Aha OTT: మెగాస్టార్ చిరంజీవి పేరుతో సరికొత్త తెలుగు మైథాలాజికల్ సిరీస్.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?-aha ott announces new mythological web series chiranjeeva set to premiere on december 2024 chiranjeeva ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott: మెగాస్టార్ చిరంజీవి పేరుతో సరికొత్త తెలుగు మైథాలాజికల్ సిరీస్.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

Aha OTT: మెగాస్టార్ చిరంజీవి పేరుతో సరికొత్త తెలుగు మైథాలాజికల్ సిరీస్.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu
Published Oct 31, 2024 02:27 PM IST

Chiranjeeva Web Series OTT Streaming On Aha: మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఆహా ఓటీటీలోకి సరికొత్త తెలుగు మైథాలాజికల్ వెబ్ సిరీస్ రానుంది. ఈ వెబ్ సిరీస్ పేరే చిరంజీవ. తాజాగా చిరంజీవ ఓటీటీ వెబ్ సిరీస్ గురించి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి పేరుతో సరికొత్త తెలుగు మైథాలాజికల్ సిరీస్.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి పేరుతో సరికొత్త తెలుగు మైథాలాజికల్ సిరీస్.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

Aha OTT New Web Series Chiranjeeva: ఈ మధ్య కాలంలో మైథాలాజికల్ సినిమాలు, వెబ్ సిరీసులు ఎక్కువగా వస్తున్నాయి. భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై సినిమాలు తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చాలా ఆసక్తిచూపుతున్నారు. ఎందుకంటే సరైనా పద్ధతిలో తెరకెక్కిస్తే ఈ మైథాలాజికల్ థ్రిల్లర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

మైథాలాజికల్ థ్రిల్లర్స్

ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లి విభిన్నమైన అనుభూతిని కలిగించే మైథాలాజికల్ థ్రిల్లర్స్ అటు మూవీ లవర్స్‌తోపాటు సినీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాయి. అందుకే ఈ తరహా జోనర్ మూవీస్, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నారు. ఇక తెలుగులో డిఫరెంట్ కంటెంట్‌తో అలరిస్తోన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా.

చిరంజీవ వెబ్ సిరీస్

ఆహా ఓటీటీ ఇతర భాషా చిత్రాలను తెలుగులో అందించడంతోపాటు అచ్చతెలుగు ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీసులను నిర్మిస్తోంది. అలా తాజాగా మరొ కొత్త వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్. ఆ వెబ్ సిరీస్ పేరే చిరంజీవ. మెగాస్టార్ చిరంజీవి పేరుతో వస్తోన్న ఈ సిరీస్ మైథాలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది.

ఎఫెక్టివ్‌గా పోస్టర్

తాజాగా చిరంజీవ వెబ్ సిరీస్‌ను అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా ఓటీటీ టీమ్. ఇందులో ఒక ఎద్దు శివనామాలతో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తే.. రోడ్‌పై ఓ యువకుడిని వెనుకనుంచి చూపించారు. చిరంజీవ పోస్టర్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటూ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆహా ఒరిజనల్ వెబ్ సిరీస్ అంటూ చిరంజీవ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

అద్భుతమైన విజువల్స్‌తో

చిరంజీవ వెబ్ సిరీస్ అన్ని రకాల వయసు గల ప్రేక్షకులను ఆకట్టుకునే ఆసక్తికరమైన కంటెంట్‌తో అలరిస్తుందని ఆహా టీమ్ చెబుతోంది. అద్భుతమైన విజువల్స్‌తో మంచి అనుభూతిని అందించడం లక్ష్యంగా చిరంజీవ తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు మేకర్స్. ఈ చిరంజీవి సిరీస్‌ను ఏ రాహుల్ యాదవ్, సుహాసిని నిర్మిస్తున్నారు.

డిసెంబర్‌లో ఓటీటీ స్ట్రీమింగ్

అచ్చు రాజమణి సంగీతం అందిస్తోన్న చిరంజీవ వెబ్ సిరీస్‌కు అభినయ కృష్ణ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటించే నటీనటుల గురించి త్వరలో వెల్లడిస్తామని ఆహా టీమ్ తెలిపింది. గేమ్ చేంజింగ్ వెబ్ సిరీస్‌గా చిరంజీవ రూపొందుతోందని, 2024 డిసెంబర్‌లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు.

ఓటీటీ రిలీజ్ డేట్

అంటే, మరో నెలలో ఆహా ఓటీటీలో చిరంజీవ డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే, చిరంజీవ ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, తెలుగు కంటెంట్‌తో అలరిస్తోన్న ఆహా ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లతోపాటు టాక్ షో, కామెడీ షోలు అలరిస్తున్నాయి.

ఆహా ఓటీటీ సినిమాలు

ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 ప్రారంభమైంది. ఇప్పటికీ రెండు ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో టెలీకాస్ట్ అయ్యాయి. మొదటి ఎపిసోడ్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథిగా వస్తే.. రెండో ఎపిసోడ్‌లో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి గెస్ట్‌లుగా సందడి చేశారు. ఇలా వైవిధ్యమైన కంటెంట్‌తో ఆహా ఓటీటీ మూవీ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది.

Whats_app_banner