OTT: ఓటీటీలోకి 50 ఎపిసోడ్స్‌తో తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. వారానికి రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?-vere level office ott streaming trailer released vere level office ott release on aha with 50 episodes and weekly two ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి 50 ఎపిసోడ్స్‌తో తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. వారానికి రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

OTT: ఓటీటీలోకి 50 ఎపిసోడ్స్‌తో తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. వారానికి రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 25, 2024 04:07 PM IST

Vere Level Office OTT Streaming Trailer: ఓటీటీలోకి సరికొత్త తెలుగు కామెడీ వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్, శుభ శ్రీ రాయగురు, ఆర్జే కాజల్, జబర్దస్త్ రీతూ చౌదరి నటిస్తున్నారు. తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ ఓటీటీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఓటీటీలోకి 50 ఎపిసోడ్స్‌తో తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. వారానికి రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి 50 ఎపిసోడ్స్‌తో తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. వారానికి రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Vere Level Office OTT Release Trailer: బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌తో పాపులర్ అయిన అఖిల్ సార్థక్ మెయిన్ లీడ్ రోల్‌లో వస్తోన్న తెలుగు కామెడీ వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్. ఈ సిరీస్‌ను వరుణ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. వేరే లెవెల్ వెబ్ సిరీస్‌కు ఇ సత్తిబాబు దర్శకత్వం వహంచారు.

గురు-శుక్ర వారాల్లో

ఫన్నీ తెలుగు వెబ్ సిరీస్‌గా రూపొందిన వేరే లెవెల్ ఆఫీస్‌లో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్‌తోపాటు ఆర్‌జే కాజల్, శుభశ్రీ రాయగురు, మిర్చి కిరణ్, జబర్దస్త్ రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12 నుంచి ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 50 ఎపిసోడ్స్‌తో రానున్న ఈ సిరీస్ నుంచి ప్రతి గురువారం, శుక్రవారం కొత్త ఎపిసోడ్స్‌ను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

అంటే, ప్రతి వారానికి రెండు ఎపిసోడ్స్ చొప్పున వేరే లెవెల్ ఆఫీస్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. డిసెంబర్ 12 ఆహా ఓటీటీలో వేరే లెవెల్ డిజిటల్ స్ట్రీమింగ్ నేపథ్యంలో ఇవాళ (నవంబర్ 25) ఈ సిరీస్ ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వేరే లెవెల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక

ఈ కార్యక్రమంలో నటుడు అఖిల్ సార్థక్ మాట్లాడుతూ.. "బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను. నాలుగేళ్లుగా ఇలాంటి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. వేరే లెవల్ ఆఫీస్ స్క్రిప్ట్ వినగానే నాకు పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్ అనిపించింది. మా టీమ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఈ సిరీస్‌లో నటించాం. ఒక మంచి సిరీస్‌తో మీ ముందుకు రాబోతున్నాం. డిసెంబర్ 12నుంచి ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ చూడండి" అని చెప్పాడు.

అదే నా ఫేవరెట్ వెబ్ సిరీస్

నటి శుభశ్రీ మాట్లాడుతూ.. "ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ నా ఫేవరెట్ వెబ్ సిరీస్. అలాంటి ఒక సిరీస్‌లో నటించే అవకాశం వస్తే బాగుండేది అని అనిపించేది. ఆ క్రమంలో నాకు వేరే లెవెల్ ఆఫర్ వచ్చింది. స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. 50 ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ రాబోతోంది. మేమంతా సందడిగా షూటింగ్ చేశాం. ఇలాంటి సిరీస్ ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను" అని తెలిపింది.

మళ్లీ ఆఫీస్‌కు వెళ్లినట్లు

"పదేళ్లు రేడియోలో వర్క్ చేశాక సినిమాల్లోకి వచ్చాను. ఇక్కడ షూటింగ్స్, యాక్టింగ్, కొన్నిసార్లు స్క్రిప్ట్ రైటింగ్ చేశాను. అయితే ఈ బిజీ షెడ్యూల్స్ వల్ల ఆఫీస్ వాతావరణం మిస్ అయినట్లు భావించా. అలాంటి టైమ్‌లో వేరే లెవెల్ ఆఫీస్ ఆఫర్ వచ్చింది. దాంతో మళ్లీ 9 టు 5 ఆఫీస్‌కు వెళ్లిన ఫీల్ కలిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్" అని నటుడు మిర్చీ కిరణ్ తెలిపారు.

కొందరు అడ్డుపడతారు

"ఈ సిరీస్‌లో నేను రమ్య అనే క్యారెక్టర్‌లో నటించాను. తను ఒక చిన్న ఊరు నుంచి నగరానికి వస్తుంది. తనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. కానీ, అవి రీచ్ అయ్యేందుకు కొందరు అడ్డుపడతారు. వాటిని అధిగమించి రమ్య కోరుకున్నది ఎలా సాధించింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది" అని నటి వసంతిక చెప్పింది.

Whats_app_banner