AAI Recruitment : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఉన్నది కొన్ని రోజులే-aai apprentice recruitment 2024 application invited for 197 posts check eligibility and other know how to apply ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Aai Recruitment : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఉన్నది కొన్ని రోజులే

AAI Recruitment : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఉన్నది కొన్ని రోజులే

Anand Sai HT Telugu
Dec 18, 2024 07:18 AM IST

AAI Apprentice Recruitment 2024 : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

మీరు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)లో పని చేయాలని అనుకుంటే మీకోసం గుడ్‌న్యూస్ ఉంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 197 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు 25 డిసెంబర్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్ సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ వంటి వివిధ రంగాలకు సంబంధించినది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు ఏఏఐ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.

రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏఐసీటీఈ లేదా ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. ఐటీఐ అప్రెంటీస్‌లకు AICTE లేదా ప్రభుత్వం ఆమోదించిన సంస్థల నుండి ITI/NCVT ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయో పరిమితి 18 ఏళ్లుగా, గరిష్ట వయస్సు 26 ఏళ్లుగా ఉంది. దరఖాస్తు చేసుకునే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అనంతరం ఎంపికైనవారికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేస్తారు. గ్రాడ్యూయేట్ అప్రెంటీస్‌కు రూ.15 వేలు, ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్‌కు రూ. 9,000, డిప్లోమో అప్రెంటీస్‌కు రూ. 12,000 స్టైఫండ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి

స్టెప్ 1 : దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు AAI అధికారిక వెబ్‌సైట్ www.aai.aeroని సందర్శించాలి.

స్టెప్ 2 : తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో AAI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3 : దీని తర్వాత, అభ్యర్థి సమాచారాన్ని నమోదు చేయాలి.

స్టెప్ 4 : తర్వాత అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.

స్టెప్ 5 : దీని తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 6 : ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించండి.

స్టెప్ 7 : దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Whats_app_banner

టాపిక్