తెలుగు న్యూస్ / ఫోటో /
Mantras For Kids: మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి ఈ ఐదు మంత్రాలు తప్పకుండా నేర్పించండి
- Mantras For Kids: పిల్లలకు మంచి విలువలు, సానుకూలతతో పాటు ఆధ్యాత్మిక అనుభూతులను నేర్పించడం అనేది ప్రతి తల్లిదండ్రి, గురువుల బాధ్యత. ఆధ్యాత్మిక మంత్రాలు అనేవి పిల్లల్లో ధైర్యం, శాంతి, ప్రేమ, జ్ఞానాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఈ మంత్రాలను రోజూ జపించడం ద్వారా పిల్లలు జ్ఞానం, వివేకం, శాంతిని పొందగలుగుతారు.
- Mantras For Kids: పిల్లలకు మంచి విలువలు, సానుకూలతతో పాటు ఆధ్యాత్మిక అనుభూతులను నేర్పించడం అనేది ప్రతి తల్లిదండ్రి, గురువుల బాధ్యత. ఆధ్యాత్మిక మంత్రాలు అనేవి పిల్లల్లో ధైర్యం, శాంతి, ప్రేమ, జ్ఞానాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఈ మంత్రాలను రోజూ జపించడం ద్వారా పిల్లలు జ్ఞానం, వివేకం, శాంతిని పొందగలుగుతారు.
(1 / 6)
ఓం విశ్వ సృష్టిని ప్రతిబింబించే ప్రతిధ్వానం (వైబ్రేషన్) ఓం. సృష్టి మొదలైన ఓంకార శబ్దం హిందూ సంప్రదాయాలలో అతి ప్రాముఖ్యమైనది. పిల్లలకు మంత్రాలను పరిచయం చేసే ముందుగా నేర్పించాల్సిన శబ్దం ఓంకారం. ప్రతి రోజూ ఉచ్ఛరించేలా చూడండి. (pixabay)
(2 / 6)
ఓం శాంతి శాంతి శాంతిఃఅర్థం: శాంతి శాంతి శాంతిపిల్లలను ప్రశాంతంగా మార్చడంతో పాటు సంతోషంగా ఉంచేందుకు ఉపయోగించాలి. ఏ ప్రార్థనలో అయినా చివరిగా మూడు సార్లు ఓం శాంతి శాంతి శాంతిః అని జపించడం వల్ల మాకు శాంతి ప్రసాదించమని భగవంతుడ్ని ప్రార్థించడమన్నమాట. (pixabay)
(3 / 6)
గణపతి శ్లోకం - ఓం గం గణపతయే నమహ అర్థం: గణనాథునికి నమస్కారములుప్రయోజనాలు: పిల్లలకు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం అందించి విశ్వాసాన్ని పెంచుతుంది. గణ నాయకుని ప్రార్థించడం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయని పిల్లలకు తెలియజేయండి.
(4 / 6)
సరస్వతీ మంత్రం- ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే వాక్ దేహి నమస్తుతేఅర్థం: సరస్వతీ దేవికి నమస్కారాలుప్రయోజనాలు: విలువైన జ్ఞానాన్ని, విద్యా బుద్ధులను పిల్లలకు అందించేందుకు ప్రేరేపిస్తుంది. అక్షరాభ్యాసం చేసిన నాటి నుంచి పాఠశాలకు వెళ్లే ప్రతిరోజూ ఈ శ్లోకం పఠించడం మంచిది.
(5 / 6)
ఓం భూర్ భువ స్వాహాఅర్థం: ఓ సమస్త జీవరాశిని పోషించే దివ్యమైన వెలుగా కాపాడు.ప్రయోజనాలు: సూర్యుని శక్తి ప్రాముఖ్యత గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తుంది. సమస్త మానవాళికి అవసరమైన కాంతి వెలుగా మమ్మల్ని కాపాడమని దివ్య వెలుగైన సూర్యుని అనుగ్రహం కోసం అడిగినట్లు అవుతుంది. (pixabay)
ఇతర గ్యాలరీలు