Thandel Shiva Shakti Song: శివ పార్వతుల్లా నాగ చైతన్య, సాయి పల్లవి.. తండేల్ నుంచి రెండో పాట శివ శక్తి రిలీజ్ డేట్ ఇదే!
Thandel Shiva Shakti Song Release Date: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన తండేల్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ శివ శక్తి రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. కాశీలోని ప్రముఖ పుణ్య ఘాటులో శివ శక్తి పాట విడుదల చేస్తున్నట్లు తెలిపిన పోస్టర్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి పోజు అదిరిపోయింది.
Thandel Second Song Shiva Shakti Release Date: యువ సామ్రాట్ నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి మరోసారి జోడీ కట్టి నటించిన సినిమా తండేల్. వీరిద్దరి కాంబినేషన్‌లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీగా తండేల్ తెరెకక్కింది. తండేల్ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు.
బుజ్జి తల్లి పాటకు
అలాగే, తండేల్ మూవీని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. అయితే, ఇదివరకు విడుదలైన తండేల్ మూవీ ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
30 మిలియన్లకుపైగా వ్యూస్
బుజ్జి తల్లి పాట ఇప్పటికే యూట్యూబ్‌లో 30 మిలియన్లకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. అలాగే, అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఇక తాజాగా తండేల్ మూవీలోని రెండో పాటకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ (డిసెంబర్ 18) తండేల్ మూవీ సెకండ్ సింగిల్ శివశక్తి సాంగ్‌ను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కాశీలోని ఘాట్స్‌లో సాంగ్ రిలీజ్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీలోని పవిత్రమైన ఘాట్స్‌లో శివ శక్తి పాటను లాంచ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే ఈ పాట సంగీతపరంగా, విజువల్‌గా అద్భుతంగా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు.
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ
ఓ పండుగను అత్యంత వైభవంగా జరుపుకునే అనుభూతినిచ్చేలా ఈ పాట ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే, శివ శక్తి పాటకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు పవర్‌ఫుల్‌గా పోజు ఇచ్చారు. శివ శక్తి పోజులో నాగ చైతన్య, సాయి పల్లవి కనిపించిన విధానం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. వారి పోజు పార్వతి పరమేశ్వరుడిలా కనిపిస్తోంది.
ఆధాత్మిక ఇతివృత్తం ప్రతిబింబించేలా
చుట్టూ పెద్ద సంఖ్యలో జనసమూహం, వారి మధ్య సంప్రదాయ వస్త్రధారణలతో జాతర ఉత్సాహపూరిత వాతావరణం పాటలో ఆధ్యాత్మిక ఇతివృత్తానికి జీవం పోస్తాయని దర్శకనిర్మాతలు పాట గొప్పదనం గురించి చెబుతున్నారు. ఇక ఈ పాటను భారీ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్‌లో చిత్రీకరించారు. ఇది ఇప్పటివరకు నాగ చైతన్య కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ సాంగ్‌గా నిలిచిందని అంటున్నారు.
వచ్చే ఏడాది రిలీజ్
కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తండేల్ మూవీకి షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అలాగే, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తండేల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఓటీటీ ట్రెండింగ్‌లో
ఇదిలా ఉంటే, సాయి పల్లవి ఇటీవల అమరన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అమరన్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అమరన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
టాపిక్