Tata Motors shares : టాటా మోటార్స్ షేర్లు ఉన్న వారు కచ్చితంగా చూడాలి! స్టాక్ అమ్మేయాలా?
Tata Motors share price target : టాటా మోటార్స్ స్టాక్‌లో భారీ పతనంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. మరి ఇప్పుడు ఎగ్జిట్ చేయాలా? హోల్డ్ చేయాలా? టాటా మోటార్స్ పరిస్థితేంటి? నిపుణులు ఏమంటున్నారంటే..
దేశీయ స్టాక్ మార్కెట్లో గత వారం రక్తపాతం కనిపించింది! ప్రధాన సూచీలు భారీ నష్టాలను చూశాయి. మరీ ముఖ్యంగా కొన్ని స్టాక్స్ దారుణ ప్రదర్శన చేసి, ఇన్వెస్టర్స్‌ని భయపెట్టేశాయి. టాటా మోటార్స్ స్టాక్ వీటిల్లో ఒకటి! టాటా మోటార్స్ షేర్లు గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదొడుకులకు లోనై, భారీగా పతనమయ్యాయి. ఆ కంపెనీ షేరు దాదాపు ‘52 వీక్ లో’ దగ్గర ఉంది. మరి టాటా మోటార్స్ షేర్లు పెరుగుతాయా? ఇంకా పడతాయా? షేర్లను అమ్మేయాలా? నిపుణుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ హిస్టరీ..?
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో టాటా మోటార్స్ షేర్లు 2.95శాతం పడి రూ. 724.3 వద్దకు చేరాయి. 5 రోజుల వ్యవధిలో ఈ కంపెనీ షేర్లు 8.1శాతం, నెల రోజుల్లో ఏకంగా 6.4శాతం మేర పతనమయ్యాయి. ఆరు నెలల్లో మాత్రం టాటా మోటార్స్ షేరు ధర 24.6శాతం పడింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 8.3శాతం పతనమైంది. ఏడాది కాలంలో మాత్రం 2.18శాతం వృద్ధిని నమోదు చేసింది.
టాటా మోటార్స్ ఆల్‌టైమ్ హై రూ. 1,179. 52 వీక్ లో- రూ. 696.25
మార్కెట్లో వాహనాలకు డిమాండ్ తగ్గడం, ఇతర కంపెనీలతో విపరీతమైన పోటీ నెలకొనడంతో టాటా మోటార్స్ షేర్లు గత కొంతకాలంగా పతనమవుతున్నాయి.
టాటా మోటార్స్ షేరుకు 'బై' రేటింగ్ ఇచ్చింది బ్రోకరేజీ సంస్థ ఎల్కేపీ సెక్యూరిటీస్. ద్వితీయార్థంలో దేశీయ వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ పెరగవచ్చని, ఇటీవల లాంచ్‌లు సైతం ఇందుకు మద్దతు ఇస్తాయని బ్రోకరేజీ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ టార్గెట్‌ని రూ .970 అని ప్రకటించింది. ఇది ప్రస్తుత ధర కంటే దాదాపు 30 శాతం ఎక్కువ.
సేల్స్ ఎలా ఉన్నాయి..?
ఇత టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు నవంబర్‌లో స్వల్పంగా పెరిగి 74,753 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం దేశీయ అమ్మకాలు 2023 నవంబర్‌లో 72,647 యూనిట్ల నుంచి ఒక శాతం పెరిగి 73,246 యూనిట్లకు చేరుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలతో సహా మొత్తం ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు నవంబర్‌లో 2 శాతం పెరిగి 46,143 యూనిట్ల నుంచి 47,117 యూనిట్లకు చేరుకున్నాయి.
టాటా మోటార్స్ ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) నుంచి 1,297 బస్ ఛాసిస్ల కోసం ఆర్డర్ పొందింది. ఏడాదిలో యూపీఎస్ఆర్టీసీ నుంచి ఇది మూడో ఆర్డర్ అని టాటా మోటార్స్ తెలిపింది. ఈ విధంగా మొత్తం 3,500 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చాయి.
(గమనిక:- ఇది నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. స్టాక్‌లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం