Brain Teaser: మీ మెదడుకో సవాల్, ఈ బ్రెయిన్ టీజర్లో ఏ మహిళ ఎక్కువ నీటిని ఇంటికి చేరుస్తుంది? 10 సెకన్లలో చెప్పేయాలి-which woman will take home the most water in this brain teaser say it in 10 seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brain Teaser: మీ మెదడుకో సవాల్, ఈ బ్రెయిన్ టీజర్లో ఏ మహిళ ఎక్కువ నీటిని ఇంటికి చేరుస్తుంది? 10 సెకన్లలో చెప్పేయాలి

Brain Teaser: మీ మెదడుకో సవాల్, ఈ బ్రెయిన్ టీజర్లో ఏ మహిళ ఎక్కువ నీటిని ఇంటికి చేరుస్తుంది? 10 సెకన్లలో చెప్పేయాలి

Haritha Chappa HT Telugu
Dec 05, 2024 11:00 AM IST

Brain Teaser: బ్రెయిన్ టీజర్‌లో ఇద్దరు మహిళలు నీళ్లు తెస్తున్నట్లు ఉంది. వారిద్దరిలో ఎవరు ఎక్కువ నీరు తెస్తారో చెప్పడమే మీ మెదడుకు సవాల్. పది సెకన్లలో మీరు జవాబును చెబితే మీ మెదడు అద్భుతంగా పనిచేస్తున్నట్టే.

బ్రెయిన్ టీజర్
బ్రెయిన్ టీజర్

బ్రెయిన్ టీజర్ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ బ్రెయిన్ టీజర్లు సమస్యా పరిష్కార నైపుణ్యాలను పెంచుతుంది. ఇవి సృజనాత్మకంగా ఆలోచించడానికి సహాయపడతాయి. ఈ బ్రెయిన్ టీజర్లు మన మెదడు పనితీరును మార్చేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే అప్పుడప్పుడు బ్రెయిన్ టీజర్లను సాధిస్తూ ఉండాలి.

yearly horoscope entry point

సాధారణంగా బ్రెయిన్ టీజర్లలో తప్పును గుర్తించడం, రెండు చిత్రాల మధ్య తేడాను గుర్తించడం, మ్యాథమెటికల్ పజిల్స్ మొదలైనవి ఉంటాయి. ఇది సాధించాలంటే ఎన్నో తెలివితేటలు ఉండాలి. అవి మన ఆలోచనా శక్తిని పెరిగేలా చేస్తాయి. అందుకే సోషల్ మీడియాలో చాలా బ్రెయిన్ టీజర్లు వైరల్ అవుతుంటాయి. అలాంటి బ్రెయిన్ టీజర్లలో ఇక్కడ మేము ఒకటి ఇచ్చాము.

బ్రెయిన్ టీజర్ లో ఏముంది?

ఇక్కడ మేము ఇచ్చిన బ్రెయిన్ టీజర్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిద్దరూ చెరో చేతిలో బకెట్లు పట్టుకుని ఉన్నారు. పక్కనే ఉన్న నది నుంచి ఇద్దరూ ఆ బకెట్ తో నీళ్లను మోసుకుని ఇంటికి తీసుకెళ్తున్నారు. మొదటి అమ్మాయి చెక్క బకెట్లో నీటిని తెస్తుండగా, రెండో అమ్మాయి స్టీల్ బకెట్ తో నీటిని మోస్తూ కనిపించింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ ఇంటికి ఎక్కువ నీటిని తీసుకెళతారో చెప్పాలి. అదే మీ ముందున్న సవాలు. మీ మెదడుకు పదును పెట్టి ఏ మహిళ ఎక్కువ నీటిని ఇంటికి తీసుకువెళుతుందో చెప్పండి.

ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా ఇట్టే జవాబును చెప్పాస్తారు. కేవలం పది సెకన్లలోనే మీరు జవాబును కనిపెట్టి చెప్పాలి. మీ మెదడుకు పదును పెట్టి జవాబును చెప్పండి.

బ్రెయిన్ టీజర్ జవాబు

బ్రెయిన్ టీజర్ జవాబును పది సెకన్లలో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక జవాబు కోసం ఆలోచిస్తున్న వారి కోసమే ఇక్కడ మేము సమాధానాన్ని ఇచ్చాము. ఆ ఇద్దరి మహిళలు తెస్తున్న బకెట్లను గమనించండి. మొదటి మహిళ పెద్ద బకెట్లు పట్టుకుంది. కానీ ఒక బకెట్ కు చివరన చిల్లు పడింది. కాబట్టి ఇంటికి వెళ్లేలోపు ఆ బకెట్ లోని నీళ్లన్నీ బయటికి కారిపోయే అవకాశం ఉంది. ఇక రెండో మహిళ చిన్న బకెట్లు పట్టుకున్నా కూడా అందులోని నీరంతా ఇంటికే చేరుతుంది. కాబట్టి రెండో మహిళే ఎక్కువ నీటిని ఇంటికి తీసుకెళుతుంది.

ఇలాంటి బ్రెయిన్ టీజర్లు తరచూ పరిష్కరించడం వల్ల ఒక సమస్యను విభిన్న కోణాల నుంచి చూసే అవకాశం మెదడుకు వస్తుంది. సమస్యలను అర్థం చేసుకునే సమర్థత కూడా మెదడుకు పెరుగుతుంది.

Whats_app_banner