JEE Advanced 2025: ఈ తేదీ నుంచే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్స్; ఇన్ఫర్మేషన్ బ్రోచర్ విడుదల
JEE Advanced 2025: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ను విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 కు సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందుపర్చారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి..
JEE Advanced 2025: కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ను శనివారం, డిసెంబర్ 21, 2024న విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్డ్) 2025కు హాజరు కావాలనుకునే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in నుంచి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్స్ డేట్
కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విడుద చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ప్రకారం, ఐఐటీ జేఈఈ (jee) రిజిస్ట్రేషన్స్ ఏప్రిల్ 23, 2025 న ప్రారంభమవుతాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 2, 2025. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 5, 2025.
మే 18న పరీక్ష
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 (JEE Advanced 2025) పరీక్ష పేపర్ 1, పేపర్ 2 కోసం మే 18న జరగనుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డును మే 11, 2025న విడుదల చేస్తామని, మే 18, 2025 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
ఇన్ఫర్మేషన్ బ్రోచర్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
- జేఈఈ అడ్వాన్స్డ్ 2025 అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పీడీఎఫ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2025 కు సంబంధించిన పూర్తి వివరాలను చూడవచ్చు.
- ఆ పీడీఎఫ్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని, అవసరమైతే దాని హార్డ్ కాపీని తదుపరి అవసరాల కోసం భద్రపర్చుకోండి.
జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటీల నిర్వహణ
జేఈఈ అడ్వాన్స్డ్ 2025ను జాయింట్ అడ్మిషన్ బోర్డు 2025 (JAB 2025) మార్గదర్శకత్వంలో ఏడు జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటీలు నిర్వహించనున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో అన్ని ఐఐటీల్లో బ్యాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాముల్లో (10+2 స్థాయిలో ప్రవేశం) ప్రవేశానికి జేఈఈ (అడ్వాన్స్డ్) 2025లో అభ్యర్థి సాధించిన స్కోరే ఆధారం. జేఈఈ అడ్వాన్స్డ్ 2025, 2025-26 విద్యా సంవత్సరంలో ఐఐటీ (IIT)ల్లో ప్రవేశాలకు సంబంధించిన అన్ని విషయాల్లో జేఏబీ 2025 నిర్ణయాలే ఫైనల్ కానున్నాయి.