Tilak Varma: ఆసియా క‌ప్‌కు టీమిండియా కెప్టెన్‌గా తిల‌క్ వ‌ర్మ - ఐపీఎల్ స్టార్ల‌కు చోటు!-tilak varma to lead india a team in emerging asia cup 2024 ipl abhishek sharma ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Tilak Varma: ఆసియా క‌ప్‌కు టీమిండియా కెప్టెన్‌గా తిల‌క్ వ‌ర్మ - ఐపీఎల్ స్టార్ల‌కు చోటు!

Tilak Varma: ఆసియా క‌ప్‌కు టీమిండియా కెప్టెన్‌గా తిల‌క్ వ‌ర్మ - ఐపీఎల్ స్టార్ల‌కు చోటు!

Nelki Naresh Kumar HT Telugu
Oct 14, 2024 12:18 PM IST

Tilak Varma: ఇండియా ఏ టీమ్‌కు కెప్టెన్‌గా తెలుగు ప్లేయ‌ర్ తిల‌క్‌వ‌ర్మ ఎంపిక‌య్యాడు. ఈ నెల 18 నుంచి జ‌రుగ‌నున్న ఎమ‌ర్జింగ్ ఆసియా క‌ప్ కోసం ఇండియా ఏ టీమ్‌ను బీసీసీఐ అనౌన్స్‌చేసింది. తిల‌క్ వ‌ర్మ‌, అభిషేక్ శ‌ర్మ‌తో పాటు ఐపీఎల్ స్టార్స్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు.

తిలక్ వర్మ
తిలక్ వర్మ

Tilak Varma: ఇండియా ఏ టీమ్ కెప్టెన్‌గా తెలుగు ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ సెలెక్ట్ అయ్యాడు. ఒమ‌న్ వేదిక‌గా అక్టోబ‌ర్ 18 నుంచి ఎమ‌ర్జింగ్ ఆసియా క‌ప్ టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ ఐపీఎల్ స్టార్స్‌తో కూడిన ఇండియా ఏ టీమ్‌ను ప్ర‌క‌టించింది. ఈ టోర్నీలో ఇండియా ఏ టీమ్‌కు సార‌థిగా తిల‌క్ వ‌ర్మ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. తిల‌క్ వ‌ర్మ‌ను కెప్టెన్‌గా బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఐపీఎల్ 2024లో మెరుపులు మెరిపించిన ఆట‌గాళ్లు అంద‌రికి ఇండియా ఏ టీమ్‌లో బీసీసీఐ చోటు క‌ల్పించింది.

ప్ర‌భ్‌సిమ్రాన్‌సింగ్‌...

స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్ అభిషేక్ శ‌ర్మ ఎమ‌ర్జింగ్ ఆసియా క‌ప్ ఆడ‌నున్నాడు. అత‌డితోపాటు ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్‌, నేహ‌ల్ వాదేరా, ఆయూష్ బ‌దోని, ర‌మ‌ణ్‌దీప్ సింగ్‌, సాయికిషోర్‌, అంజూ రావ‌త్‌, అన్షుల్ కాంబోజ్‌, హృతిక్ షోకిన్‌, అఖిబ్ ఖాన్‌, ర‌సిక్ స‌లామ్‌, నిషాంత్ సింధు, రాహుల్ చాహ‌ర్‌ల‌ను ఎమ‌ర్జింగ్ ఆసియా క‌ప్ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసింది.

అభిషేక్ శ‌ర్మ ఓపెన‌ర్‌...

ఈ టోర్నీలో అభిషేక్ శ‌ర్మ‌, ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్ ఓపెన‌ర్లుగా బ‌రిలో దిగ‌బోతున్నారు. ఐపీఎల్ 2024 ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అభిషేక్ శ‌ర్మ‌, ప్ర‌భ్ సిమ్రాన్ ప‌రుగుల వ‌ర‌ద పారించారు. అభిషేక్ శ‌ర్మ 484 ర‌న్స్ చేయ‌గా...ప్ర‌భ్ సిమ్రాన్ 334 ర‌న్స్‌చేశాడు. అయూష్ బ‌దోనీ, అంజూ రావ‌త్‌, సాయికిషోర్ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణించారు.

ఎనిమిది టీమ్‌లు..

ఎమ‌ర్జింగ్ ఆసియా క‌ప్‌లో మొత్తం ఎనిమిది టీమ్‌లో పాల్గొన‌నున్నాయి. ఇండియాతో పాటు పాకిస్థాన్‌, శ్రీలంక‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, హంకాంగ్‌, ఒమ‌న్‌, యూఏఈ త‌ల‌ప‌డ‌నున్నాయి. టీ20 ఫార్మెట్‌లో టోర్నీ జ‌రుగ‌నుంది.

16 టీ20లు, నాలుగు వ‌న్డేలు...

తిల‌క్ వ‌ర్మ టీమిండియా త‌ర‌ఫున ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు వ‌న్డేలు, 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ప‌ద‌హారు టీ20ల్లో రెండు హాఫ్ సెంచ‌రీల‌తో 336 ర‌న్స్‌చేశాడు. రెండు వికెట్లు తీశాడు. నాలుగు వ‌న్డేల్లో ఓ హాఫ్ సెంచ‌రీతో 68 ప‌రుగులు సాధించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు తిల‌క్ వ‌ర్మ‌. 38 మ్యాచుల్లో 1156 ప‌రుగులు సాధించాడు.

Whats_app_banner