ఐపీఎల్ 2025, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025: Latest IPL 2025 News, Live Score, Points Table, Schedule, Results, Team and Player Squads in Telugu - HT Telugu

Indian Premier League (IPL) 2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ వచ్చేసింది. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్.. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 8 జట్లతో మొదలైన ఈ లీగ్ లో ప్రస్తుతం పది టీమ్స్ ఉన్నాయి. 2022లో గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జెయిట్స్ జట్లు లీగ్ లో అడుగు పెట్టాయి. 2025లో పది టీమ్స్ మరోసారి పూర్తి కొత్త లుక్ తో అడుగుపెడుతున్నాయి. గతేడాది జరిగిన మెగా వేలంలో అన్ని జట్ల స్వరూపం పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. గత మూడు సీజన్లలో పదేసి జట్లు పాల్గొన్నాయి. ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ కు పేరుంది. ప్రతి ఏటా కొన్ని వేల కోట్లు ఈ మెగా లీగ్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోకి వస్తున్నాయి.

ఈ లీగ్ ను చూసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇతర లీగ్స్ పుట్టుకొచ్చినా అవేవీ ఈ ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా రాలేదు. బిగ్ బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఎస్ఏ20, ఐఎల్‌టీ20, పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్ లాంటివి ఐపీఎల్ స్ఫూర్తితో ప్రారంభమైనవే.

ఈసారి కూడా ఈ మెగా లీగ్ లో 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ లీగ్ లో తలపడనున్నాయి. వీటిలో ఆరు జట్లు ఇప్పటికే టైటిల్ ను కనీసం ఒక్కసారైనా గెలవగా.. మరో నాలుగు జట్లు తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్నాయి.

లీగ్ లో పది జట్లు పాల్గొనడం మొదలయ్యాక మ్యాచ్ ల సంఖ్య 74కు పెరిగింది. దీంతో ఈసారి కూడా మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో లీగ్ మ్యాచ్ లు 70 కాగా.. మరో నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ లు. ప్లేఆఫ్స్ లో భాగంగా మొదట క్వాలిఫయర్ 1, తర్వాత ఎలిమినేటర్, ఆ తర్వాత క్వాలిఫయర్ 2, చివరగా ఫైనల్ జరుగుతాయి. ఐపీఎల్ టైటిల్ ను ఇప్పటి వరకూ అత్యధిక సార్లు అందుకున్న టీమ్ రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్. ఆ టీమ్ 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ గెలుచుకుంది.

అయితే గతేడాది ఆ రికార్డును ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 2023లో సమం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 2010, 2011, 2018, 2021, 2023లో ఛాంపియన్‌గా నిలిచింది. తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ నెగ్గలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ మూడుసార్లు (2012, 2014, 2024) టైటిల్‌ను గెలుచుకుంది. ఇక హైదరాబాద్ టీమ్ తొలిసారి డెక్కన్ ఛార్జర్స్ గా 2009లో ఒకసారి, సన్ రైజర్స్ హైదరాబాద్ గా 2016లో మరోసారి టైటిల్ సొంతం చేసుకుంది. గుజరాత్ టైటన్స్ తాము అడుగు పెట్టిన తొలి సీజన్లోనే అంటే 2022లో ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తొలి సీజన్ నుంచీ ఆడుతున్నా టైటిల్ గెలవలేదు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ వరకూ వచ్చింది.

ఐపీఎల్ 2025 లేటెస్ట్ న్యూస్

ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్

PosTeamMatchesWonLostTiedNRPointsNRRSeries Form
1PUNJAB KINGSPunjab Kings14940119+0.372
WLWWW
2ROYAL CHALLENGERS BENGALURURoyal Challengers Bengaluru14940119+0.301
WLAWW
3GUJARAT TITANSGujarat Titans14950018+0.254
LLWWW
4MUMBAI INDIANSMumbai Indians14860016+1.142
LWLWW

ఐపీఎల్ 2025 లేటెస్ట్ ఫోటోలు

ఐపీఎల్ 2025 రికార్డులు

ఐపీఎల్ 2025 లేటెస్ట్ వెబ్ స్టోరీలు

ఐపీఎల్ 2025 వీడియోలు

ఐపీఎల్ 2025 FAQs

Q: ఐపీఎల్ లో ఎక్కువ టైటిల్స్ గెలుచుకున్న జట్టు ఏది?

A: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో 5 సార్లు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాయి.

Q: ఐపీఎల్ 2025తో ఎన్ని సీజన్లు పూర్తయ్యాయి?

A: 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 2025లో 18వ సీజన్ జరగనుంది.

Q: ఇప్పటి వరకూ ఐపీఎల్ గెలవని జట్లు ఏవి?

A: పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోలేదు.

Q: సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకూ ఎన్ని ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది?

A: సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో టైటిల్ గెలిచింది. అయితే అంతకుముందు డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ కూడా 2009లో టైటిల్ సొంతం చేసుకుంది.