AP Govt PROs 2024 : ఏపీ మంత్రుల పేషీల్లో పీఆర్వో ఉద్యోగాలు - నెలకు రూ. 37 వేల జీతం, ముఖ్య వివరాలివే-notification issued for the appointment of pros in the peshis of ministers in andhrapradesh ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Govt Pros 2024 : ఏపీ మంత్రుల పేషీల్లో పీఆర్వో ఉద్యోగాలు - నెలకు రూ. 37 వేల జీతం, ముఖ్య వివరాలివే

AP Govt PROs 2024 : ఏపీ మంత్రుల పేషీల్లో పీఆర్వో ఉద్యోగాలు - నెలకు రూ. 37 వేల జీతం, ముఖ్య వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 21, 2024 11:16 AM IST

AP Govt PROS Recruitment 2024 : ఏపీ మంత్రుల పేషీల్లో పీఆర్వో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 24 మంది మంత్రుల పేషీల్లోఈ నియాకాలను చేపట్టనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 37వేల జీతం ఇస్తారు. తాత్కాలిక ప్రతిపాదికన ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తారు.

ఏపీ మంత్రుల పేషీల్లో పీఆర్వో ఉద్యోగాలు
ఏపీ మంత్రుల పేషీల్లో పీఆర్వో ఉద్యోగాలు (image source @IPR_AP)

మంత్రుల పేషీల్లో పీఆర్వోల నియామకానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 24 మంది మంత్రుల పేషీల్లో ఒక్కో పీఆర్వోను రిక్రూట్ చేయనున్నారు. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ జీవో జారీ చేసింది. నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను పేర్కొంది.

yearly horoscope entry point

అర్హతలు…

డిగ్రీ పాసై జర్నలిజం లేదా జర్నలిజం డిప్లామాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులవుతారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.37 వేల జీతం చెల్లిస్తారు. తాత్కాలిక ప్రతిపాదికన ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తారు.

ఏపీసీవోఎస్ లేదా పేరొందిన రిక్రూట్ మెంట్ ఏజెన్సీల ద్వారా నియామక ప్రక్రియను చేపడుతారు. ఇందుకు సంబంధించిన వివరాలను విజయవాడలోని పౌర సంబంధాల కార్యాలయం వెల్లడించనుంది. http://ipr.ap.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు

  • పోస్ట్ పేరు: పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
  • ఖాళీల సంఖ్య: 24
  • అపాయింట్‌మెంట్ విధానం: అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన
  • అర్హత: సంబంధిత విభాగంలో అనుభవంతో పాటు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు జర్నలిజం చదివి ఉండాలి.
  • నెలకు వేతనం: రూ. 37,000 వరకు ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - http://ipr.ap.gov.in/

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా రాతపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్‌ లెటర్లు విడుదలయ్యాయి. డిసెంబర్ 30 నుంచి దేహదారుఢ్య పరీక్షల్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 29వ తేదీ వరకు కాల్ లెటర్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

దేహదారుఢ్య పరీక్షలు 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1వరకు నిర్వహిస్తారని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 ఆఫీసుఉ.10-సా.6సమయంలో నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Whats_app_banner

సంబంధిత కథనం