Mutual funds SIP: ‘స్మాల్ క్యాప్’ మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లో ఈ తప్పులు చేయకండి
Mutual funds SIP: మీరు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. మీరు ఈ తప్పులు చేయకండి.
Mutual funds SIP: స్టాక్ మార్కెట్లో స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీ లాభాలు ఇస్తాయన్న విషయం మదుపర్లకు తెలిసిందే. దానికి తగ్గట్టుగానే వాటిల్లో హై రిస్క్ ఉంటుంది. స్మాల్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్‌కి కూడా ఇదే వర్తిస్తుంది. అందుకే.. చాలా మంది మదుపర్లు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటారు. సిప్ ద్వారా కూడా నెలవారీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ పతనమైతే సమస్య మొదలవుతుంది. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో కరెక్షన్ దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఇలాగే ఉంది. మరి ఈ సమయంలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే మదుపర్లు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాము.
పోర్ట్‌ఫోలియోలో ఆచితూచి..
మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే మదుపర్లు సహజంగా కోర్- శాటిలైట్ పోర్ట్‌ఫోలియో స్ట్రాటజీలు అనుసరిస్తూ ఉంటారు. లార్జ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్‌తో పాటు ఇతర ఫండ్స్‌లో పెట్టుబడులు ఉంటాయి కాబట్టి.. కోర్ పోర్ట్‌ఫోలియోలో స్థిరత్వం ఉంటుంది. శాటిలైట్ పోర్ట్‌ఫోలియోలో మాత్రం చాలా రిస్క్ ఉంటుంది. భారీ రిటర్నుల కోసం హై రిస్క్‌పై కన్నేస్తారు. వీటితో జాగ్రత్తగా ఉండాలి.
Small cap mutual funds : "శాటిలైట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో సిప్ చేద్దామని అనుకుంటారు. కానీ ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ కరెక్షన్లో ఒడుదొడుకులు తీవ్రంగా ఉంటాయి. స్మాల్ క్యాప్‌నే కోర్ పోర్ట్‌ఫోలియోగా మార్చుకుంటే.. మార్కెట్ల పతనంలో పెట్టుబడి మొత్తం ఆవిరి అయిపోయే అవకాశం ఉంది," అని క్లీయర్ సీఈఓ అర్చిత్ గుప్తా వెల్లడించారు.
'టైమ్' చేయాలనుకుంటే కష్టమే..
స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతూనే ఉండాలి. మ్యూచ్యువల్ ఫండ్స్‌ని కూడా 'టైమ్' చేయాలని ప్రయత్నిస్తే కష్టాలు తప్పవు. సగటు రిటర్నులు లెక్కిస్తారు కాబట్టి ఎప్పుడైనా సిప్‌లు మొదలుపెట్టొచ్చు.
"పెట్టుబడి పెట్టేందుకు మదుపర్లు సరైన సమయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ సిప్ అంటేనే అలా ఉండదు. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా.. తట్టుకునేందుకే సిప్ ఉంటుంది," అని ఇన్వెస్ట్ఆన్లైన్.ఇన్ అభినవ్ అగ్నిరీష్ వెల్లడించారు.
పడిపోయిన స్మాల్ క్యాప్ ఫండ్స్‌పై కన్ను..
Small cap mutual funds SIP : ఒకేసారి భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనుకునే వారు.. భారీగా పడిన స్మాల్ క్యాప్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. కానీ సిప్ ద్వారా నెలవారీ పెట్టుబడి చేసే వారు మాత్రం.. పడిపోతున్న ఫండ్స్‌ను ఎంచుకోకూడదు. మెచ్యూరిటీ సమయానికి యావరేజ్ రిటర్నులు అనేవి పడిపోతాయి. స్టాక్ మార్కెట్ పతనంలో భారీగా పడిపోయి, భవిష్యత్తులో పెరుగుతాయి అన్న నమ్మకం ఉన్న స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు చేయాలి.
సిప్ కూడా పెంచాలి..
మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌కు కేటాయించిన నిధులను నెమ్మదిగా పెంచుతూ ఉండాలి. కొంత మొత్తం పెంచుకుంటూ పోయినా.. మెచ్యూరిటీ సమయానికి భారీగా రిటర్నులు సంపాదిచుకోవచ్చు. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కి కూడా ఇదే వర్తిస్తుంది.
స్టాక్ మార్కెట్లు పడినా ఫర్వాలేదు..
Mutual funds investment : స్టాక్ మార్కెట్లు అద్భుతంగా రాణిస్తున్న సమయంలో చాలా మంది సిప్‌లు చేస్తుంటారు. ఆ సమయంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా భారీగా రాణిస్తాయి. వాటిని చూసి మదుపర్లు ఆశలు పెట్టుకుంటారు. వాస్తవానికి మార్కెట్లు పతనమైనప్పుడు.. స్మాల్ క్యాప్ ఫండ్సే ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఆ సమయంలో భయంతో మదుపర్లు సిప్‌ను నిలిపివేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు సహయం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
సంబంధిత కథనం