Home Budget Tips : భార్యాభర్తలు పాటించాల్సిన ఇంటి బడ్జెట్ సూత్రాలు.. మనీ టెన్షన్ నుంచి రిలీఫ్-how to manage home finances for couples here are the simple tips to save money house budget ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Home Budget Tips : భార్యాభర్తలు పాటించాల్సిన ఇంటి బడ్జెట్ సూత్రాలు.. మనీ టెన్షన్ నుంచి రిలీఫ్

Home Budget Tips : భార్యాభర్తలు పాటించాల్సిన ఇంటి బడ్జెట్ సూత్రాలు.. మనీ టెన్షన్ నుంచి రిలీఫ్

Anand Sai HT Telugu
Nov 25, 2024 10:45 PM IST

Home Budget Tips : కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ మాదిరిగానే ఇంటి బడ్జెట్‌లో ప్రతీ లెక్క ఉండాలి. ఎందుకంటే ఏ రూపాయి ఏటు వెళ్తుందో భార్యాభర్తలకు క్లారిటీ ఉంటే మనీ టెన్షన్ ఉండదు. హాయిగా జీవితాన్ని నడిపించొచ్చు.

ఇంటి బడ్జెట్ చిట్కాలు
ఇంటి బడ్జెట్ చిట్కాలు (Unsplash)

ఈ ప్రపంచంలో దాదాపు అన్ని విషయాలు డబ్బుతో ముడిపడే ఉన్నాయి. ఎవరైనా కాదు అంటే అది అబద్ధమనే చెప్పాలి. బంధం సరిగా ఉండాలన్న కూడా డబ్బే. పిల్లల చదువులకు డబ్బే.. పెళ్లిళ్లకు డబ్బే.. ఇలా ప్రతీ విషయంలో మనీ అనేది అసలైన మ్యాటర్. అలాంటి డబ్బుకు కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేయకూడదు.

గృహ ఖర్చులను నిర్వహించడం అనేది ఓ కళ. పెళ్లి తర్వాత జంటలు గృహ బాధ్యతలను చూసుకునేందుకు అనేక విషయాలను దాటాల్సి ఉంటుంది. దంపతులు కలిసి ఇంటి ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

డబ్బు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇందులో నిజాయితీతో కూడిన సంభాషణ ఇద్దరికీ నమ్మకం కలిగిస్తుంది. మీరు ఆర్థిక విషయాల గురించి తరచుగా చర్చలు జరపాలి. మీ ఆదాయాలు, ఖర్చులు, పొదుపులు, ఆర్థిక సమస్యల గురించి మాట్లాడుకోవాలి. పరస్పరం ఆర్థిక విలువలు, ప్రాధాన్యతలను చర్చించడానికి మాటలు చాలా ముఖ్యమైనవి. అప్పుడే ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎంత పొదుపు చేస్తున్నారు? అనే విషయం తెలుస్తుంది.

డబ్బు దేనికి ఎంత కేటాయించాలనే క్లారిటీ భార్యాభర్తలకు ఉండాలి. సెలవుల కోసం పొదుపు చేయడం, ఇంటిని కొనుగోలు చేయడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను లిస్ట్ తయారు చేయండి. మీ లక్ష్యాన్ని సాధించడానికి టైమ్‌లైన్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌కు వచ్చే వేసవిలో విహారయాత్ర కోసం రూ. 50,000 అనుకుంటే ఇప్పటి నుంచే కాస్త సైడ్‌కి దాచిపెట్టాలి. ఆ నెలలో వచ్చేదానితో వెళ్తామంటే ఇబ్బందులు తప్పవు. మూడు సంవత్సరాలలో హౌస్ డౌన్ పేమెంట్ కోసం రూ. 10,00,000 అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి.

పనిభారాన్ని పంచుకోవడం, గృహ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అన్ని అంశాలు కవర్ అయ్యేలా చూసుకోవడం అవసరం. ప్రతి భాగస్వామి బలాలు, ప్రాధాన్యతల ఆధారంగా పనులను విభజించాలి. ఉదాహరణకు ఒక భాగస్వామి బిల్ చెల్లింపులను నిర్వహించవచ్చు. మరొకరు పెట్టుబడులను చూసుకోవాలి. ఈ పనులను అప్పుడప్పుడు రివర్స్ చేయాలి. ఒకరు ఇంటి బడ్జెట్‌లో ఎక్స్‌పర్ట్ అయితే.. మరొకరు పెట్టుబడి గురించి ఎక్కువ సెర్చ్ చేయాలి.

అద్దె, ఈఎంఐలు, కిరాణా ఖర్చులు, వినోదం వంటి ఖర్చులకు నెల మెుదట్లోనే పక్కన పెట్టాలి. పొదుపు, ఖర్చుల కోసం డబ్బును కేటాయించండి.

కారు కొనాలని లేదా ఇంటిని రినోవేషన్ చేయాలని ప్లాన్ చేస్తే నిర్ణయాల గురించి ముందుగా ఆలోచించండి. ఉదాహరణకు రూ. 100000 కంటే ఎక్కువ ఖర్చు చేయాలంటే ఇద్దరూ చర్చించండి. లాభాలు, నష్టాలను అంచనా వేయండి. అది మీ బడ్జెట్ లక్ష్యాలకు ఎలా సరిపోతుందో చూసుకోండి. కొనుగోలు అవసరాన్ని, కొన్న తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో.. ముందుగానే మాట్లాడుకోండి.

ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఊహించని పరిస్థితుల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది. డబ్బు ఆదా చేయడానికి ఒక జాయింట్ అకౌంట్ తీసుకోండి. 3 నుంచి 6 నెలలపాటు ఎమర్జెన్సీ ఫండ్‌లో డబ్బులు వేయండి. అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో గొడవలు తగ్గించేందుకు ఫండ్‌ ఉపయోగపడుతుంది.

Whats_app_banner