Telangana News Live November 26, 2024: CM Revanth Reddy : ధాన్యం విక్రయించిన వెంటనే రైతుల అకౌంట్లోకి డబ్బులు, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 26 Nov 202405:05 PM IST
CM Revanth Reddy : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. దిల్లీ నుంచి మాట్లాడిన ఆయన...ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు ఆలస్యంగా కాకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు. రోజు వారీగా కొనుగోళ్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Tue, 26 Nov 202404:42 PM IST
Karimnagar : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 64 కేసుల్లో పట్టుబడ్డ రూ.కోటి 30 లక్షల విలువైన గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. 64 కేసుల్లో 521 కేజీల గంజాయి పట్టుబడిందని తెలిపారు. ఈ గంజాయిని కోర్టు అనుమతితో దగ్ధం చేసినట్లు పేర్కొన్నారు.
Tue, 26 Nov 202404:21 PM IST
TG Food Safety Officer Results : తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 24 మంది అభ్యర్థులతో తుది ఫలితాలు విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
Tue, 26 Nov 202402:33 PM IST
Nirmal Farmers Protest : నిర్మల్ రైతులు మరోసారి రోడ్డెక్కారు. దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా ఇక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మంగళవారం జేఏసీ పిలుపు మేరకు బంద్ చేపట్టారు. నాలుగు గ్రామాల ప్రజలు నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు.
Tue, 26 Nov 202412:09 PM IST
Aroori Ramesh : బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మళ్లీ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. అరూరి తిరిగి బీఆర్ఎస్ బాట పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ కార్యక్రమాల్లో ఆయన పెద్దగా పాలుపంచుకోకపోవడం ఈ ప్రచారానికి ఊతం ఇస్తున్నాయి.
Tue, 26 Nov 202411:06 AM IST
- Konda Surekha : కొండా సురేఖ.. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్. వరంగల్ జిల్లాలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకురాలు. డైలాగ్‌లను బుల్లెట్లలా పేల్చే సురేఖ.. తాజాగా బాలిక పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. బాలిక చెప్పులు లేకుండా నడవటం చూసి చలించిపోయారు. వెంటనే కారు ఆపి.. బాలికను దగ్గరకు తీసుకున్నారు.
Tue, 26 Nov 202410:34 AM IST
- Tirumala : తిరుమల.. తెలుగు ప్రజలు ఎంతో ఆరాధించే దైవక్షేత్రం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. దీంతో తెలంగాణ వారి లేఖలు కూడా తీసుకోవాలని హరీష్ రావు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కోరారు.
Tue, 26 Nov 202410:13 AM IST
- TG MeeSeva : పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా.. మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిందే. అయితే.. మన అవసరాన్ని బట్టి కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే.. ఏం చేయాలో తెలియక చాలామంది వదిలేస్తుంటారు.
Tue, 26 Nov 202408:10 AM IST
- TG Inter Fee: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువును పొడిగిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింద.ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్ధులు ఫీజులు చెల్లించడానికి గడువు పొడిగించారు.
Tue, 26 Nov 202407:36 AM IST
- Adilabad : మేతకు వెళ్లిన గొర్రెలు వడ్ల గింజలు తిన్నాయి. వడ్ల గింజలు తిని 64 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండంలో జరిగింది. గొర్రెలు మృతిచెందడంతో పెంపకందారులు నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు కలెక్టర్ సాయం ప్రకటించారు.
Tue, 26 Nov 202405:57 AM IST
- TGSRTC Drivers Recruitment : టీజీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉంది. ముఖ్యంగా డ్రైవర్ల కొరత వేధిస్తోంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా ఒప్పంద పద్ధతిలో నియమించిన సిబ్బందితో సంస్థ బస్సులు నడుపుతోంది. ఇంకా డ్రైవర్ల కావాల్సి రావడంతో.. అధికారులు వినూత్నంగా ఆలోచించారు.
Tue, 26 Nov 202404:36 AM IST
- Hyderabad : మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం.. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారు. మూసీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నారు. అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. మూసీలో రసాయన పరిశ్రమల వ్యర్థాలను డంప్ చేయడం కలకలం సృష్టిస్తోంది.
Tue, 26 Nov 202404:02 AM IST
- TG Weather Update : చలితో తెలంగాణ గజగజ వణికిపోతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 4 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Tue, 26 Nov 202401:11 AM IST
- Student tragedy: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నోట్లో పూరీ ఇరుక్కుని ఆరో తరగతి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. భోజన సమయంలో లంచ్ బాక్సులో పూరీలను రోల్ మాదిరి చుట్టుకుని ఒకేసారి నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేయడంతో అవి గొంతుకు అడ్డం పడి ప్రాణాలు విడిచాడు.
Tue, 26 Nov 202411:40 PM IST
- Peddapalli Youth: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 4న పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై గ్రూప్ 4 తో పాటు వివిధ పరీక్షల్లో రిక్రూటైన 9 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.