Deepak Chahar: ఇది రియల్ లైఫ్ సైంధవ్ మూవీ - హీరోగా నిలిచిన టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్
Deepak Chahar: వెంకటేష్ సైంధవ్ మూవీ లాంటి స్టోరీ రియల్ లైఫ్‌లో జరిగింది. రాజస్థాన్‌కు చెందిన 22 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడటంతో టీమిండియా పేసర్ దీపక్ చాహర్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కీలక పాత్ర పోషించారు.
Deepak Chahar:వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో వెంకటేష్ కూతురు స్పైనల్ మస్క్యూలర్ అట్రోపీ అనే వ్యాధితో బాధపడుతుంటుంది. తన కూతురిని రక్షించుకోవడం కోసం 17 కోట్లవిలువైన ఇంజెక్షన్ కోసం వెంకటేష్ విలన్స్‌తో పోరాడినట్లుగా ఈ సినిమాలో డైరెక్టర్ చూపించారు. సైంధవ్ మూవీ మొత్తం ఈ పదిహేడు కోట్ల ఇంజెక్షన్ చుట్టే తిరుగుతుంది. సైంధవ్ లాంటి కథే రియల్‌లైఫ్‌లో జరిగింది. ఈ రియల్ స్టోరీలో టీమిండియా క్రికెటర్ దీపర్ చాహర్‌తో పాటు నటుడు సోనూ సూద్ హీరోలుగా నిలిచారు.
స్పైనల్ మస్క్యూలర్ అట్రోపీ…
రాజస్థాన్‌కు చెందిన 22 నెలల చిన్నారి హ్రిదయాన్ష్ శర్మ స్పైనల్ మస్క్యూలర్ అట్రోపీ అనే జెనెటిక్ డిజార్డర్‌తో బాధపడుతోన్నాడు. ఈ వ్యాధి నుంచి అతడు కోలుకోవాలంటే 17.5 కోట్ల ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తేల్చారు. జోల్జెన్స్మా పేరుతో నోవార్టిస్ కంపెనీ రూపొందించిన ఈ ఇంజెక్షన్ ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన డ్రగ్‌గా పేరుతెచ్చుకున్నది. ఈ ఇంజెక్షన్‌ను రెండు సంవత్సరాలు పూర్తయ్యే లోపే హిద్రయాన్స్ శర్మకు వేస్తేనే అతడు బతుకుతాడని డాక్టర్లు తేల్చిచెప్పారు.
ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్...
హ్రిదయాన్ష్ శర్మ తండ్రి నరేష్ శర్మ రాజస్థాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. తన కొడుకును కాపాడుకునే స్థోమత లేకపోవడంతో దాతల నుంచి ఆర్థిక సహాయాన్ని కోరాడు. అది కూడా రెండు నెలల టైమ్‌లో 17.5 కోట్లు సేకరించడం అంటే మామూలు విషయం కాదు. ఈ చిన్నారిని కాపాడేందుకు రాజస్థాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌ను ఏర్పాటుచేసింది.
దీపక్ చాహర్...
ఈ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు టీమిండియా పేసర్ దీపక్ చాహర్‌తో పాటు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ముందుకొచ్చారు. హ్రిదయాన్స్ ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలంటూ దీపక్ చాహర్, సోనూసూద్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్‌లు పెట్టారు. దీపక్ చాహర్, సోనూసూద్ పోస్ట్‌లకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పండ్లు, కూరగాయాలు అమ్మేవాళ్ల వాళ్ల నుంచి చిన్న చితకా ఉద్యోగాలు చేసేవారు కూడా విరాళాలు అందజేశారు. ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌లో పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మొత్తం తొమ్మిది కోట్ల వరకు విరాళాలు సేకరించారు. .
ట్రీట్‌మెంట్ పూర్తి...
ఈ తొమ్మిది కోట్లతో హ్రిదయాన్ష్‌కు రాజస్థాన్‌లోని జేకే హాస్సిటల్‌లో ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. మిగిలిన డబ్బును మూడు వాయిదాల్లో చెల్లెంచేలా హాస్పిటల్ వర్గాలతో ఒప్పందం కుదుర్చుకొనిఅతడికి జోల్జెన్స్మా ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం హ్రిదయాన్ష్ కు ప్రాణాపాయం తప్పిందని, అతడు కోలుకుంటున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
నెటిజన్ల ప్రశంసలు...
చిన్నారిని కాపాడేందుకు ఈ ఫండ్ రైజింగ్ క్యాపెయిన్‌గా అండగా నిలిచిన దీపక్ చాహర్‌తో పాటు సోనూసూద్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తోన్నారు. ప్రస్తుతం దీపక్ చాహర్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్నాడు. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన చాహర్ ఐదు వికెట్లు తీశాడు. గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. టీమిండియా తరఫున 13 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడాడు దీపక్ చాహర్.
టాపిక్