం 8-10ఏళ్లు అయినా ఇన్​వెస్ట్​ చేయాలి. అప్పుడే మెరుగైన రిటర్నులు కనిపిస్తాయి.

what is Mid cap mutual fund : మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో సంపద సృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అది.. మనం ఎంచుకునే మ్యూచువల్​ ఫండ్​పైనే ఆధారపడి ఉంటుంది. స్టాక్​ మార్కెట్​లో చాలా రీసెర్చ్​ చేసి, మంచి స్టాక్స్​ను ఎంచుకునే మ్యూచువల్​ ఫండ్​లోనే పెట్టుబడి పెట్టాలి. ప్రతి మ్యూచువల్​ ఫండ్​ స్కీమ్​కి రేటింగ్స్​ ఉంటాయి. పెట్టుబడులు మొదలుపెట్టే ముందు.. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ మ్యూచువల్​ ఫండ్​ గత ప్రదర్శనను కూడా చూడాల్సి ఉంటుంది.

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ కోసం రిస్క్​తో పాటు.. మీ ఫైనాన్షియల్​ గోల్స్​ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలి. తొందరపడి ఏదో ఒకటి ఎంచుకుంటే.. దీర్ఘకాలంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో పెట్టుబడి విషయంలో మీ వయస్సును కూడా పరిగణలోకి తీసుకోవాలి! మీరు యంగ్​ ఏజ్​లో ఉంటే.. రిస్క్​ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే రిటైర్మెంట్​కు సమీపిస్తున్నప్పుడు రిస్క్​ తీసుకోవాలన్న ఆలోచనలు శ్రేయస్కరం కావు.

ఈక్విటీ ఫండ్​ కారణంగా.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​పై వచ్చే లాభాల మీద క్యాపిటల్​ గెయిన్​ ట్యాక్స్​, డివిడెండ్​ డిస్ట్రిబ్యూషన్​ ట్యాక్స్​ పడుతుంది.

లార్డ్​ క్యాప్​తో పోల్చితే.. స్మాల్​ క్యాప్​, మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో పెట్టుబడి పెట్టే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

చివరిగా..

నిన్నటి మిడ్​ క్యాప్​ కంపెనీలే.. నేటి లార్జ్​ క్యాంప్​ కంపెనీలు.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో సంపద సృష్టికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం