Ayurveda Tea: నిద్రించే ముందు ఈ ఆయుర్వేద టీ తాగితే చాలు, కొన్ని రోజుల్లోనే పొట్ట కొవ్వు కరుగుతుంది
Ayurveda Tea: పెరుగుతున్న పొట్టతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్ చిట్కాను పాటించండి. ఆయుర్వేదం ప్రకారం పొట్ట కొవ్వును కరిగించేందుకు యోగా గురు హంసాజీ యోగేంద్ర ఒక బెడ్ టైమ్ డ్రింక్ గురించి చెప్పారు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
మారుతున్న జీవన శైలిలో పని ఒత్తిడి కారణంగా వ్యాయామం చేసే అవకాశం తగ్గిపోతోంది. నడక, రన్నింగ్ చేయకుండా జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల పొట్ట కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. రోజంతా ల్యాప్ టాప్ ముందు కూర్చోవడం, అధిక ఒత్తిడికి గురికావడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం వేగంగా పెరుగుతోంది. ఎంతో మంది బరువు పెరిగే సమస్యతో బాధపడుతున్నారు. మీ ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చడం ద్వారా, మీరు మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేయవచ్చు. ప్రముఖ యోగా గురువు హంసాజీ యోగేంద్ర బెల్లీ ఫ్యాట్ తగ్గించే టీ రెసిపీని అందించారు. దీన్ని ప్రతిరోజూ రాత్రి తాగితే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ప్రముఖ యోగా గురువు హంసాజీ యోగేంద్ర తన యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోను పంచుకున్నారు. ఇందులో అతను చాలా ప్రభావవంతమైన, సురక్షితమైన ఆయుర్వేద బరువు తగ్గించే పానీయం రెసిపీని పంచుకున్నారు. ఇది మీ పొట్ట కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. దీన్ని రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. యోగేంద్ర ప్రకారం, దీనిని ఒక నెల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ బొడ్డు కొవ్వు గణనీయంగా తగ్గుతుంది. అలాగే మీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామాలను చేస్తూ ఉండాలి. ఈ వెయిట్ లాస్ డ్రింక్ బరువు తగ్గడానికి మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
కొవ్వు తగ్గించే డ్రింక్
యోగా గురువు హంసాజీ యోగేంద్ర సూచించిన బెల్లీ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తయారు చేయడం చాలా సులువు. ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీటిని తీసుకోండి. అందులో రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసి 10 నిమిషాలు మరిగించాలి. తరువాత చిన్న అల్లం ముక్క వేసి మళ్లీ మరిగించాలి. అలాగే పావు స్పూను గుగ్గుల్ పొడి వేసి కలుపుకోవాలి. దీనితో పాటూ పావు స్పూను గార్సినియా పొడి కూడా వేసి మరిగించాలి. తరువాదత స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీన్ని వడకట్టి గ్లాసులో వేసుకుని తాగుతూ ఉండాలి. నెలరోజుల్లోనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఇందులో వాడిన దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది, అలాగే జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. అల్లం జీవక్రియను పెంచుతుంది, అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. మీ బరువు తగ్గడంలో గుగ్గల్, గార్సినియా… రెండూ చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ రెండూ కూడా ఆయుర్వేదం దుకాణంలో లభిస్తాయి.
ఈ వెయిట్ లాస్ డ్రింక్ ను ఒక గ్లాసులో తీసుకుని అందులో చిటికెడు పసుపు కలపాలి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది బరువు నిర్వహణకు చాలా సహాయపడుతుంది. ఇప్పుడు ఈ డ్రింక్ ను బాగా మిక్స్ చేసి వేడి టీలా తాగాలి. ఇది ఆరోగ్యకరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.