స్త్రీల జననేంద్రియ ఇన్ఫెక్షన్ల పరిష్కారానికి మార్కెట్‌లోకి కొత్త సప్లిమెంట్
V-ferin Supplement : చాలామంది స్త్రీలు జననేంద్రియ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. అలాంటి వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని లీ హెల్త్ డొమెయిన్ కొత్త సప్లిమెంట్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో చూడండి..
సహజ సిద్ధ వనమూలికలు, ఉత్పత్తులతో ఔషధాల తయారీలో పేరు ఉన్న కంపెనీ హైదరాబాద్‌కు చెందిన లీ హెల్త్ డొమెయిన్. ఇప్పుడు స్త్రీల జననేంద్రియ ఇన్ఫెక్షన్ల చికిత్సకు వి-ఫెరిన్ ప్రోబయోటిక్ సప్లిమెంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లాక్టోఫెర్రిన్ పెప్టైడ్, క్రాన్‌బెర్రీ పండ్లతో ప్రీ-ప్రోబయోటిక్స్ లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ మిశ్రమాలతో ఈ క్యాప్సూల్స్ రూపొందించారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, సహజ సూక్ష్మజీవులను పునరుద్ధరించడంతోపాటు జననేంద్రయ ఇన్ఫెక్షన్లను ఇది నివారిస్తుందని కంపెనీ తెలిపింది.
స్త్రీల జననేంద్రియ అంటువ్యాధుల లక్షణాలను మాత్రమే పరిష్కరించగల ఇతర సంప్రదాయ చికిత్సలవలె కాకుండా ఈ సప్లిమెంట్ పనిచేస్తుంది. వి-ఫెరిన్ జననేంద్రియ అసమతుల్యత మూల కారణాలను లక్ష్యంగా చేసుకుంటుంది. తద్వారా సమగ్ర చికిత్సకు సాయం చేస్తుందని కంపెనీ పేర్కొంది. స్త్రీల శరీరం రక్షణ విధానాలకు అనుగుణంగా వి-ఫెరిన్ పనిచేస్తుంది.
కృత్రిమ పదార్థాలు, ప్రిజర్వేటివ్స్, కఠిన రసాయనాల లేకుండా ఈ సప్లిమెంట్ తయారైంది . ఇది మహిళలందరికీ సురక్షితమని అని కంపెనీ పేర్కొంటోంది. ఆరోగ్యకర, సమతుల్య జననేంద్రియ సూక్ష్మజీవులను నిర్వహించడానికి మహిళలకు బెటర్ ఛాయిస్ అని అని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ ఆళ్ల లీలా రాణి చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) లెక్కల ప్రకారం సుమారు 25 నుంచి 30 శాతం మంది మహిళలు ఏదో ఒక రకమైన జననేంద్రియ ఇన్ఫెక్షన్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. బాక్టీరియల్ వాజినోసిస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు స్త్రీలలో చాలా తరచుగా వచ్చే సమస్యలు. ఈ అంటువ్యాధులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. రోజువారీ జీవితానికి అంతరాయం కలిగిస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే స్త్రీ పునరుత్పత్తి అవయవాలలో వాపును కలిగించే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ లేదా సంతానోత్పత్తి సమస్యల వంటి మరింత తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని లీలా రాణి వివరించారు.
మహిళల ఆరోగ్యం అనేక సవాళ్లతో కూడుకున్నదని, స్త్రీ జననేంద్రియ ఇన్ఫెక్షన్లు సాధారణ సమస్యల్లో ఒకటిగా ఉందని కంపెనీ తెలిపింది. న్యూట్రాస్యూటికల్స్ రంగంలో అభివృద్ధి చెందుతున్న పరిశోధన, ఆవిష్కరణలు ఈ సమస్యలకు కొత్త పరిష్కారాన్ని అందిస్తాయని లీ హెల్త్ డొమెయిన్ తెలిపింది. వి ఫెరిన్ అన్ని ప్రముఖ మందుల షాపులు, లీ హెల్త్ డొమెయిన్, అమెజాన్ వెబ్‌సైట్లలో లభిస్తుంది.
గమనిక : కొత్తగా ఏదైనా ప్రొడక్ట్ వాడేముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి. కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే మా ఉద్దేశం. పైన చెప్పిన కంటెంట్‌కు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు.
టాపిక్