Vaibhav Suryavanshi: అండర్-19 ఆసియా కప్‌లో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం.. భారత్ ఘన విజయం
ఐపీఎల్ 2025 వేలంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ.1.10 లక్షలు ఖర్చు చేస్తే అందరూ ఆశ్చరపోయారు. అతని సత్తాఏంటో.. ఈరోజు ప్రపంచానికి మరోసారి వైభవ్ చూపించాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకి అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యపరిచిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ .. అండర్ -19 ఆసియా కప్‌లో అదరగొట్టేశాడు. వేలం తర్వాత జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన వైభవ్.. సెమీస్‌కు ముందు బ్యాట్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ 2025 కోసం వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.
10 వికెట్ల తేడాతో విజయం
షార్జా వేదికగా యూఏఈతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 10 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ జట్టు సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టగా.. శుక్రవారం శ్రీలంకతో సెమీఫైనల్-2 మ్యాచ్ ఆడనుంది.
ఈరోజు మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 44 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకి పరిమితం అవగా.. రయాన్ ఖాన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
వికెట్ నష్టపోకుండా
అనంతరం లక్ష్యాన్ని భారత్ జట్టు 16.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించేసింది. ఛేదనలో వైభవ్ సూర్యవంశీ 46 బంతుల్లోనే 3 ఫోర్లు 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 76 పరుగులు చేశాడు. అతనితో పాటు ఆయుష్ కూడా 51 బంతుల్లో 67 పరుగులు చేయడంతో భారత్ అలవోకగా గెలిచింది.
సెమీస్ చేరిన భారత్
పాకిస్థాన్, యూఏఈ, జపాన్‌లతో గ్రూప్-ఎలో భారత జట్టు గ్రూప్ దశలో మ్యాచ్‌లు ఉంది. దాంతో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక సెమీఫైనల్లో భారత్ శ్రీలంకతో తలపడనుండగా, పాకిస్థాన్ బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం దుబాయ్ వేదికగా జరగనుంది.