స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) కోసం దరఖాస్తు చేసుకోవాలని భావించే అభ్యర్థులు sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ చూడవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 13735 పోస్టులను భర్తీ చేయనున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 17న ప్రారంభమై 2025 జనవరి 7న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఈ కింద తెలుసుకోండి..
ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2024కి దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న వారు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ డిగ్రీ (ఐడీడీ) సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థుల ఉత్తీర్ణత తేదీ 31.12.2024 లోగా ఉండేలా చూసుకోవాలి.
01.04.2024 నాటికి అభ్యర్థుల కనిష్ఠ వయస్సు 20 సంవత్సరాలు. గరిష్ఠంగా 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి, అంటే అభ్యర్థుల పుట్టిన రోజు 02.04.1996 కంటే ముందు ఉండకూడదు, 01.04.2004 తర్వాత జన్మించి ఉండాలి (రెండు రోజులు కలుపుకొని).
ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్), స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్ష కాలవ్యవధి 1 గంట.
జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.750/
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్ఎస్/ డీఎక్స్ఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి స్క్రీన్‌పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
వివరణాత్మక ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం