Bigg Boss Yashmi: బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో చెప్పిన యష్మి - గౌతమ్, నిఖిల్ కాదంట!
Bigg Boss Yashmi: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ ఎవరనే దానిపై యష్మి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పింది. నిఖిల్, పృథ్వీతో పాటు గౌతమ్ పేరు కాకుండా లేడీ కంటెస్టెంట్ బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తుందని అన్నది. బిగ్‌బాస్ బజ్‌లో నిఖిల్‌తో లవ్ ట్రాక్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Bigg Boss Yashmi: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 నుంచి యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్స్‌లో చివరగా పృథ్వీ, యష్మి నిలిచారు. వారిలో పృథ్వీని సేవ్ చేసిన బిగ్‌బాస్ యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. బిగ్‌బాస్ సీజన్ 8టైటిల్ విన్నర్స్‌లో ఒకరంటూ ప్రచారం జరిగిన యష్మి ఫైనల్ వరకు చేరకుండానే హౌజ్ నుంచి ఎలిమినేట్ కావడం ఆసక్తికరంగా మారింది.
స్నేహితులు...శత్రువులు...
హౌజ్‌లో తన స్నేహితులుగా నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ పేర్లు చెప్పింది యష్మి. శత్రువులుగా గౌతమ్, అవినాష్, రోహిణిలను పేర్కొన్నది. తన బిగ్‌బాస్ జర్నీపై బిగ్‌బాస్ బజ్‌లో పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నది యష్మి.
విన్నర్ ఎవరంటే?
బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్‌గా ఎవరు నిలుస్తారని హోస్ట్ అర్జున్ అంబటి అడిగిన ప్రశ్నకు ప్రేరణ పేరు చెప్పింది యష్మి. ప్రేరణ లేడీ విన్నర్ అవ్వాలని కోరుకున్నది. నిఖిల్, గౌతమ్, పృథ్వీ పేర్లు కాకుండా యష్మి....ప్రేరణ పేరు చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది.
అవకాశవాది...
అవకాశవాది అంటూ వచ్చిన విమర్శలపై కూడా యష్మి రియాక్ట్ అయ్యింది. లూడో గేమ్‌లో గౌతమ్ ముందున్న...అతడిని తీసేసి ప్రేరణను సంచాలక్‌గా పెట్టుకోవడంపై అర్జున్ అడిగిన ప్రశ్నకు గౌతమ్ ఆటలో జెన్యూనిటీ కనిపించలేదని యష్మి అన్నది. ఆ ఒక్క టాస్క్‌లోనే కాదు...ప్రతి గేమ్‌ను గౌతమ్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఆడాడాని, గేమ్ ఆడే సమయంలో సలహాలు ఇస్తే తీసుకోడు...చెప్పకుండా ఉంటే చెప్పలేదని నిందలు వేస్తాడంటూ అన్నది.
ఆ ముగ్గురే...
హౌజ్‌లో తన బాధ, కోపం, ప్రస్టేషన్ అన్నీ...నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియలతోనే పంచుకునేదానిని అని చెప్పింది. నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండటం వల్లే మీ గేమ్‌పై ఫోకస్ పోయింది అనే మాటను ఒప్పుకుంటారా అని అర్జున్ అడిగిన ప్రశ్నకు యష్మి తెలివిగా సమాధానమిచ్చింది. నిఖిల్‌తో హౌజ్‌లో కొంచెం ఓపెన్ అయ్యాను. మా మధ్య ఫన్ ఫ్యాక్టర్ కాస్త ఎక్కువైన మాట నిజమే. కానీ నిఖిల్ మీద ఫోకస్ పెట్టి నా గేమ్‌ను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు.
కలలోకి నిఖిల్...
నిఖిల్ ఓ సారి నా కలలోకి వచ్చాడు. ఓ స్నేహితుడిగానే కలలో నాకు కనిపించాడు. ఆ డ్రీమ్ వల్లే మా రిలేషన్ చెడిపోయింది. మంచి డ్రీమ్ అనుకున్నది కాస్త చెడ్డ కలగా మారిపోయింది. అప్పటి నుంచి నిఖిల్‌తో మాట్లాడటం చాలా తగ్గించాను. ఇప్పుడు నిఖిల్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని అన్నది. ఫ్రెండ్‌గా భావించి డ్రీమ్ గురించి నిఖిల్‌తో నేను షేర్ చేసుకున్నాం. కానీ నిఖిల్… రోహిణితో ఏదేదో చెప్పాడు..ఆ తర్వాత నాతో మాట్లాడటం మానేశాడు. కేవలం డ్రీమ్ మాత్రమే వచ్చిందని, ఏదేదో ఊహించుకోవద్దని, ఫ్రెండ్‌గా ఉందామని చాలా చెప్పానని, కానీ నిఖిల్ వినలేదని యష్మి అన్నది.