IPL Fastest Centuries: ఐపీఎల్‍లో ఐదో వేగవంతమైన సెంచరీ చేసిన విల్ జాక్స్.. టాప్-4లో ఎవరు ఉన్నారంటే..-ipl fastest centuries rcb batter will jacks hits fifth fastest hundred know who are in top 4 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl Fastest Centuries: ఐపీఎల్‍లో ఐదో వేగవంతమైన సెంచరీ చేసిన విల్ జాక్స్.. టాప్-4లో ఎవరు ఉన్నారంటే..

IPL Fastest Centuries: ఐపీఎల్‍లో ఐదో వేగవంతమైన సెంచరీ చేసిన విల్ జాక్స్.. టాప్-4లో ఎవరు ఉన్నారంటే..

Apr 28, 2024, 10:33 PM IST Chatakonda Krishna Prakash
Apr 28, 2024, 10:33 PM , IST

  • IPL Fastest Centuries: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ 41 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 28) గుజరాత్‍తో జరిగిన మ్యాచ్‍లో జాక్స్ ఈ విధ్వంసం చేశాడు. ఐపీఎల్‍లో ఐదో వేగవంతమైన సెంచరీ సాధించాడు. టాప్-4లో ఎవరు ఉన్నారంటే..

ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్, ఇంగ్లండ్ స్టార్ విల్ జాక్స్ విధ్వంసం చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా నేడు (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‍లో  41 బంతుల్లోనే 10 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో అజేయంగా 100 పరుగులు చేశాడు సెంచరీ సాధించాడు. 

(1 / 8)

ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్, ఇంగ్లండ్ స్టార్ విల్ జాక్స్ విధ్వంసం చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా నేడు (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‍లో  41 బంతుల్లోనే 10 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో అజేయంగా 100 పరుగులు చేశాడు సెంచరీ సాధించాడు. (ANI)

ఈ మ్యాచ్‍లో హాఫ్ సెంచరీ మార్క్ చేరేందుకు 31 బంతులు ఆడాడు విల్ జాక్స్. అయితే, ఆ తర్వాత 10 బంతుల్లోనే 50 పరుగులు చేసి సెంచరీ చేరాడు. ఐపీఎల్‍లో 50 నుంచి 100 పరుగులను అత్యంత వేగంగా చేరిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే, 41 బంతుల్లో 100 పరుగులకు చేరి ఐపీఎల్‍లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.

(2 / 8)

ఈ మ్యాచ్‍లో హాఫ్ సెంచరీ మార్క్ చేరేందుకు 31 బంతులు ఆడాడు విల్ జాక్స్. అయితే, ఆ తర్వాత 10 బంతుల్లోనే 50 పరుగులు చేసి సెంచరీ చేరాడు. ఐపీఎల్‍లో 50 నుంచి 100 పరుగులను అత్యంత వేగంగా చేరిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే, 41 బంతుల్లో 100 పరుగులకు చేరి ఐపీఎల్‍లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.(PTI)

ఐపీఎల్‍లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఇంకా వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ పేరిటే ఉంది. 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 30 బంతుల్లోనే పుణె వారియల్స్ జట్టుపై గేల్ శతకం బాదాడు. 

(3 / 8)

ఐపీఎల్‍లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఇంకా వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ పేరిటే ఉంది. 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 30 బంతుల్లోనే పుణె వారియల్స్ జట్టుపై గేల్ శతకం బాదాడు. (BCCI)

భారత స్టార్ యూసుఫ్ పఠాన్ 2010లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 37 బంతుల్లోనే ముంబైపై సెంచరీ బాదాడు. ఐపీఎల్‍లో ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 

(4 / 8)

భారత స్టార్ యూసుఫ్ పఠాన్ 2010లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 37 బంతుల్లోనే ముంబైపై సెంచరీ బాదాడు. ఐపీఎల్‍లో ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 

2013 సీజన్‍లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. బెంగళూరుపై ఈ శతకం చేశాడు. ఐపీఎల్‍లో మూడో వేగవంతమైన సెంచరీగా ఇది ఉంది. 

(5 / 8)

2013 సీజన్‍లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. బెంగళూరుపై ఈ శతకం చేశాడు. ఐపీఎల్‍లో మూడో వేగవంతమైన సెంచరీగా ఇది ఉంది. (HT Photo)

ప్రస్తుత 2024 సీజన్‍లోనే సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే బెంగళూరుపై సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీల్లో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

(6 / 8)

ప్రస్తుత 2024 సీజన్‍లోనే సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే బెంగళూరుపై సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీల్లో నాలుగో స్థానంలో ఉన్నాడు. (PTI)

విల్ జాక్స్ నేటి మ్యాచ్‍లో గుజరాత్‍పై 41 బంతుల్లోనే శకతం బాదాడు. తద్వారా ఐపీఎల్‍లో ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్‍లో ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో ఆడమ్ గిల్‍క్రిస్ట్ (42 బంతులు - డెక్కన్ ఛార్జర్స్,2008) ఆరో ప్లేస్‍లో ఉంటే.. ఏబీ డెవిలియర్స్ (43 బంతులు - ఆర్సీబీ, 2016), డేవిడ్ వార్నర్ (43 బంతులు - ఎస్ఆర్‌హెచ్,2017) ఏడో స్థానంలో ఉన్నారు. 

(7 / 8)

విల్ జాక్స్ నేటి మ్యాచ్‍లో గుజరాత్‍పై 41 బంతుల్లోనే శకతం బాదాడు. తద్వారా ఐపీఎల్‍లో ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్‍లో ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో ఆడమ్ గిల్‍క్రిస్ట్ (42 బంతులు - డెక్కన్ ఛార్జర్స్,2008) ఆరో ప్లేస్‍లో ఉంటే.. ఏబీ డెవిలియర్స్ (43 బంతులు - ఆర్సీబీ, 2016), డేవిడ్ వార్నర్ (43 బంతులు - ఎస్ఆర్‌హెచ్,2017) ఏడో స్థానంలో ఉన్నారు. (PTI)

గుజరాత్ టైటాన్స్‌తో నేడు జరిగిన మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 16 ఓవర్లలోనే 206 పరుగులు చేసి గెలిచింది. 

(8 / 8)

గుజరాత్ టైటాన్స్‌తో నేడు జరిగిన మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 16 ఓవర్లలోనే 206 పరుగులు చేసి గెలిచింది. (PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు