చలికాలంలో ఎండు ద్రాక్షలతో ఎనలేని ప్రయోజనాలు - వీటిని తెలుసుకోండి

image source https://unsplash.com/

By Maheshwaram Mahendra Chary
Nov 30, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో సీజనల్ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.  అయితే ఎండుద్రాక్ష ఈ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

image source https://unsplash.com/

ఎండు ద్రాక్షలో పాలీఫెనాల్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఎండు ద్రాక్షను పాలతో కలిపి తీసుకుంటే శరీరానికి చాలా మేలు జరుగుతుంది.

image source https://unsplash.com/

ఎండుద్రాక్షలో ఉండే పీచు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  ఉబ్బరం,  మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి.

image source https://unsplash.com/

ఎండు ద్రాక్ష తీసుకుంటే శరీర జీవక్రియను పెంచుతుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

image source https://unsplash.com/

ఎండు ద్రాక్షలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

image source https://unsplash.com/

విటమిన్ సి కారణంగా ఎండుద్రాక్ష శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను ధృడపరుస్తుంది.

image source https://unsplash.com/

ఎండు ద్రాక్షలో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ వంటివి ఉంటాయి. వీటిలోని ఐరన్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. విటమిన్ సి జుట్టుకు తేమను అందించి.. సహజ రంగును కాపాడుతుంది. 

image source https://unsplash.com/

చలికాలంలో దాల్చిన చెక్కతో లాభాలు ఇవే.. తప్పక తీసుకోండి!

Photo: Pexels