Aditya 369 Sequel: ఆదిత్య 369 సీక్వెల్‌పై ఎట్టకేలకి బాలయ్య క్లారిటీ.. హీరో పేరుని కూడా అధికారికంగా ప్రకటన
Nandamuri Balakrishna: ఆదిత్య 369 మూవీ వచ్చి 33 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈ సినిమాని ట్రెండ్ సెట్టర్‌గానే చూస్తున్నారు. అంతలా ప్రేక్షకులకి గుర్తుండిపోయిన ఆ మూవీ ఎన్ని రోజుల్లో తీశారో తెలుసా? బడ్జెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఆదిత్య 369 సీక్వెల్‌పై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. నందమూరి బాలకృష్ణ పలు సందర్భాల్లో ఇప్పటికే సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ..అధికారికంగా మాత్రం ఆ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? ఎవరు హీరో? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే.. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4లో బాలయ్య అన్ని ప్రశ్నలకీ సమాధానం ఇచ్చేశారు.
ఆదిత్య 999 అప్‌డేట్స్
‘‘ఆదిత్య 369కి సీక్వెల్‌గా ఆదిత్య 999 రాబోతోంది. ఇందులో మా అబ్బాయి మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం వర్క్ జరుగుతోంది. అన్నీ కుదిరితే..వచ్చే ఏడాది ఆదిత్య 999 మూవీ విడుదల అవుతుంది’’ అని నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు.. ఆ మూవీలో లుక్‌లోనే అన్‌స్టాపబుల్ షోకి బాలయ్య వచ్చారు.
ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తేజ మూవీ
మోక్షజ్ఞ తేజ ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే కథా చర్చలు, స్క్రిప్ట్ వర్క్ పూర్తవగా.. మోక్షజ్ఞ తేజ డ్యాన్స్, యాక్షన్ సీన్స్‌లో నటించడంపై శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హనుమాన్‌తో బ్లాక్‌బాస్టర్ హిట్‌ను అందుకున్న ప్రశాంత్ వర్మ.. తన‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ర్స్’లోనే ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు.
110 రోజుల్లోనే.. రూ. 1 కోటి ఖర్చుతో
టైమ్ ట్రావెల్, టైమ్ మిషన్ కథాంశంగా 1991లో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ మూవీ అప్పట్లో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. బాలయ్యతో కలిసి మోహిని ఆ మూవీలో నటించగా.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. భూత, భవిష్యత్ కాలం కాన్సెప్ట్ అప్పట్లో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద ఆదిత్య 369 భారీగా వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ షూటింగ్ అప్పట్లో కేవలం 110 రోజుల్లోనే పూర్తవడం గమనార్హం. ఖర్చు కూడా అప్పట్లో రూ.1 కోటి అయ్యింది.