Pushpa 2 HD Leak: షాకింగ్.. ఆన్‍లైన్‍లో పుష్ప 2 సినిమా హెచ్‍డీ వెర్షన్ లీక్
Pushpa 2 HD Version Leak: పుష్ప 2 మూవీకి షాక్ ఎదురైంది. థియేటర్లలో ఈ మూవీ దుమ్మురేపుతుండగా.. ఇంతలోనే ఆన్‍లైన్‍లో హెచ్‍డీ వెర్షన్ లీకైంది. పైరసీ సైట్లలో కనిపిస్తోంది. ఆ వివరాలు ఇవే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ దుమ్మురేపుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అయింది. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లోనూ అదరగొడుతోంది. తాజాగా రూ.1,500 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి మరో రికార్డు బద్దలుకొట్టింది. థియేటర్లలో ఇంకా జోరుగా వసూళ్లు రాబడుతోంది. ఈ తరుణంలో పుష్ప 2 మూవీకి షాక్ ఎదురైంది.
హెచ్‍డీ వెర్షన్ లీక్
పుష్ప 2 సినిమా హెచ్‍డీ వెర్షన్ ఆన్‍లైన్‍లో లీక్ అయింది. ఏకంగా ఓటీటీ వెర్షన్‍లా ఫుల్ క్లారిటీతో ఈ హెచ్‍డీ ప్రింట్ వచ్చింది. పైరసీ సైట్లలో ఈ హెచ్‍డీ వెర్షన్ లీకైంది. దీంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
పుష్ప 2 సినిమాను 56 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురామని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి రూమర్లు వస్తుండడం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఇంతలోనే పుష్ప 2 హెచ్‍డీ వెర్షన్ ఆన్‍లైన్‍లో లీకైపోయింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూవీ మేకర్స్ ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ఇది నెట్టింట్లో హాట్ టాపిక్‍గా మారింది.
ఫ్యాన్స్ డిమాండ్
పుష్ప 2 మూవీ హెచ్‍డీ వెర్షన్‍ను ఆన్‍లైన్‍లో నుంచి తొలగించేలా మేకర్స్ వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ మూవీ వసూళ్లపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీక్ అయ్యేందుకు కారణాలు ఏంటో గుర్తించి.. యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. ఈ విషయంపై మూవీ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.
పుష్ప 2 సినిమా అత్యంత వేగంగా రూ.1,500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆ మార్కును 14 రోజుల్లోనే దాటేసింది. క్రిస్మస్, న్యూఇయర్ ఉండడం, పెద్దగా వేరే సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో ఈ చిత్రానికి వసూళ్ల జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రూ.2,000కోట్లకు కూడా చేరే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో హెచ్‍డీ వెర్షన్ లీక్ కావడం ఎదురుదెబ్బగానే కనిపిస్తోంది.
పుష్ప 2 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా చేశారు. ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ మెప్పించారు. జగపతి బాబు, రావురమేశ్, సునీల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, అనసూయ, అజయ్ ఈ మూవీలో కీరోల్స్ చేశారు. స్పెషల్ సాంగ్‍లో శ్రీలీల చిందేశారు. ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం