Electric Cars : ఈ ఏడాది మార్కెట్‌లోకి వచ్చిన సూపర్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇందులో మీ ఫేవరెట్ ఉందా?
Electric Cars : ఈ ఏడాది మార్కెట్‌లో మంచి మంచి ఎలక్ట్రిక్ కార్లు వచ్చాయి. ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లు ఈవీ వెర్షన్‌లో లాంచ్ అయ్యాయి. అందులో కొన్నింటి గురించి చుద్దాం..
ఆటోమెుబైల్ మార్కెట్‌లో భారత్ దూసుకెళ్తోంది. మరికొన్ని ఏళ్లలో అగ్రస్థానంలో ఉండనుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు ఆకర్షణీయమైన డిజైన్‌లు, ఫీచర్లతో హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్‌యూవీలు, ఎంపీవీలను అమ్ముతున్నాయి. టాటా, మారుతి సుజుకి, మహీంద్రాతో సహా వివిధ కార్ల తయారీదారులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అన్ని ప్రముఖ ప్రముఖ కార్ల తయారీదారులు ఎలక్ట్రిక్ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సంవత్సరం అనేక ఎలక్ట్రిక్ కార్లు ప్రారంభమయ్యాయి. వాటి గురించి తెలుసుకుందాం..
ఎంజీ విండ్సర్ ఈవీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని విస్తరించింది. ఇందులో భాగంగా ఎంజీ విండ్సర్ ఈవీ మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది.
టాటా పంచ్ ఈవీ
ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ సంవత్సరం భారతదేశంలో నాల్గో ఎలక్ట్రిక్ మోడల్‌గా పంచ్ ఈవీని విడుదల చేసింది. టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో బాగా సేల్ అవుతోంది. టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. 25 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు 315 కి.మీ రేంజ్ అందిస్తుంది. మరో 35 kWh బ్యాటరీ ప్యాక్ 421 కి.మీ రేంజ్ ఇస్తుంది. మిడిల్ రేంజ్ మోడల్ 80బీహెచ్‌పీ, 114ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే లాంగ్ రేంజ్ మోడల్ 120బీహెచ్‌పీ, 190ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రెండు ఛార్జర్ ఆప్షన్స్ అందిస్తుంది, 7.2 kW ఫాస్ట్‌చార్జర్, 3.3 kW వాల్‌బాక్స్ ఛార్జర్ లాంగ్ రేంజ్ వేరియంట్‌కు ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. . ఈ ఎలక్ట్రిక్ కారులో క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
టాటా కర్వ్ ఈవీ
స్వదేశీ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ తన టాటా కర్వ్ ఈవీ కూపే ఎస్‌యూవీని విడుదల చేసింది. టాటా ఎలక్ట్రిక్ క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్, ఎంపవర్డ్ ప్లస్ ఎ అనే ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ ఎస్‌యూవీ కూపే బాడీ స్టైల్‌ను కలిగి ఉంది. టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ కలిగి ఉంది. ఇందులో 45 kWh బ్యాటరీ ప్యాక్ 502 కి.మీ రేంజ్ ఇస్తుంది. అయితే 55 kWh బ్యాటరీ ప్యాక్ 585 కి.మీ రేంజ్‌తో వస్తుంది.
వీటితోపాటుగా అనేక కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌లోకి వచ్చాయి. అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయి.