Vishnu Priya: విష్ణుప్రియకు గట్టిగా క్లాస్ ఇచ్చిన నాగార్జున - పృథ్వీతో లవ్ ట్రాక్‌పై రోహిణి కామెంట్స్‌తో రచ్చ
Bigg Boss: శనివారం ఎపిసోడ్‌లో విష్ణుప్రియకు నాగార్జున గట్టిగా క్లాస్ ఇచ్చినట్లుగా ప్రోమోలో చూపించారు. మరోవైపు నిఖిల్, పృథ్వీలకు విష్ణుప్రియ ట్రై చేసింది నిజమేనంటూ నాగార్జునతో రోహిణి చెప్పడం ప్రోమోలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బిగ్‌బాస్ కొత్త మెగా చీఫ్‌గా ఎంపికైన రోహిణిని నాగార్జున ప్రశంసలతో ముచ్చెత్తారు. మరోవైపు విష్ణుప్రియగా గట్టిగా క్లాస్ ఇచ్చాడు. బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో విష్ణుప్రియ, రోహిణి మధ్య గొడవ గురించే ఎక్కువగా నాగార్జున హైలైట్ చేసినట్లుగా కనిపిస్తోంది.
రోహిణిపై ప్రశంసలు...
నాగార్జున వచ్చి రావడంతోనే రోహిణి...ఏం గెలుపు...ఎంత బాగా గెలిచావంటూ అభినందించారు. ఆ తర్వాత రోహిణి, విష్ణుప్రియలను కన్ఫేషన్ రూమ్‌కు పిలిచాడు నాగార్జున. మీ ఇద్దరిని ఇలా కన్ఫేషన్ రూమ్‌కు పిలవాల్సివస్తుందని ఎప్పుడూ అనుకోలేదని నాగార్జున అన్నాడు.
క్యారెక్టర్ అనే పదం...
శుక్రవారం టాస్క్‌లో విష్ణుప్రియ, రోహిణికి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను నాగార్జున ఇద్దరికి చూపించాడు. నీ ప్లాన్ వర్కవుట్ అయ్యింది కాబట్టి ఇంకా హౌజ్‌లో ఉన్నావంటూ నిఖిల్, పృథ్వీ లవ్‌స్టోరీపై రోహిణి కామెంట్స్ చేసింది. రోహిణి మాటలతో ఫైర్ అయిన విష్ణుప్రియ క్యారెక్టర్ అనే పదం వాడింది.
క్యారెక్టర్ అనే మాట చాలా పెద్ద మాట అని విష్ణుప్రియపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ కారణంగా నీ అసలైన క్యారెక్టర్ ఏమిటో బయటపడిందని నాగార్జున అన్నాడు. ఆ పొజిషన్‌లో ఇంకా ఎవరున్న నేను అలాగే కొట్టాడేదానిని అంటూ తన మాటలను విష్ణుప్రియ సమర్థించుకున్నది. క్యారెక్టర్ లెస్ అని తాను మాట్లాడలేదని కవర్ చేసుకున్నది.
ఫస్ట్ నిఖిల్...ఆ తర్వాత పృథ్వీ...
ఈ గొడవకు సంబంధించి ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా అవ్వలేదు...ఆ తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే నాకు చెప్పావని విష్ణుప్రియతో రోహిణి అరిచి చెప్పిన వీడియోను నాగార్జున ప్లే చేశాడు. విష్ణుప్రియ చెప్పింది నిజమేనా అని రోహిణిని నాగార్జున అడగ్గా...అవును అంటూ ఆమె సమాధామిచ్చింది. రోహిణి సమాధానంతో విష్ణుప్రియ షాకైంది.
రోహిణిదే తప్పు...
ఈ గొడవకు సంబంధించి తప్పు ఎవరిదనే విషయంలో మిగిలిన హౌజ్‌మేట్స్ అభిప్రాయాలను నాగార్జున అడిగారు.రోహిణిదే తప్పు అని అవినాష్ అన్నాడు. ప్లాన్ కంటే పెద్ద మాటలు విష్ణుప్రియ అన్నది. నీ ఆట జీరో అంటూ చెప్పిందని విష్ణుప్రియను ప్రేరణ తప్పుపట్టింది. తను నా ఆటను అన్నది కాబట్టి ఆ మాట చెప్పాల్సివచ్చిందని విష్ణుప్రియ జోక్యం చేసుకుంటూ ప్రేరణ మాటల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది.
విష్ణుప్రియ జోక్యంతో నాగార్జున సీరియస్ అయ్యాడు. నీ బ్రెయిన్‌లో సెన్స్ మిస్సయిందంటూ ఫైర్ అయ్యారు. మనం మాటలు అలా వదిలేస్తాం...ఆ మాటల మూలన అవతలి వాళ్లు నాలుగు మాటలు వదిలేస్తారు. ఈ మాటల మధ్యలో క్యారెక్టర్ లాంటి పెద్ద పదాలు వస్తాయి. ఆలోచించకుండా అనే ఈ మాటల వల్ల ఆత్మీయులు దూరమవుతారని విష్ణుప్రియకు గట్టిగానే నాగార్జున క్లాస్ ఇచ్చాడు. రోహిణిని కూడా నాగార్జున మందలించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రోమో వైరల్ అవుతోంది.