Pushpa: పుష్ప మూవీని రిజెక్ట్ చేసిన స్టార్స్ ఎవరో తెలుసా? అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్ ఫస్ట్ ఛాయిస్ కాదట
Pushpa 2 Cast and Budget: పుష్ప మూవీ కోసం తొలుత సుకుమార్ ముగ్గురు స్టార్‌ల దగ్గరికి వెళ్తే.. భిన్నమైన కారణాలు చెప్పి నో చెప్పారట. దాంతో.. అల్లు అర్జున్, రష్మిక మంధాన, ఫహద్ ఫాజిల్ దగ్గరికి సుకుమార్ వెళ్లారు.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మంధాన, ఫహద్ ఫాజిల్ ఓవర్‌నైట్ పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదిగారు. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్’ డిసెంబరు 5 (గురువారం) థియేటర్లలోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో సుమారు 12,500 థియేటరల్లో పుష్ప 2 రిలీజ్‌కాబోతోంది.
ముగ్గురు రిజెక్ట్ చేస్తే
వాస్తవానికి పుష్ప మూవీకి అల్లు అర్జున్, రష్మిక మంధాన, ఫహద్ ఫాజిల్ ఫస్ట్ ఛాయిస్ కాదట. దర్శకుడు సుకుమార్ ముగ్గురు స్టార్స్‌ని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నారట. అయితే.. ఆ ముగ్గురూ రిజెక్ట్ చేయడంతో.. లక్కీగా అల్లు అర్జున్, రష్మిక, పహద్ ఫాజిల్‌కి ఛాన్స్ దొరికింది. ఇంతకీ పుష్ప మూవీని వదులుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?
మహేష్ బాబు ఎందుకు రిజెక్ట్ చేశారంటే?
పుష్ప రాజ్ క్యారెక్టర్ కోసం తొలుత మహేష్ బాబుని సుకుమార్ సంప్రదించారట. అయితే.. గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి సంకోచించిన మహేష్ బాబు ఈ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌కి సుకుమార్ కథని చెప్పడం.. మూవీ ఓకే అవ్వడం.. ఆ తర్వాత అంతా అందరికీ తెలిసిందే. పుష్ప 1లో అల్లు అర్జున్ నటనకి జాతీయ అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే.
రిపీట్ చేయడం ఇష్టంలేక నో చెప్పిన సమంత
సినిమాలో శ్రీవల్లి పాత్ర కోసం సమంతకు ముందుగా సుకుమార్ ఆఫర్ ఇచ్చారట. అయితే.. అప్పటికే సుకుమర్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించిన సమంత.. శ్రీవల్లి క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిందట. దాంతో రష్మికకి ఆ అవకాశం దొరికింది. ఈ సినిమాతో నేషనల్ క్రష్‌గా ఎదిగిన రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోంది.
విజయ్ సేతుపతి నో ఎందుకు చెప్పారంటే?
విలన్ గా ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించడానికి ఫహద్ ఫాజిల్ కంటే ముందు విజయ్ సేతుపతిని సుకుమార్ సంప్రదించారట. అయితే.. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాలో నటించలేనని విజయ్ సేతుపతి చెప్పారట. దాంతో ఫహద్ ఫాజిల్‌కి అవకాశం దక్కింది. ఒక్కటి తక్కువైంది పుష్ప.. పార్టీ లేదా పుష్ప డైలాగ్‌తో సౌత్‌లో ఫహద్ ఫాజిల్ ఫేమస్ అయిపోయారు.
పుష్ప 2 మూవీ రిలీజ్‌కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ.100 కోట్లకిపైగా వసూళ్లని రాబట్టింది. అలానే రూ.1,000 కోట్ల వరకూ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1000 కోట్ల వరకూ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టాపిక్