Index mutual fund : ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి? -what is index mutual fund in india and what are its benefits ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  What Is Index Mutual Fund In India And What Are Its Benefits

Index mutual fund : ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?

Sharath Chitturi HT Telugu
Aug 05, 2022 11:16 AM IST

Index mutual fund : ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అనేది అర్థం చేసుకోవడం చాలా సులభమైన విషయం. స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడి పెట్టాలి అని అనుకుని, ఎనాలసిస్​కు టైమ్​ లేని వారు ఇందులో ఇన్​వెస్ట్​ చేసుకోవచ్చు. మరి ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?

ఇండెక్స్​ మ్యూచ్యువల్​ ఫండ్​ అంటే ఏంటి?
ఇండెక్స్​ మ్యూచ్యువల్​ ఫండ్​ అంటే ఏంటి? (iStock)

Index mutual fund : మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టాలని చాలా మంది అనుకుంటారు. కానీ మంచి మ్యూచువల్​ ఫండ్​ను ఎంచుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. మ్యూచువల్​ ఫండ్స్​లో ఎన్నో రకాలు ఉంటాయి, ఎన్నో ఫండ్​ హౌజ్​లు ఉంటాయి. వాటి పేర్లను చూసే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ చాలా సింపుల్​గా ఉంటుంది. చాలా సులభంగా దీని గురించి అర్థం చేసుకోవచ్చు. పైగా.. ఇందులో రిస్క్​ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అర్థం.. దాని పేరులోనే ఉంది. ఈ రకం మ్యూచువల్​ ఫండ్.. సెన్సెక్స్​, నిఫ్టీ, బ్యాంక్​ నిఫ్టీ వంటి ఇండెక్స్​లలో పెట్టుబడులు పెడుతుంది.

ఉదాహరణకు నిఫ్టీ 50లో.. 50 సంస్థల స్టాక్స్​ ఉంటాయి. అవి పెరుగుతూ ఉంటే.. నిఫ్టీ 50 వృద్ధిచెందుతుంది. ఆయా స్టాక్స్​ పడితే.. నిఫ్టీ పతనమవుతుంది. నిఫ్టీ 50 ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ కూడా ఇంతే! ఇందులో నిఫ్టీ 50కి చెందిన స్టాక్సే ఉంటాయి. అందువల్ల.. నిఫ్టీ 50 రిటర్నుల తగ్గట్టుగానే నిఫ్టీ 50 మ్యూచువల్​ ఫండ్​లోనూ రిటర్నులు ఉంటాయి.

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ మేనేజర్లు.. ఒక ఇండెక్స్​ని ఎంచుకుని అందులోని స్టాక్స్​లో క్రమంగా మదుపర్ల నగదును పెట్టుబడి పెడతారు. అదే యాక్టివ్​ మ్యూచువల్​ ఫండ్స్​లో అయితే.. మదుపర్లకు మంచి రిటర్నులు తెచ్చిపెట్టేందుకు వివిధ స్టాక్స్​ను ఎనలైజ్​ చేయాల్సి ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో.. ఫండ్​ మేనేజర్ల పని పెద్దగా ఉండదు!

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ ఎవరికి ఉపయోగం?

ఈక్విటీ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టాలనుకుని, స్టాక్స్​ని ఎనలైజ్​ చేసేందుకు సమయం లేని వారికి ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ ఉపయోగపడుతుంది. ఇండెక్స్​కి తగ్గట్టే రిటర్నులు వస్తాయి కాబట్టి.. అవి ఆశించిన స్థాయిలోనే ఉంటాయి.

Index mutual fund in India : ఫండ్​ మేనేజర్ల నిర్ణయాలు ఒక్కోసారి బెడిసికొడతాయి. అప్పుడు మదుపర్లకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో ఫండ్​ మేనేజర్ల పాత్ర చాలా తక్కువ కాబట్టి.. ఆ భయాలు అవసరం లేదు. అందువల్ల ఇతర మ్యూచువల్​ ఫండ్స్​తో పోల్చితే.. ఇందులో రిస్క్​ తక్కువగా ఉంటుంది.

కానీ.. అధిక రిటర్నులు పొందాలంటే.. అందుకు తగ్గ రిస్క్​ కూడా చేయాలి. అందువల్ల.. సూచీలు ఇచ్చే రిటర్నుల కన్నా అధిక రిటర్నులు పొందాలి అని అనుకునే వారికి ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ ఉపయోగపడకపోవచ్చు.

ఇవి పరిగణించాలి..

  • రిస్క్​- రివార్డ్​:- మార్కెట్లు పెరుగుతుంటే.. సూచీలు కూడా వృద్ధిచెందుతాయి. అప్పుడు ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ కూడా పెరుగుతుంది. కానీ మార్కెట్లు పడితే.. సూచీలు, ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ కూడా పడిపోతుంది. సాధారణంగా.. మార్కెట్లు పడిపోతుంటే.. ఫండ్​ మేనేజర్లు తమ నిర్ణయాలతో నగదును వేరే స్టాక్స్​కు మళ్లించే అవకాశం ఉంటుంది. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో అలాంటి వెసులుబాటు ఉండదు. అందువల్ల ఇండెక్స్​తో పాటు యాక్టివ్​ మ్యూచువల్​ ఫండ్స్​లో కూడా పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం.
  • ఎక్స్​పెన్స్​ రేషియో:- మీ పెట్టుబడులను మేనేజ్​ చేస్తుండటంతో ఫండ్​ హౌజ్​ మీకు వచ్చే రిటర్నుల నుంచి కొంత మొత్తం తీసుకుంటుంది. దానినే ఎక్స్​పెన్స్​ రేషియో అంటారు. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ విషయంలో అతి పెద్ద ఉపయోగం ఇక్కడే. ఫండ్​ మేనేజర్​ ప్రమేయం తక్కువ కాబట్టి.. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో ఎక్స్​పెన్స్​ రేషియో కూడా తక్కువగానే ఉంటుంది.
  • మీ గోల్స్​ ముఖ్యం:- కనీసం 7ఏళ్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న మదుపర్లకు ఈ ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ ఉపయోగపడుతుంది. స్వల్పకాలంలో ఈ రకం ఫండ్స్​లో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. 7ఏళ్ల కాలంలో 10-12శాతం రిటర్నులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దీర్ఘకాలం పెట్టుబడుల కోసమే ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​వైపు చూడాలి.
  • ట్యాక్స్​:- ఈక్విటీ ఫండ్​ కావడంతో ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ ద్వారా వచ్చే డబ్బులపై ట్యాక్స్​ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫండ్​ హౌజ్​.. డివిడెండ్లు చెల్లిస్తే.. అందులో 10శాతం డీడీటీ(డివిడెండ్​ డిస్ట్రిబ్యూషన్​ ట్యాక్స్​) కట్​ అవుతుంది.

(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం ప్రచురించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి పెట్టేముందు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం)

IPL_Entry_Point

సంబంధిత కథనం