(1 / 6)
ముల్లంగిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. దూరంగా ఉంచుతుంటారు. ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక అలా చేస్తుంటారు. పోషకాలతో నిండిన ముల్లంగిని రెగ్యులర్‌గా తింటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(2 / 6)
ముల్లంగిలో విటమిన్ సీ, బీ6, ఐరన్, కాల్షియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ సహా మరిన్ని పోషకాలు మెండుగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
(3 / 6)
శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేందుకు ముల్లంగి తోడ్పడుతుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. చాలా అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
(4 / 6)
క్యాన్సర్ రిస్క్‌ను ముల్లంగి తగ్గించగలదు. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇది నిరోధించగలదు.
(5 / 6)
ముల్లంగిలో ఉండే పొటాషియం.. బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. ఇందులోని విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల రిస్క్ ఎక్కువగా ఉండే చలికాలంలో ముల్లంగి తరచూ తింటూ ఉండాలి.
(6 / 6)
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ముల్లంగి సహకరిస్తుంది. జీర్ణక్రియను ఇది మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ ఇందుకు తోడ్పడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేస్తుంది. మలబద్ధకం తగ్గేలా కూడా చేయగలదు.
ఇతర గ్యాలరీలు