మహిళల కోసం వింటర్ ఇన్నర్‌వేర్: చలి నుంచి రక్షణ కావాలంటే ఇవి ధరించండి
శీతాకాలంలో చలి నుంచి రక్షించుకోవడానికి సరైన లోదుస్తులు (ఇన్నర్‌వేర్) ధరించడం చాలా అవసరం. రాత్రి పూట, అలాగే పగటి పూట మీరు కంఫర్ట్‌గా ఉండాలంటే ఈ విషయాలపై దృష్టి పెట్టక తప్పదు. వెచ్చగా ఉండటానికి ఎక్కువ దుస్తులు అవసరమవుతాయన్న అపోహ నుంచి బయటకు రండి.
సరైన ఇన్నర్‌వేర్ ఎంచుకుంటే చలి పులి మిమ్మల్ని భయపెట్టదు. ఈ చలికాలం మీరు సౌకర్యవంతంగా ఉండేందుకు ఎలాంటి లోదుస్తులు ఎంపిక చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
థర్మల్ వేర్:
తెలుగు రాష్ట్రాల్లో థర్మల్ వేర్ అంత పాపులర్ కాదు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలం వచ్చిందంటే థర్మల్ వేర్ ఉండాల్సిందే. థర్మల్ వేర్‌లో టాప్స్, లెగ్గింగ్స్ ఉంటాయి. చలికాలం వచ్చిందంటే ఇవి తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సిందే. ఇవి చర్మానికి అతుక్కుపోయి లోపలికి చలిగాలి చొరబడకుండా చేస్తాయి. వీటిని సులభంగా అర్థం చేసుకోవాలంటే బనియన్ లాంటి క్లాత్ కాస్త మందంగా శరీరానికి పట్టినట్టు ఉంటుంది. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.
నాణ్యమైన ఒక జత థర్మల్ వేర్ సుమారు రూ. 700 ధరలో లభిస్తుంది. ఇవి శరీర వేడిని బంధిస్తాయి. తల నుండి కాలి వరకు వెచ్చగా ఉంచుతాయి. కాటన్ లేదా మెరినో ఉన్ని మిశ్రమాలతో కూడి ఉన్నవి, అలాగే శ్వాసక్రియకు అనుకూలమైన బట్టలను ఎంచుకోవాలి. ఇవి సాధారణంగా మీరు రోజువారీగా వాడే ప్యాంటీ, బ్రా లేదా పెట్టికోట్ పైన ధరించవచ్చు.
పగలు కూడా..
థర్మల్ వేర్ ధరించిన తరువాత మీరు రోజువారీగా ధరించే దుస్తులు, లేదా ఆఫీసు దుస్తులు ధరించవచ్చు. మీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలను అనుసరిస్తూ వీటిపైన స్వెటర్, జర్కిన్, జాకెట్, మఫ్లర్, తలకు ఉన్ని టోపీ ధరించవచ్చు. థర్మల్ లెగ్గింగ్స్ చలి కాలంలో వెచ్చగా ఉండటానికి అనువైనవి. వాటిని స్వెటర్లు, ట్యూనిక్స్ లేదా దుస్తులకు ముందు లేయర్‌గా వాడొచ్చు.
కామిసోల్స్, ట్యాంక్ టాప్స్:
- స్వెటర్లు లేదా కాడిగన్స్ కింద థర్మల్ కామిసోల్స్ లేయర్‌గా బాగా పనికొస్తాయి. ఎక్కువ దుస్తులు అవసరం లేకుండానే మీకు అదనపు వెచ్చదనాన్ని అందిస్తాయి.
- సిల్క్ కామిసోల్స్ చర్మానికి అతుక్కుని మృదువుగా అనిపించేలా ఉండే సౌకర్యవంతమైన ఎంపిక. వీటితో అందంగా కూడా కనిపిస్తారు. లేదా స్వెటర్‌ల క్రింద పొరలుగా కూడా ధరించవచ్చు.
- ఉలెన్ టైట్స్ కూడా శీతాకాలం కోసం ఒక మంచి ఎంపిక. అవి వెచ్చదనంతో పాటు స్టైల్‌ను అందిస్తాయి. స్కర్టులు లేదా ఇతర దుస్తులతో ధరించేందుకు అనుకూలంగా ఉంటాయి.
సరైన ఇన్నర్‌వేర్‌ను ఎంచుకోవడానికి చిట్కాలు:
- సరైన క్లాత్ ఎంచుకోండి: మెరినో ఉన్ని, కాటన్ వంటివి వెచ్చదనం ఇచ్చేందుకు, శ్వాసక్రియకు అనుకూలమైన దుస్తులు.
- ఫిట్‌ని పరిగణించండి: ఇన్నర్‌వేర్ చాలా బిగుతుగా లేదా చాలా వదులుగా లేకుండా కంఫర్ట్‌గా ఉండేలా సరిచూసుకోండి.
- లేయర్ ఎంపిక: హాయిగా, స్టైలిష్ దుస్తులను రూపొందించడానికి స్వెటర్లు, కాడిగన్స్, జాకెట్‌లలో మీ ఇన్నర్‌వేర్‌ను ధరించండి.
- సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వండి: మీ చర్మానికి మృదువుగా, సౌకర్యవంతంగా అనిపించే లోదుస్తులను ఎంచుకోండి.
- నాణ్యత: నాణ్యమైన ఇన్నర్‌వేర్ కొనుగోలు చేయడం ద్వారా, మీరు శీతాకాలం అంతా వెచ్చగా, హాయిగా, స్టైలిష్‌గా ఉండగలుగుతారు.
సంబంధిత కథనం