Andhra Pradesh News Live December 4, 2024: AP Free Electricity : 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 04 Dec 202401:14 PM IST
AP Free Electricity : ఎస్సీ, ఎస్టీలకు అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
Wed, 04 Dec 202411:50 AM IST
Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ పంపిణీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. అదనంగా రోజుకు 50 వేల చిన్న లడ్డూలు, 4 వేల పెద్ద లడ్డూలు, 3500 వడలు తయారీకి టీటీడీ సిద్ధమైంది. ఈ మేరకు పోటు సిబ్బందిని నియమించనుంది.
Wed, 04 Dec 202410:57 AM IST
- పుష్ప 2 సినిమాపై రాజకీయం రగడ నెలకొంది. పిఠాపురంలో సినిమా పోస్టర్లను చించివేసిన ఘటనలు వెలుగు చూశాయి. మరోవైపు అనంతపురం జిల్లాలో పుష్ప 2 పోస్టర్లపై జగన్ ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో పుష్ప సినిమాకు రాజకీయ రంగు అంటుకున్నట్లు అయింది.
Wed, 04 Dec 202410:01 AM IST
Konaseema News : కోనసీమ జిల్లాలో దారుణం జరిగింగి. ఓ ప్రభుత్వ పాఠశాలలో 3,4 తరగతుల విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు మూడు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చిన్నారులు ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Wed, 04 Dec 202409:35 AM IST
PIL On Pushpa 2 : పుష్ప 2 టికెట్ల రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ల రేట్లు భారీగా పెంచారని, ఇది చట్ట విరుద్ధమని పిల్ దాఖలైంది. టికెట్ల రేట్ల పెంపుపై కోర్టు కల్పించుకోవాలని కోరారు.
Wed, 04 Dec 202409:11 AM IST
- అదానీ ముడుపుల కేసు వ్యవహారంలో మాజీ సీఎం జగన్ పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటన చేశారు. జగన్ అవినీతి, నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. తాను పర్సనల్ గా మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి కూడా అడుగు బయటపెట్టరంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
Wed, 04 Dec 202408:13 AM IST
- Tirumala Dams: ఆంధ్రప్రదేశ్‌ను తరచూ పలకరిస్తున్న అల్పపీడనాలు, అకాల వర్షాలతో తిరుమల గిరుల్లోని జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఓ దశలో తిరుపతి నుంచి తిరుమలకు నీటిని కూడా తరలించాల్సి వస్తుందని భావించినా ఇప్పుడా అవసరం లేకుండా పోయింది.
Wed, 04 Dec 202406:23 AM IST
- Mid Day Meals: రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరుశాతం, విద్యాప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు.
Wed, 04 Dec 202405:14 AM IST
- BEL Machilipatnam Jobs: మచిలీపట్నం భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్‌ను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
Wed, 04 Dec 202404:23 AM IST
- AP CID Chief: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై వేటు పడింది. నిధుల మళ్లింపుతో పాటు అధికార దుర్వినియోగం అభియోగాలపై సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Wed, 04 Dec 202402:35 AM IST
- AP TG Earth Tremors: తెలుగు రాష్ట్రాలను భూ ప్రకంపనలు వణికించాయి. ఉదయం 7 గంటల నుంచి 7.20 మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు ఎక్కువగా కనిపించాయి. ఖమ్మం,భద్రాద్రి,వరంగల్, కృష్ణాలో ప్రకంపనలు కనిపించాయి.
Wed, 04 Dec 202402:00 AM IST
- Chandrababu Residence: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాస చిరునామా త్వరలో మారనుంది. పదేళ్లుగా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియాలో ప్రస్తుత వెలగపూడి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేశారు.
Wed, 04 Dec 202401:32 AM IST
- Polavaram Dues: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పునరావాసం, పరిహారం, భూసేకరణల కోసం ప్రభుత్వం రూ. 996 కోట్లను విడుదల చేసింది. 2026నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
Wed, 04 Dec 202412:57 AM IST
- AP Cabinet: ఏపీలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మరో రెండేళ్ల గడువు పొడిగించారు. ఆర్జీజీఎస్ ద్వారా సులభంగా పౌర సేవల్ని అందించాలని నిర్ణయించారు. క్యాబినెట్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే…