IND vs PAK Cricket: నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ - బరిలో ఐపీఎల్ ప్లేయర్లు - ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
IND vs PAK: ఆసియా కప్ అండర్ 19 టోర్నీలో తొలి మ్యాచ్‌లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. నేడు(శనివారం) దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.ఈ మ్యాచ్‌కు ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాడు.
IND vs PAK: అండర్ 19 ఆసియా కప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు. అండర్ 19 ఆసియా కప్ వన్డే ఫార్మెట్‌లో జరుగుతోంది.
వైభవ్ సూర్యవంశీ...
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు టీమిండియా ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాడు. పదమూడేళ్ల యంగ్ క్రికెటర్ ఇటీవల ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోటి పది లక్షలకు అమ్ముడుపోయాడు. అతడిని రాజస్థాన్ రాయల్స్ టీమ్ సొంతం చేసుకున్నది. ఐపీఎల్ వేలంలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడు ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
వైభవ్‌తో పాటుగా...
వైభవ్ సూర్యవంశీతో పాటు ఆండర్ 19 ఆసియా కప్ టీమ్‌లోని ఆంద్రే సిద్ధార్థ్, కుమారప్ప కార్తికేయ కూడా ఇటీవలే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయారు. ఆంద్రే సిద్ధార్థ్‌ను 30 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొన్నది. కుమారప్ప కార్తికేయ రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలో దిగనున్నాడు. 30 లక్షల బేస్ ధరకు అతడిని రాజస్థాన్ తీసుకుంది. ఆసియా కప్‌లో సత్తా చాటి ఐపీఎల్‌లో తుది జట్టులో స్థానం దక్కించుకోవాలని ఈ ముగ్గురు క్రికెటర్లు భావిస్తోన్నారు.
వేలంలో నిరాశే...
అండర్ 19 టీమ్ కెప్టెన్ మహ్మద్ అమన్, హార్దిక్ రాజ్, ఆయూష్ మహాత్రేతో పాటు మిగిలిన ప్లేయర్లు ఆన్‌క్యాప్‌డ్ కోటాలో ఐపీఎల్ వేలంలో నిలిచారు. కానీ వారిని ఏ జట్టు తీసుకోలేదు.
ఒకే గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్...
అండర్ 19 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ ఓకే గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ ఏలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ ఉండగా...గ్రూప్ బీలో ఇండియా, పాకిస్థాన్, జపాన్, యూఏఈ ఉన్నాయి. అండర్ 19 ఆసియా కప్‌లో టీమిండియా టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది.
టీమిండియా జట్టు ఇదే...
మహ్మద్ అమన్, హర్వాన్ష్ సింగ్, హార్దిక్ రాజ్, వైభవ్ సూర్యవంశీ, ప్రణవ్ పత్, కార్తికేయ, ఆయూష్ మహాత్రే, సమర్ధ్ నాగరాజ్, నిఖిల్ కుమార్, యుధాజీత్ గుహా, చేతన్ శర్మ, కిరణ్, అనురాగ్ కవాడే, ఆంద్రే సిద్ధార్థ్, మహ్మద్ ఎన్నాన్
పాకిస్థాన్ టీమ్ ఇదే...
సాద్ బేగ్, మహ్మద్ తయ్యబ్ ఆరిఫ్, షాజియాబ్ ఖాన్, హరూన్ హర్షద్, అలీ రెజా, అహ్మద్ హుస్సైన్, రయిజుల్లా, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ సుభాన్, ఫహామ్ ఉల్ హక్, హుజైఫా, ఉమర్ జైబ్, అహ్మద్ అహ్మద్, నవీద్ అహ్మద్ ఖాన్.