Ellipaya Karam: నోరు చప్పగా అనిపిస్తే ఎల్లిపాయ కారం ఇలా చేసుకోండి, అన్నంలో కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది
Ellipaya Karam: ఎల్లిపాయ కారం రెసిపీ చాలా సులువు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలా ఎల్లిపాయ కారంతో అన్నం కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. రెసిపీ కూడా చాలా సులువు.
వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటితో చేసే ఆహారాలు ఏవైనా ఆరోగ్యానికి మంచిది. ఒంట్లో బాగోలేనప్పుడు నోరు చప్పగా అనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో ఎల్లిపాయ కారం వండుకొని చూడండి. ఇది పూర్తిగా వెజ్ రెసిపీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఎల్లిపాయ కారం ఎలా వండాలో సులువుగా తెలుసుకోండి.
ఎల్లిపాయ కారం రెసిపీకి కావాల్సిన పదార్థాలు
జీలకర్ర - రెండు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 20
కారం - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - మూడు స్పూన్లు
ఆవాలు - ఒక స్పూను
మినప్పప్పు - అర స్పూను
పచ్చిశనగపప్పు - అర స్పూను
మెంతులు - నాలుగు గింజలు
ఎండుమిర్చి - రెండు
కరివేపాకులు - గుప్పెడు
ఎల్లిపాయ కారం రెసిపీ
1. ఎల్లిపాయ కారం చేయడానికి వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి.
2. మీరు పొట్టు తీసి కావాలనుకుంటున్నారా లేదా పొట్టుతోనే చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం. ఎలా చేసిన ఇది రుచిగా ఉంటుంది.
3. రోటిలో కారం, జీలకర్ర, ఉప్పు వేసి ఒకసారి బాగా నూరండి.
4. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసి నూరుకోవాలి. మరీ మెత్తటి పేస్టులా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నట్టే నూరుకోవాలి.
5. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని తీసుకుని ఒక గిన్నెలో వేయాలి.
6. స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనెను వేసుకోవాలి.
7. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి బాగా వేయించుకోవాలి.
8. ఈ మొత్తం మిశ్రమాన్ని దంచి పెట్టుకున్నా వెల్లుల్లి మిశ్రమంలో కలుపుకోవాలి.
9. అంతే టేస్టీ ఎల్లిపాయ కారం రెడీ అయినట్టే. నోరుగా చప్పగా అనిపించినప్పుడు దీన్ని తిని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది.
10. ఎల్లిపాయ కారం కూడా అద్భుతంగా ఉంటుంది. స్పైసీగా ఉంటుంది.
11. కాబట్టి చలికాలంలో తినాలనిపిస్తుంది.
12. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఇలా ఎల్లిపాయ కారం తినడం వల్ల చలికాలంలో వచ్చే ఆర్థరైటిస్ నొప్పులు తగ్గే అవకాశం ఉంది.
వెల్లుల్లి పాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వెల్లుల్లిలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించే గుణం ఉంది. గుండెను ఇది కాపాడుతుంది. చలికాలంలో వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి. ఎందుకంటే వీళ్లలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. ఇది గొంతు, ముక్కు సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు వెల్లుల్లి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్‌ను కరిగించి వేస్తుంది. అలాగే హై బీపీతో బాధపడే వారు కూడా వెల్లుల్లిని అధికంగా తినాల్సిన అవసరం ఉంది. వెల్లుల్లి పొడి, వెల్లుల్లి నూనె ఏదైనా కూడా ఆరోగ్యానికి మేలే చేస్తుంది.
టాపిక్