Thriller OTT: ఓటీటీలోకి వ‌స్తోన్న కోలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్ - తెలుగులో రిలీజ్‌!-kollywood thriller movie nirangal moondru will be premiere on aha ott soon tamil and telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thriller Ott: ఓటీటీలోకి వ‌స్తోన్న కోలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్ - తెలుగులో రిలీజ్‌!

Thriller OTT: ఓటీటీలోకి వ‌స్తోన్న కోలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్ - తెలుగులో రిలీజ్‌!

Nelki Naresh Kumar HT Telugu
Dec 17, 2024 11:02 AM IST

Thriller OTT: త‌మిళ థ్రిల్ల‌ర్ మూవీ నిరంగ‌ల్ మూండ్రు ఈ వార‌మే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. డిసెంబ‌ర్ 20న ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అథ‌ర్వ ముర‌ళి, రెహ‌మాన్‌, శ‌ర‌త్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీకి కార్తిక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

థ్రిల్ల‌ర్ ఓటీటీ
థ్రిల్ల‌ర్ ఓటీటీ

Thriller OTT: కోలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీ నిరంగ‌ల్ మూండ్రు విభిన్న‌మైన ప్ర‌యోగంగా త‌మిళ‌ ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వ‌స్తోంది. డిసెంబ‌ర్ 20 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో నిరంగ‌ల్ మూండ్రు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. . త‌మిళంతోపాటు అదే రోజు నుంచి తెలుగులోనూ ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

ఒక్క రోజులో...

నిరంగ‌ల్ మూండ్రు మూవీలో అథ‌ర్వ ముర‌ళి, శ‌ర‌త్‌కుమార్, రెహ‌మాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ థ్రిల్ల‌ర్ మూవీకి కార్తిక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఒక్క రోజులో ఓ ముగ్గురు వ్య‌క్తుల జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి? అప్ప‌టివ‌ర‌కు వారు పెట్టుకున్న న‌మ్మ‌కాలు, సిద్ధాంతాలు అన్ని క‌నుమ‌రుగు అయ్యే ప‌రిస్థితి ఎందుకొచ్చింది అన్న‌దే అనే కాన్సెప్ట్‌తో నిరంగ‌ల్ మూండ్రు మూవీ తెర‌కెక్కింది.

హైప‌ర్ లింక్ స్క్రీన్‌ప్లే టెక్నిక్ ద‌ర్శ‌కుడు ఈ మూవీని రూపొందించాడు. టెక్నిక‌ల్ ప‌రంగా కొత్త‌గా ఉన్నా...కాన్సెప్ట్ స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు క‌న్ఫ్యూజ్ కావ‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది.

నిరంగల్ మూండ్రు క‌థ ఇదే...

వెట్రి (అథ‌ర్వ ముర‌ళి) సినిమా డైరెక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. చాలా ఏళ్ల నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తోన్న అత‌డికి సినిమా చేసే ఛాన్స్ వ‌స్తుంది. సెల్వం(శ‌ర‌త్‌కుమార్‌) అవినీతిప‌రుడైన పోలీస్ ఆఫీస‌ర్‌. డ‌బ్బు కోసం ఎలాంటి కేసునైనా తారుమారు చేస్తుంటాడు. త‌న స్వ‌భావానికి విరుద్ధంగా నిజాయితీగా న‌డుచుకోవాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతుంది.

వ‌సంత్‌కు (రెహ‌మాన్‌) స్కూల్ టీచ‌ర్‌గా మంచి పేరు ఉంటుంది. ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచే అత‌డి న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేసే ఓ సంఘ‌ట‌న జ‌రుగుతుంది. వెట్రి, సెల్వం, వ‌సంత్ ఈ ముగ్గురి జీవితాలు ఒక్క‌రోజులో ఎలా తారుమారు అయ్యాయి? ఈ ముగ్గురిలో హీరో ఎవ‌రు? విల‌న్‌ ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ఈ క‌థ‌లో శ్రీ పాత్ర ఏమిటి అన్న‌దే నిరంగ‌ల్ మూండ్రు మూవీ క‌థ‌.

ఐదో మూవీ...

కార్తిక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఐదో మూవీ ఇది. గ‌తంలో ద‌రువాంత‌ల్ ప‌థినారు, మాఫియా, మార‌న్‌తో పాటు మ‌రో రెండు సినిమాలు చేశాడు. తొలి సినిమా త‌ప్ప మిగిలిన‌వేవీ అత‌డికి అంత‌గా పేరు తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.

డైరెక్ట్‌గా ఓటీటీ...

నిరంగ‌ల్ మూండ్రు సినిమాలో అమ్ము అభిరామి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను తెలుగులోనూ థియేట‌ర్ల‌లో రిలీజ్‌చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. అనివార్య కార‌ణాల వాయిదాప‌డింది. తాజాగా తెలుగు వెర్ష‌న్ డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతోంది.

Whats_app_banner