AP Weather Report : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు-ap weather condition moderate rain in some districts imd alert ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Report : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP Weather Report : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Bandaru Satyaprasad HT Telugu
Dec 04, 2024 10:32 PM IST

AP Weather Report : అరేబియా సముద్రంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

 ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, ఏపీలో రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, ఏపీలో రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది వచ్చే 24 గంటలలో పశ్చిమం వైపు కదులుతూ బలహీనపడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

డిసెంబర్ 05, గురువారం :

రేపు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

విపత్తు నిర్వహణ శాఖపై హోంమంత్రి సమీక్ష

సచివాలయంలో విపత్తు నిర్వహణ శాఖపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ శాఖ హెచ్ఓడీలతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 219 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లలో వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ కలెక్టర్లను పర్యవేక్షించవలసిందిగా ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలు, తుపాను షెల్టర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో ఉన్న ముందస్తు హెచ్చరికలను పంపే వ్యవస్థ(ఈడబ్ల్యూడీఎస్) సైరన్ అలారమ్ సిస్టం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విపత్తు సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్ట నివారణ చర్యలతో పాటు సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన శిక్షణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వాయుగుండం సమయంలో అంచనాకోసం అవసరమైన పరికరాల మరమ్మతులు సహా కొత్త టెక్నాలజీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుని విపత్తు నిర్వహణ శాఖను పటిష్టంగా మారుస్తామన్నారు.

దేశంలో వాతావరణం

దేశంలో ఈ వారం వాతావరణంపై ఐఎండీ ప్రకటన చేసింది. ఈ వారం దేశంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. డిసెంబర్ 15 తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశ ఉందని తెలిపింది. డిసెంబర్ 15 తర్వాత దట్టమైన పొగమంచు, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. యాక్టివ్ వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ వల్ల మంచుకురవడం పెరుగుతుందని వెల్లడించింది.

క‌ర్ణాట‌క, కోస్తా తీరాన్ని ఆనుకుని తూర్పు మ‌ధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాబోయే 2 రోజుల్లో ఇది అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటలల్లో అల్పపీడనం గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. ఆవర్తనం ప్రభావంతో కేరళ, కోస్టల్ కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక, కోస్తాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ మహారాష్ట్ర, దక్షిణ కొంకణ్, గోవా, విదర్భ, దక్షిణ ఒడిశాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Whats_app_banner

సంబంధిత కథనం