TG TET Schedule : తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల, జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు
TG TET Schedule : తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ బుధవారం టెట్ షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి.
TG TET 2024 : తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ బుధవారం టెట్ షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. టీచర్ పోస్టుల భర్తీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ టెట్ షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారు. సబ్జెక్టు వారీగా టెట్ షెడ్యూల్ విడుదైలంది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పరీక్ష జరగనున్నాయి.
తెలంగాణ టెట్ షెడ్యూల్ ఇలా
జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్షలను నిర్వహించనున్నారు. పేపర్ -2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. జనవరి 2వ తేదీన ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో సోషల్ స్టడీస్(పేపర్-2) జరగనుంది. జనవరి 5న ఉదయం సెషన్‌లో సోషల్ స్టడీస్(పేపర్ -2), మధ్యాహ్నం మ్యాథమేటిక్స్ అండ్ సైన్స్(పేపర్-2) పరీక్ష జరగనుంది.
ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులోనూ పేపర్-1కు 71,655 అప్లికేషన్లు రాగా… పేపర్-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై.. 11. 30 గంటలకు ఎగ్జామ్ ముగుస్తుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై... 04. 30 గంటలకు పూర్తవుతుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.
తెలంగాణ టెట్ 2024 (II) పరీక్షలను జనవరి 2 నుంచి నిర్వహించున్నారు. టెట్ హాల్ టికెట్లను ఈనెల 26వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్
- టీజీ టెట్ హాల్ టికెట్ల కోసం అభ్యర్థులు schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే ' Download TET Hall Tickets(II) 2024 ఆప్షన్ పై నొక్కాలి.
- రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
- పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.