
(1 / 5)
ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ సూర్యవన్షీని కోటి పది లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్నది.

(2 / 5)
30 లక్షల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన వైభవ్‌ను సొంతం చేసుకునేందుకు రాజస్థాన్‌తో పాటు ఢిల్లీ కూడా బిడ్డింగ్ వేసింది. చివరకు రాజస్థాన్ ఈ యంగ్ క్రికెటర్‌ను కొన్నది.

(3 / 5)
ఈ ఏడాది జనవరిలో బీహార్ టీమ్ తరఫున రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు వైభవ్. ప్రస్తుతం ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతోన్న వైభవ్ ...రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు బాల్స్‌లో పదమూడు పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టాడు.

(4 / 5)
ఆస్ట్రేలియన్ అండర్ 19 టీమ్‌తో జరిగిన మ్యాచ్‌తో 58 బాల్స్‌లోనే వైభవ్ సూర్యవన్షీ సెంచరీ చేశారు.

(5 / 5)
వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవన్షీ క్రికెటర్ కావాలని చాలా ప్రయత్నాలుచేశాడు. కానీ ఆ ఆశ తీరలేదు. కొడుకు వైభవ్ ద్వారా తాను కన్న కలను నిజం చేసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు