MSG: ఈ ఒక్క పదార్థమే మన బరువును పెంచి అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చేలా చేస్తోంది, ఇది లేని ఆహారమే తినండి-monosodium glutamate causes us weight gain and many health problems eat foods that are free from it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Msg: ఈ ఒక్క పదార్థమే మన బరువును పెంచి అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చేలా చేస్తోంది, ఇది లేని ఆహారమే తినండి

MSG: ఈ ఒక్క పదార్థమే మన బరువును పెంచి అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చేలా చేస్తోంది, ఇది లేని ఆహారమే తినండి

Haritha Chappa HT Telugu
Dec 17, 2024 09:30 AM IST

MSG: ఆహారాలకు రుచిని, మంచి వాసనను ఇచ్చేందుకు మోనోసోడియం గ్లూటామేట్ ను కలుపుతారు. దీన్నే MSG అని షార్ట్ కట్‌లో పిలుస్తారు. మన శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణం ఇదే అవుతోంది. దీని వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదాలు ఉన్నాయి. అసలు ఇదేంటో తెలుసుకోండి.

ఎంఎస్‌జీ అంటే ఏమిటి?
ఎంఎస్‌జీ అంటే ఏమిటి? (Canva)

ఆరోగ్యకరమైన వంటకాలు పెద్దగా నోరూరించే వాసన రావు. జంక్ ఫుడ్స్, చైనీస్ వంటకాలు ఘుఘుమలాడిపోతుంటాయి. తినాలన్న కోరికను పెంచేస్తాయి. ముక్కుకు, నాలుకకు నచ్చితే సరిపోదు, ఆరోగ్యానికి మంచిదైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. బయట దొరికే చైనీస్ ఫుడ్స్, ఫ్లేవర్స్ ఫుడ్స్ లో రుచికరంగా, సువాసన వీచేలా ఉండడానికి కారణం అందులో వాడే ఒక పదార్థమే. దాని పేరు మోనోసోడియం గ్లూటామేట్. దీన్ని ఎంఎస్‌జీ అని పిలుస్తారు. ఇది మన శరీరంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

మోనోసోడియం గ్లూటామేట్ ఎందుకు ప్రమాదకరం?

మోనోసోడియం గ్లూటామేట్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని ఎన్నో అధ్యయనాల్లో తేలింది.మోనోసోడియం గ్లూటామేట్ తో తయారు చేసిన ఆహారాలను తిన్నాక తలనొప్పి వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మోనోసోడియం గ్లూటామేట్ ఎక్కువగా తినేవారికి అధిక బరువుతో పాటూ ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతాయి. ఇది ప్రమాదకరమైనా… దీన్ని వందేళ్లకు పైగా ఆహార పరిశ్రమలో వినియోగిస్తారు. ఇది నీటిలో సులభంగా కరిగి, సోడియం, ఫ్రీ గ్లూటామేట్ గా విడిపోతుంది.

ఎంఎస్‌జి తో వచ్చే సమస్యలు

చైనీస్ ఆహారాల్లో మోనోసోడియం గ్లూటామేట్ అధికంగా ఉంటుంది. ఇది కలిపిన ఆహారాన్ని తిన్న తరువాత ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను MSG-సిస్టమ్ కాంప్లెక్స్ అంటారు. వివిధ అధ్యయనాల ప్రకారం, MSGని ఆహారంతో కలపడం చాలా విషపూరితమైనది. ఇది జీవక్రియ రుగ్మతలు వంటివి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా అధిక ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం వచ్చే ఛాన్స్ ను పెంచేస్తుంది.

ఎంఎస్‌జి, బరువు మధ్య సంబంధానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ, ఇది ఆకలి, జీవక్రియను నియంత్రించే లెప్టిన్ అనే హార్మోన్ తో ముడిపడి ఉంటుందని చెబుతున్నారు. పరిశోధన ప్రకారం, ఎక్కువ ఎంఎస్ జి తీసుకునే వ్యక్తులు ఎక్కువ లెప్టిన్ ను ఉత్పత్తి చేస్తారు. దీని వల్ల ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది. మీ శరీరం ఆహారం నుండి పొందే శక్తిని సరిగ్గా ప్రాసెస్ చేయదు. అందుకే ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

మెదడు రుగ్మతలు: గ్లూటామేట్ మెదడు పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. న్యూరోట్రాన్స్మిటర్‌గా పనిచేయడం ద్వారా సంకేతాలను ప్రసారం చేయడానికి నాడీ కణాలను ప్రేరేపించే రసాయన పదార్థం ఇది.అందువల్ల, ఇది నాడీ కణాలను మెదడులోని అధిక గ్లూటామేట్ స్థాయికి అతిగా ప్రేరేపించడం ద్వారా మెదడులో టాక్సిసిటీ పెరిగిపోతుంది. ఇది కణాల మరణానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.

సూప్‌లు, చిప్స్, క్యాన్‌లలో నిల్వ ఉంచిన చైనీస్ వంటకాలు వంటి వాటిలో ప్రిజర్వేటివ్స్‌తో నిండిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్రమైన తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

మోనోసోడియం గ్లూటామేట్ ఉండే ఆహారాలు

ఈ రసాయన పదార్ధాన్ని వివిధ రకాల ఆహారాల్లో ఉంటాయి. దీనిని సాధారణంగా అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలలో ఉపయోగిస్తారు. దీనిని తరచుగా ఫుడ్ ప్రాసెసింగ్ సమయంలో కూడా ఉపయోగిస్తారు. ఎంఎస్ జి ఎక్కువగా ఉపయోగించే ఆహారాల్లో చైనీస్ వంటకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చీజ్ రకాల్లో, చికెన్ నిల్వ వంటకాల్లో, సాసేజ్‌లు, పెప్పరోని, బేకన్, సలామీ, బార్బెక్యూ సాస్, కెచప్, మయోన్నైస్, ప్రాసెస్ చేసిన మాంసాహారాల్లో ఈ పదార్థాన్ని అధికంగా వాడుతారు. కాబట్టి ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకే ప్రయత్నించండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner