ACB Raids : నిర్మల్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన మరో అధికారి, ఏడాది వ్యవధిలో ఎనిమిదో కేసు
ACB Raids : నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు చేసింది. రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా మార్కెట్ కమిటీ వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
ఉమ్మడి అదిలాబాద్ లో ఏసీబీ దాడులు ఉద్యోగులకు కామన్ అయిపొయింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ఎన్నో దాడులు జరిగినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగి చలనం లేనట్టుగా ఉంది. వరుస దాడులు జరుగుతున్నప్పటికి ఉద్యోగులలో భయం లేకుండా పోయిందని మరొకసారి రుజువైంది. నిర్మల్ జిల్లాలో సరిగ్గా ఏడాది వ్యవధిలో ఏడు ఏసీబీ కేసులు నమోదైన విషయం మరువకముందే బుధవారం మరొక ఎనిమిదో కేసు నమోదు కావడం గమనార్షం.
లంచం తీస్కోంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన వ్యవసాయ శాఖ అధికారి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వద్ద గల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.7వేలు లంచం తీసుకుంటుండగా మార్కెట్ కమిటీ వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కొత్త లైసెన్స్ రెన్యువల్ కు పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా, ఏడు వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారని, ఇవాళ రూ.7 వేలను కార్యాలయంలో ఏడీ శ్రీనివాస్ కు బాధితుడు వెంకట్ ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఏసీబీ అధికారుల వరుస దాడులతో అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తుంది.
రిపోర్టింగ్: కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు